ట్విట్టర్ (ట్విటర్) కొత్త సీఈవో ఎలన్ మస్క్ సంస్కరణల్లో భాగంగా .. యూజర్లకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రముఖుల, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి.. సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లను నియంత్రించాలని నిర్ణయించారు. పేరడీ అని లేబుల్ లేకుండా.. కొనసాగే అకౌంట్‌లపై శాశ్వతంగా వేటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వరుసగా చేసిన ట్వీట్లలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ట్విటర్‌లో కొందరు ఫన్నీ కంటెంట్ క్రియేషన్ పేరిట ప్రముఖలు, పాపులర్ పేర్లను ఉపయోగించి పేరడీ అకౌంట్లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై వాళ్లు పేరడీ అని ట్విటర్ హ్యాండిల్‌లో స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే ఆ ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తారు. గతంలో ముందుగా హెచ్చరించిన తర్వాతే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై పేరడీరాయుళ్ల వేషాలు కుదరవని పరోక్షంగా స్పష్టం చేశారు ఎలన్ మస్క్.
Going forward, any Twitter handles engaging in impersonation without clearly specifying “parody” will be permanently suspended
— Elon Musk (@elonmusk) November 6, 2022
అకౌంట్ సైనప్ అయ్యే సమయంలోనే ఈ మేరకు ఇకపై షరతుల్లో ఆ విషయం స్పష్టం చేయనుంది ట్విటర్. ఇంతకు ముందులా వార్నింగ్ ఇవ్వకుండానే ఖాతాపై వేటు ఉంటుందని మస్క్ మరో ట్వీట్‌లో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ పేరిట అదీ వెరిఫైడ్ మార్క్‌తో ఓ ప్రొఫైల్ నుంచి భోజ్‌పురి పదాలతో ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది పేరడీ అకౌంట్ కావడంతో ట్విటర్ దానిని తొలగించింది.
Any name change at all will cause temporary loss of verified checkmark
— Elon Musk (@elonmusk) November 6, 2022
పేరడీ నిర్ణయం మాత్రమే కాదు.. పేరులో ఏదైనా మార్పు గనుక జరిగినా.. నష్టం తప్పదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ‘‘ఏదైనా పేరు మార్పు తాత్కాలికంగా ధృవీకరించబడిన చెక్‌మార్క్‌ను కోల్పోతుంది’’ అని పేర్కొన్నారాయన. ఇక ట్విటర్‌లో నిషేధిత ఖాతాలు పునరుద్ధరణ పైనా ఎలన్ మస్క్ గతవారం ఒక స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖాతాలు తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు ఒక పద్దతి ఉంటుందని, ట్విటర్ సైట్‌లో అది పూర్తి అయ్యాకే సదరు ఖాతా పునరుద్ధరణ అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
Widespread verification will democratize journalism & empower the voice of the people
— Elon Musk (@elonmusk) November 6, 2022
ఇక విస్తృత ధృవీకరణ ద్వారా జర్నలిజాన్ని ప్రజాస్వామ్యం చేస్తుందని, ప్రజల గొంతును శక్తివంతం చేస్తుంది
ఇదీ చదవండి: హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
Comments
Please login to add a commentAdd a comment