
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్‌లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్‌పెట్టొచ్చు.
కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే...
- రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి.
- విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్‌గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కళ్లకింద రాసి మర్దన చేయాలి.
- పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి.
- ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది.
(చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్‌పెట్టండి!)
Comments
Please login to add a commentAdd a comment