permanently delete
-
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్‌లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్‌పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్‌గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్‌పెట్టండి!) -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్‌లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్విటర్లో ఇక అలాంటి వేషాలు కుదరదు
ట్విట్టర్ (ట్విటర్) కొత్త సీఈవో ఎలన్ మస్క్ సంస్కరణల్లో భాగంగా .. యూజర్లకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రముఖుల, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి.. సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లను నియంత్రించాలని నిర్ణయించారు. పేరడీ అని లేబుల్ లేకుండా.. కొనసాగే అకౌంట్లపై శాశ్వతంగా వేటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వరుసగా చేసిన ట్వీట్లలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ట్విటర్లో కొందరు ఫన్నీ కంటెంట్ క్రియేషన్ పేరిట ప్రముఖలు, పాపులర్ పేర్లను ఉపయోగించి పేరడీ అకౌంట్లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై వాళ్లు పేరడీ అని ట్విటర్ హ్యాండిల్లో స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే ఆ ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తారు. గతంలో ముందుగా హెచ్చరించిన తర్వాతే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై పేరడీరాయుళ్ల వేషాలు కుదరవని పరోక్షంగా స్పష్టం చేశారు ఎలన్ మస్క్. Going forward, any Twitter handles engaging in impersonation without clearly specifying “parody” will be permanently suspended — Elon Musk (@elonmusk) November 6, 2022 అకౌంట్ సైనప్ అయ్యే సమయంలోనే ఈ మేరకు ఇకపై షరతుల్లో ఆ విషయం స్పష్టం చేయనుంది ట్విటర్. ఇంతకు ముందులా వార్నింగ్ ఇవ్వకుండానే ఖాతాపై వేటు ఉంటుందని మస్క్ మరో ట్వీట్లో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ పేరిట అదీ వెరిఫైడ్ మార్క్‌తో ఓ ప్రొఫైల్ నుంచి భోజ్‌పురి పదాలతో ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది పేరడీ అకౌంట్ కావడంతో ట్విటర్ దానిని తొలగించింది. Any name change at all will cause temporary loss of verified checkmark — Elon Musk (@elonmusk) November 6, 2022 పేరడీ నిర్ణయం మాత్రమే కాదు.. పేరులో ఏదైనా మార్పు గనుక జరిగినా.. నష్టం తప్పదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ‘‘ఏదైనా పేరు మార్పు తాత్కాలికంగా ధృవీకరించబడిన చెక్‌మార్క్‌ను కోల్పోతుంది’’ అని పేర్కొన్నారాయన. ఇక ట్విటర్లో నిషేధిత ఖాతాలు పునరుద్ధరణ పైనా ఎలన్ మస్క్ గతవారం ఒక స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖాతాలు తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు ఒక పద్దతి ఉంటుందని, ట్విటర్ సైట్లో అది పూర్తి అయ్యాకే సదరు ఖాతా పునరుద్ధరణ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. Widespread verification will democratize journalism & empower the voice of the people — Elon Musk (@elonmusk) November 6, 2022 ఇక విస్తృత ధృవీకరణ ద్వారా జర్నలిజాన్ని ప్రజాస్వామ్యం చేస్తుందని, ప్రజల గొంతును శక్తివంతం చేస్తుంది ఇదీ చదవండి: హిందూ ప్రధానిగా గర్విస్తున్నా -
ఫేస్‌బుక్‌ను శాశ్వతంగా డిలీట్ చేశా
సాక్షి, ముంబై: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ డేటా బ్రీచ్ దుమారం బాలీవుడ్‌ను తాకిందనిపిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ (44) సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఫేస్బుక్ ఖాతాను డిలీట్ చేస్తున్నానంటూ మంగళవారం సోషల్ మీడియా లో వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ పోస్ట్ పెట్టారు. తన ఫేస్బుక్ ఖాతాను శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ తన అకౌంట్ పేజ్ ఇంకా ఉనికిలో ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఎందుకు తన ఖాతాను తొలగించిందీ స్పష్టం చేయలేదు. కానీ ఇప్పటికే గ్లోబల్‌గా డిలీట్ ఫేస్బుక్ ఉద్యమం ఉధృతమవుతుండగా ఈ సెగ ఇపుడు బాలీవుడ్‌కు పాకిందనే అంచనాలు మాత్రం భారీగా నెలకొన్నాయి. మరోవైపు హాలీవుడ్ నటుడు జిమ్ క్యారీ, ఫిబ్రవరిలోనే ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పారు. అయితే తాజా వివాదం నేపథ్యంలో ఫేస్బుక్ సీఈవో జుకర్ బర్గ్‌పై విమర్శలు గుప్పిస్తూ ట్విటర్లో స్పందించారు. సింగర్, నటి చెర్‌తోపాటు మరికొందరు కూడా ఇదే బాటలో నిలిచారు. కాగా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 50 మిలియన్ల ఫేస్బుక్ వినియోగదారులు డేటాను కేంబ్రిడ్జ్ ఎనలిటికా దక్కించుకుందున్నవార్త గ్లోబల్‌గా కలకలం రేపింది. దీనిపై అమెరికా ఫెడరల్ యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమీషన్ విచారణను మొదలుపెట్టింది. Good morning. This is to inform you all that I have permanently deleted my personal Facebook account. However, the verified FarhanAkhtarLive page is still active. — Farhan Akhtar (@FarOutAkhtar) March 27, 2018 Who are you sharing your life with? #regulatefacebook pic.twitter.com/r7B7Ajkt0V — Jim Carrey (@JimCarrey) March 20, 2018 -
శాశ్వతంగా ఫేస్ బుక్ డిలీట్ చేయడం ఇలానే...
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్బుక్ నుంచి వైదొలుగుద్దామని నిర్ణయించుకున్నారా? శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫేస్ బుక్ డిలీట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్‌ను ఫాలో అయితే అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసేయొచ్చట. డిలీట్ చేసిన అకౌంట్‌ను మళ్లీ రీ-యాక్టివేట్ చేసుకోవడానికి కూడా వీలుపడదట. ఈ ప్రక్రియతో మీరు షేర్ చేసిన ప్రొఫైల్ తో సహా మొత్తం శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. శాశ్వతంగా ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేసే పద్ధతి: స్టెప్ 1: ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి, సెట్టింగ్స్ కు వెళ్లాలి. స్టెప్ 2: జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ లో కిందుండే కాఫీ ఆఫ్ ఆల్ యువర్ ఫేస్ బుక్ డేటా 'డౌన్ లోడ్' ఆప్షన్ ను క్లిక్ చేయాలి. స్టెప్ 3: https://www.facebook.com/help/delete_account లింక్ లోకి వెళ్లాలి, డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. స్టెప్ 4: ఒక్కసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి, తుది ఆమోదం కోసం క్యాప్చా కోడ్ ఓ ఇమేజ్ రూపంలో డిస్ ప్లే అవుతోంది. ఫైనల్ గా ఫేస్ బుక్ మీ అకౌంట్ ను డిలీట్ చేస్తున్నట్టు నోటిఫై చేస్తోంది. 14 రోజుల లోపల మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 14 రోజుల్లో మీకు ఫేస్ బుక్ అకౌంట్ ను డిలీట్ చేసుకోవాలనిపించకపోతే, వెంటనే ఫేస్ బుక్ లోకి లాగిన్ అయి డిలీట్ రిక్వెస్ట్ ను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. 90 రోజుల్లో మీరు పోస్టు చేసిన అన్ని పోస్టులు, ఫోటోలు, స్టేటస్ అప్ డేట్లు అన్నింటిన్నీ కంపెనీ శాశ్వతంగా డిలీట్ చేసేస్తుంది.