under
-
కళ్లకింద ముడతలు, నల్లటి వలయాలు శాశ్వతంగా పోవాలంటే..?
మన ఏజ్ ఎంత? అని చెప్పేసేవి మన కళ్లే. వయసు చిన్నదైనా సరే మన కళ్లు కింద నలుపు ఉండి, ముడతులు వచ్చాయా అంతే పెద్దొళ్లుగా కింద ట్రీట్ చేసేస్తారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దగ్గర నుంచి ఆఫీస్‌లో పనిచేసే మహిళల వరకు అందర్నీ వేధించే సమస్యే ఇది. ధైర్యం చేసే ఏమైనా రాద్దాం అంటే కళ్లు కదా! ఏదైన సమస్య వస్తుందని భయపడుతుంటా. అలాంటి వాళ్లంతా ఇలా చేస్తే ఆ సమస్యకు సులభంగా చెక్‌పెట్టొచ్చు. కళ్లకింద ఏర్పడిన నల్లటి వలయాలు, ముడతలు, మచ్చలు అందమైన ముఖారవిందాన్ని పాడుచేస్తాయి. ఈ చిట్కాలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరికినట్లే... రాత్రి పడుకునేముందు కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని కళ్ల కింద రాసి మర్దన చేసి పడుకోవాలి. ఉదయాన్నే నీటితో కడిగేయాలి. విటమిన్ ఇ ఆయిల్ కొల్లాజెన్ బూస్టర్‌గా పనిచేసి కళ్లకింద రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు తోడ్పడు తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ను కళ్లకింద రాసి మర్దన చేయాలి. పై రెండూ అందుబాటులో లేని వారు కనీసం కొబ్బరి నూనెను అయినా కళ్లకింద రాసుకుని మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క చిట్కానైనా క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లోనే ముడతలు, మచ్చలు పోయి ముఖారవిందం బాగుంటుంది. (చదవండి: చలికాలంలో జుట్టు పొడిబారి డల్‌గా ఉంటుందా? ఈ టిప్స్‌తో సమస్యకు చెక్‌పెట్టండి!) -
ఆపరేషన్ క్లీన్ మనీ: 9లక్షల ఖాతాలు సందేహాస్పదం
న్యూఢిల్లీ: 'ఆపరేషన్ క్లీన్ మనీ' ప్రక్రియలో ఇటీవల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా వివరణకు ఇచ్చిన గడువు (ఫిబ్రవరి 15) ముగియడంతో తదుపరి చర్యలకు దిగుతోంది. ఈ మేరకు రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఇటీవల గుర్తించిన 18 లక్షల అనుమానాస్పద ఖాతాల్లో దాదాపు సగం ఖాతాలపై ఆదాయపన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేసింది. 9 లక్షల ఖాతాల్లో బ్యాంకు డిపాజిట్లను 'సందేహాస్పదంగా' గుర్తించినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కొత్త పన్ను అమ్నెస్టీ పథకం మార్చి 31 న ముగిసిన అనంతరం ఈ ఖాతాలపై చర్యకు దిగనునున్నట్టు ప్రకటించింది. ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా డీమానిటైజేషన్ 50-రోజుల కాలంలో రూ.5 లక్షలకు పైన అనుమానాస్పద డిపాజిట్లపై ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా 18 లక్షలమందిని ఆరాతీసింది. వీరిలో చాలా మంది ఫిబ్రవరి 12దాకా తమకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీటికి సమాధానం చెప్పని ఖాతాదారులు , సరియైన న్యాయపరమైన వివరణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ వర్గాలు ప్రకటించాయి. తమ నోటీసులకు ప్రత్యుత్తరం పంపనివారికి లేదా ఐటిఆర్ వెల్లడిపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు చెప్పేవారిపై కచ్చితంగా చర్య తీసుకోబడుతుందన్నాయి. 2016-17 ఆదాయ రిటర్న్స్ తోనే సరిపోలనీ, లేదా గడచిన సంవత్సరాలలో ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటే వాటిని అక్రమ ఆస్తులు, లేదా నల్లధనం కింద పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ రిజిస్టర్ కాని సుమారు 4.84లక్షల పన్నుచెల్లింపుదారులకు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్ లు పంపినట్టు తెలిపింది. అయితే ఎస్ ఎంఎస్ ఇ-మెయిల్ చట్టపరమైన నేపధ్య లేని నేపథ్యంలో, అధికారిక నోటీసులు పంపడానికి, తదుపరి చర్యలు మార్చి 31 వరకు వేచి ఉంటామని తెలిపింది. ఆపై సందేహాస్పద డిపాజిట్లపై చర్యలుంటాయని తెలిపింది. ఆదాయ వెల్లడికి ఉద్దేశించిన పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మార్చి 31 వరకు నడుస్తుంది కాబట్టి , ఈ లోపు సంపదను వెల్లడించి పన్నులు చెల్లించాస్తారా లేదా అనేది డిపాజిటర్లు తేల్చుకోవాలని పేర్కొంది. కాగా రద్దయిన నోట్ల డిపాజిట్లపై 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ వివరణ ఇవ్వాల్సిందిగా ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా కోరింది. ఇందుకుగానుఫిబ్రవరి 15వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు హర్షి్వత
చింతూరు : మండలానికి చెందిన ఓ గిరిపుత్రిక అండర్ – 7 విభాగంలో జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైంది. చింతూరులోని శాంతి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న సున్నం హర్షి్వత నవంబరులో జరుగనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అర్హత సాధించింది. 8, 9 తేదీల్లో కృష్ణాజిల్లా నూజివీడులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం ద్వారా హర్షి్వత జాతీయస్థాయికి ఎంపికైనట్టు తండ్రి సున్నం వెంకటరమణ తెలిపారు. హర్షి్వత, ఆమె సోదరి జోషిత కాకినాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవగా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ – 7 విభాగంలో హర్షి్వత మూడోస్థానం, అండర్ – 14 విభాగంలో జోషిత ఆరో స్థానంలో నిలిచారు. -
జోరుగా వర్షాలు
జిల్లాలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదు సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో కుండపోత ఖమ్మం వ్యవసాయం: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాల్లో శనివారం మొదలైన వర్షాలు ఆదివారం నాటికి పుంజుకున్నాయి. ఆదివారం రోజున మూడు మండలాలు (ఎర్రుపాలెం, బోనకల్లు, ఇల్లెందు) మినహా అన్నిచోట్ల వర్షం కురిసింది. ఆదివారం ఉదయానికి జిల్లా సగటు వర్షపాతం 2.2 సెం.మీ.గా నమోదైంది. సత్తుపల్లి, పినపాక, ముల్కలపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చండ్రుగొండ, వెంకటాపురం, దుమ్మగూడెం, భద్రాచలం, దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, కూసుమంచి మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. 14 మండలాల్లో సాధారణ స్థాయిలో, 13 మండలాల్లో అక్కడక్కడ వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 7.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుంజుకున్న వర్షపాతం జిల్లాలో వర్షపాతం కొంతమేరకు పుంజుకుంది. ఏడు మండలాల్లో (పినపాక, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, ముల్కలపల్లి, సత్తుపల్లి) సాధారణానికి మించి (20 శాతానికి పైగా) వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో (వాజేడు, వెంకటాపురం, చర్ల, గుండాల, దుమ్ముగూడెం, పాల్వంచ, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, కామేపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, వేంసూరు, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, ఏన్కూరు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం)లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో (సింగరేణి, చింతకాని, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల, నేలకొండపల్లి) ఇంకా లోటు వర్షపాతమే ఉంది. మొత్తంగా చూస్తే, సింగరేణి మినహా ఏజెన్సీ అంతటా వర్షపాతం సాధారణం.. అంతకున్నా ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతంలోని ఐదు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. జలాశయాల్లోకి చేరుతున్న నీరు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది... ఇంకా చేరుతోంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీటి రాక పెరుగుతోంది. సత్తుపల్లి మండలంలోని జలాశయాల్లోకి నీరు చేరుతోంది. ముల్కలపల్లి మండలంలోని ముత్యాలంపాడు వాగు ప్రవహిస్తోంది. మూకమామిడి ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వస్తోంది. దమ్మపేట మండలంలోని చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేంసూర్ మండలంలో దిద్దుపూడి వాగు ప్రవహిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులోకి నీరు చేరుతోంది. కొత్తగూడెం మండలంలోని ముర్రేడు వాగు ప్రవహిస్తోంది. మణుగూరు, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. ప్రస్తుతం సాగులోగల పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి తదితర పైర్లకు ఈ వర్షాలు ఉపయోగపడతాయి. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (సెం.మీలలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం వర్షపాతం(సెం.మీ.లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––– 6–9 సెం.మీల మధ్య వర్షపాతం నమోదైన మండలాలు సత్తుపల్లి 7.82 పినపాక 6.66 ముల్కలపల్లి 6.00 3–6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు పెనుబల్లి 5.34 చండ్రుగొండ 5.24 భద్రాచలం 4.94 దమ్మపేట 4.68 వెంకటాపురం 4.52 దుమ్ముగూడెం 4.52 వేంసూరు 3.30 కూసుమంచి 3.24 1–3 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైన మండలాలు కల్లూరు 2.88 అశ్వాపురం 2.80 ముదిగొండ 2.78 బూర్గంపాడు 2.46 పాల్వంచ 2.38 చర్ల 2.28 వాజేడు 2.22 నేలకొండపల్లి 1.92 అశ్వారావుపేట 1.88 కొత్తగూడెం 1.76 మణుగూరు 1.66 జూలూరుపాడు 1.28 ఏన్కూరు 1.02 గుండాల 1.00 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మూడు మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 13 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
రైతులకు అందుబాటులో ధరలు ఉండాలి
కోదాడ: వ్యవసాయ రంగంలో అధునిక పరికరాల వాడకం ఎక్కువగా ఉన్నపుడే రైతులు అధిక దిగుబడులు సా«ధిస్తారని కోదాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీ కె. శశిధర్‌రెడ్డి అన్నారు. యంత్రాల ధరలు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన కోరారు. కోదాడలో వీఎంసీ జాన్‌ఢీర్ ట్రాక్టర్ షోరూంలో కొత్త సీరిస్ ట్రాక్టర్‌ను ఆయన ప్రాంభించారు. కొత్త ట్రాక్టర్ ధర తక్కువ ఉండడం వల్ల రైతులకు మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సురేష్‌కుమార్, కోదాడ డివిజన్ మేనేజర్ రామారావు, రాయపూడి వెంకటనారాయణ, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, లంకెల నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో షూటర్ రియాజ్
–బుల్లెట్లు, తపంచాలు స్వాధీనం – జిల్లా కేంద్రంలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడిగా పేరు – భూదందాలు, ఆయుధాల సరఫరా, సెటిల్మెంట్లలో పాత్ర..? – కొనసాగుతున్న సోదాలు నల్లగొండ క్రైం గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలలో ప్రత్యక్ష, పరోక్ష పాత్రధారుల గుట్టు విప్పేందుకు పోలీస్ యంత్రాంగం దూసుకుపోతోంది. దీనిలో భాగంగానే జిల్లా కేంద్రంలో ముఖ్య అనుచరులుగా పేరుగాంచిన షార్ప్ షూటర్ రియాజ్‌తో పాటు టమాట శ్రీను, జహంగీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. రియాజ్ హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకోగా పోలీసులు కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇతడి వద్ద ఒక తపంచాతో పాటు భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎవరీ రియాజ్..? రియాజ్ కుటుంబానికి, అతడి ప్రత్యర్థి వర్గానికి చాలా ఏళ్లుగా పాతకక్షలు ఉన్నాయని తెలసింది. ఈ నేపథ్యంలో రియాజ్ కొన్నేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లాడని ప్రచారంలో ఉంది. తన కుటుంబంపై దాడి జరిపిన ప్రత్యర్థివర్గంపై కక్ష పెంచుకుని కొన్నేళ్ల క్రితం తిరిగి వచ్చి ఒకే రోజు నిమిషాల వ్యవధిలో జిల్లా కేంద్రంలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపి సంచలనం సృష్టించాడని సమాచారం. అయితే ప్రత్యర్థి వర్గం ప్రతికారేచ్ఛతో తనను ఎక్కడ మట్టుబెడుతుందోనన్న ప్రాణభయంతో నయీమ్ పంచన చేరినట్టు తెలుస్తోంది. ఆయుధాలు, భూదందాలు, సెటిల్మెంట్లు..? నయీమ్ నేరసామ్రాజ్య విస్తరణలో భాగంగా అతడి పంచన చేరిన రియాజ్ తొలుత భూదందాలు, సెటిల్మెంట్లలో రెచ్చిపోయినట్టు సమాచారం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ‘భాయ్’ అండతో అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ తన కార్యకలాపాలకు సాగించినట్టు సమాచారం. దీంతో నయీమ్ వద్ద పేరు తెచ్చుకుని ఆయుధాల సరఫరాలో కూడా ముఖ్యపాత్ర పోషించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రియాజ్ ఎక్కుగా నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూదందాలు, సెటిల్మెంట్లలో ప్రధాన పోషించాడని తెలుస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా నయీమ్ పనిని బట్టి నగదును ముట్టజెప్పేవాడని రియాజ్ పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం. ప్రధానంగా ఏడుగురు.. పేరు చెప్పుకుని ..? జిల్లా కేంద్రంలో నయీమ్ అనుచరవర్గం ప్రధానంగా ఏడుగురు ఉన్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే రియాజ్, టమాట శ్రీను, జహంగీర్లు పోలీసుల అదుపులో ఉన్నారని సమాచారం. మిగిలిన వారి కోసం కూడా ఖాకీలు వేటను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే నయీమ్ దందాల్లో టమాట శ్రీను. జహంగీర్ పోషించిన పాత్ర కూడా తక్కువేమీ లేదని సమాచారం. వీరు కూడా భూదందాలు, సెటిల్మెంట్లలో ఆరితేరిపోయినట్టు తెలుస్తోంది. వీరిని పోలీసులు లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పోతే పట్టణంలో నయీమ్ పేరు చెప్పుకుని వసూళ్లకు పాల్పడే చోటమోట వారికి లెక్కేలేదని తెలుస్తోంది. అయితే పోలీసులు వారిని కూడా పట్టుకునేందుకు కూపీలు లాగుతున్నట్టు తెలిసింది. -
ప్రజావసరాలకు అనుగుణంగా రైతుబజార్లు
సీఈవో రమణమూర్తి కాకినాడ సిటీ : ప్రజల అవసరాలకు అనుగుణంగా రైతుబజార్లలో సేవలు అందేలా చర్యలు చేపడుతున్నట్టు సీఈవో బీవీ రమణమూర్తి తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతుబజార్లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. రమణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 10 రైతుబజార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. రైతుబజార్లన్నింటికీ పటిష్టమైన షెడ్లు నిర్మించడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురంలోని జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో రైతుబజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. తొలుత జిల్లాలోని రైతుబజార్ల పనితీరును జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సీఈవోకు వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీఈఈ ఎస్ఎస్వీ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బీమా పడగ నీడలో భద్రమ్....!
బీమా పేరుతో భారీ దోపిడీ ∙కోటనందూరు మండలంలో రూ.30 కోట్లు స్వాహా! ∙తెల్లకార్డులున్న నిరుపేదలకూ భారీ పాలసీలు ∙తప్పుడు ధ్రువపత్రాతో అక్రమాలు ∙మరణానికి చేరువగా ఉన్నవారే లక్ష్యం ముక్కూమొహం తెలియని వ్యక్తి పేరున బీమా చేస్తారు. బీమా చేశారన్న విషయం ఆ వ్యక్తికీ తెలియదు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. తనను ఎందుకు చంపుతున్నారో కూడా అతడికి అంతుపట్టదు. అతడి పేరున బీమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాజేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో జరుగుతోంది. ఇదేదో సినిమా కథలా ఉంది కదూ. ఏడాది క్రితం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంచుమించు ఇదే తరహా సంఘటనలు జిల్లాలోనూ చోటుచేసుకుంటున్నాయి. దీని తీగలాగితే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. – కోటనందూరు మరికొన్నాళ్లలో మరణించే వారి పేరున భారీ మొత్తంలో బీమా పాలసీ చేయించి, వారు చనిపోయాక ఆ పరిహారంలో ఏజెంట్లు వాటా దండుకున్న సంఘటనలు కోటనందూరు మండలంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా భీమవరపుకోటలో జరిగిన ఇలాంటి వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కావడంతో, నకిలీ బీమా పాలసీల బాగోతంలో తీగ దొరికినట్టయింది. బహుళజాతి బీమా కంపెనీల్లో కొందరు ఏజెంట్లు.. ప్రాణాంతక వ్యాధులతో, మరణానికి చేరువులో ఉన్న వారి వివరాలను ముందుగా సేకరిస్తారు. ఈ ప్రక్రియలో వైద్యవృత్తిలో ఉన్నవారు, వ్యాధిగ్రస్తుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటారు. వ్యాధిగ్రస్తుల బంధువులను కలసి, బీమా వ్యవహారంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రీమియం మొత్తం ఏజెంట్ చెల్లిస్తే, పరిహారం మంజూరయ్యాక కొంతభాగం బాధిత కుటుంబానికి ఇవ్వడానికి, ఒకవేళ ప్రీమియం వ్యాధిగ్రస్తుల బంధువులు చెల్లిస్తే, చెరిసగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. భారీగా నగదు వస్తుందన్న ఆశతో నిరుపేద కుటుంబాల వారు సైతం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి వెనుకాడడం లేదు. సాధారణంగా నిర్ణీత వయస్సు వారికి మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. వృద్ధులకు కూడా తక్కువ వయస్సు నమోదు చేయించి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించకుండానే ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాల వారు కూడా భారీ మొత్తంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ, బీమా కంపెనీలు ఎందుకు జాగురుకతతో వ్యవహరించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం మంజూరు కోసం వస్తున్న విచారణాధికారులకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యమే. స్థిరమైన పెద్ద బీమా కంపెనీల జోలికి ఈ ఏజెంట్లు వెళ్లడం లేదు. కొత్తగా వచ్చిన బీమా కంపెనీలనే వీరు బురిడీ కొట్టిస్తున్నారు. రూ.30 కోట్లు హుష్‌కాకి! పదేళ్లుగా కేవలం కోటనందూరు మండలంలోనే సుమారు రూ.30 కోట్ల మేరకు ఇలా కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బీమా ఏజెంట్లను కంపెనీ తొలగించగా, మరలా వారే బినామీ పేర్లతో పాలసీలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది కంపెనీలకు ఈ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ ఏజెంట్లు ఇలాంటి వ్యవహారాల్లో చక్రం చక్రం తిప్పుతూ, అనతికాలంలోనే లక్షలాది రూపాయలు గడించారని సమాచారం. ఇలాంటి వ్యవహారాలు కోటనందూరు, జగన్నాథపురం, భీమవరపుకోట, కాకరాపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్నట్టు తెలిసింది. బీమా మోసాలపై ఫిర్యాదు చేయండి త్వరలో చనిపోతారని భావించిన వారి పేరున బీమా పాలసీ చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సరైన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. కోటనందూరులో ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. -
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
చిలుకూరు: ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చిలుకూరుకు చెందిన దళితవాడ సమీపంలో కోదాడ – హుజూర్నగర్ రోడ్డుపై ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్, మండల కార్యదర్శి కందుకూరి ఎల్లయ్య, నాయకులు సిద్దెల శ్రీను, జిల్లా శ్రీను, మల్లేపంగు ఉపేందర్, వీరబాబు, రాంబాబు, ప్రవీణ్, గోపి తదితరులు పాల్గొన్నారు. -
21 ఇన్‌క్లైన్ బొగ్గు గని మూత!
ఏడు నెలల్లో ముగియనున్న భూగర్భ గని జీవితకాలం బదిలీ భయంతో కార్మికుల ఆందోళన నూతన గని ప్రారంభించాలని డిమాండ్ ఇల్లెందుఅర్బన్: ఇల్లెందు ఏరియాలోని 21 ఇన్‌క్లైన్ భూగర్భ గని జీవితకాలం మరో ఏడు నెలల్లో ముగియనుంది. 2017 మార్చి నాటికి గనిలో ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం గనిలో 497 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గని జీవితకాలం ముగిసేనాటికి సుమారు 60 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. మిగిలిన కార్మికుల్లో మాత్రం బదిలీ భయం పట్టుకుంది. ఏళ్లతరబడి స్థానికంగా పని చేసి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం రెండేళ్ల నుంచి దశలవారీగా బదిలీ చేస్తూ కార్మికుల సంఖ్యను కుదించింది. గని జీవితం కాలం మరికొంత కాలం పెంచాలని, అది సాధ్యపడకపోతే నూతన గనిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు విభాగాలకు ముప్పు 21 ఇన్‌క్లైన్ మూతపడితే సమీపంలోని వర్క్‌షాపు, ఆటోవర్క్షాపు, స్టోర్స్‌లతో పాటు ఏరియా వైద్యశాల తదితర విభాగాలకు ముప్పు వాటిల్లనుంది. గని మూతపడితే ఆయా విభాగాలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో కార్మికుల సంఖ్య 15 మంది కంటే మించిలేరు. మూతపడే నాటికి సగానికిపైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు ఎటు తేలని సొసైటీ అవినీతి గని మరో ఏడు నెలల్లో మూతపడనుందని యాజమాన్యమే చెబుతోంది. రెండేళ్లుగా 21 ఇన్‌క్లైన్ సొసైటీ అవినీతిపై విచారణ జరుగుతోంది. అక్రమార్కులను ఇప్పటివరకు తేల్చలేదు. డిపాజిటర్లకు రావాల్సిన నగదును పూర్తిగా చెల్లించలేకపోయారు. వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. కొందరు అక్రమార్కులు చక్రం తిప్పుతూ గని మూతపడే వరకు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గని మూతపడితే తమ పరిస్థితి ఏమిటని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్కాస్టులే దిక్కు ఇల్లెందు ఏరియాలో ఉన్న ఒకే ఒక్క అండర్ గ్రౌండ్మైన్ మూతపడటంతో కేఓసీ, జేకే–5 ఓసీల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. యాజమాన్యం గని మూతపడిన అనంతరం మెగా ఓసీకి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మూతపడిన గని ప్రదేశాన్ని ఓసీగా మార్పు చేసి ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు. 21 ఇన్‌క్లైన్‌కు చివరి గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరగనున్న ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో 21 ఇన్‌క్లైన్ కార్మికులు ఓటు వేయనున్నారు. మళ్లీ జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి గని మూతపడి ఉంటుంది. మళ్లీ దఫా జరగనున్న ఎన్నికల నాటికి ఇక్కడి కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేయనున్నారు. గని జీవితకాలం పెంచాలి గనిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మూసివేయడం సరికాదు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి మరో నాలుగైదేళ్లు గని జీవితం కాలం పెంచవచ్చు. కార్మికులను బదిలీ చేయొద్దు –కె.సారయ్య, ఏఐటీయూసీ నేత నూతన గనులు ప్రారంభించాలి యాజమాన్యం నూతన గనుల ఏర్పాటు విషయమై ఆలోచించడంలేదు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు గని జీవితకాలాన్ని పెంచడంలో విఫలమయ్యారు. యాజమాన్యం పునరాలోచించి నూతన గనులను ప్రారంభించాలి. –సత్యనారాయణ, హెచ్ఎంఎస్ నేత యాజమాన్యానికి విన్నవించాం ఇల్లెందు ఏరియాలో నూతన గనులు ప్రారంభించాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇల్లెందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. 21ఇన్‌క్లైన్ గని జీవిత కాలం పెంచాలి. కార్మికులను బదిలీ చేయొద్దు. –జగన్నాథం, టీబీజీకేఎస్ నేత -
ఎన్నాళ్లు ఈ చెట్ల కింద చదువులు
నిత్యం మూడు తరగతులు చెట్ల కిందనే పేరుకే సక్సెస్ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో శూన్యం నూతన గదులు మంజురు చేయాలని కోరుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు చిలుకూరు క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మాత్రం మారడం లేదు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారు. ఇందుకు నిదర్శనమే చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల. పేరుకే ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల. కాని వసుతులు చూస్తే మాత్రం అంతా శూన్యమే. ప్రతి ఏడాది ఈ పాఠశాలలో పదవ తరగతిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్‌లు ఎంపిక కావడం, విద్యార్థులకు పాఠశాలలో పాఠాలు బోధించడం అంతా సక్రమంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాధి గణనీయంగా పెరుగుతూ వస్తుంది. కానీ పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు సరిపడా లేకపోవడంతో చెట్ల కింద చదువులు తప్పడం లేదు. చెట్ల కింద పాఠాల బోదన అంటే తాము సైతం ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు సైతం అంటున్నారు. తరగతి గది వాతావరణం లేకపోవడంతో భయట విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఆటంకం కలుగుతుందని అంటున్నారు. మూడు తరగతులు చెట్ల కిందనే.. చిలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల పాఠశాల సక్సెస్ పాఠశాల కావడంతో 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలు ఉన్నాయి. మొత్తం ఈ పాఠశాలలో 430 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ చొప్పున విద్యార్థులకు సంబంధించి తరగతి గదులు 10 గదులు కావాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయులు, కంప్యూటర్ గది, ఉపాధ్యాయులు గదితో కలుపుకొని మొత్తం 13 గదులు కావాల్సి ఉంది. అయితే ఈ పాఠశాలలో 10 గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో నిత్యం మూడు తరగతులు వారు చెట్ల కింద ఉండాల్సిందే. సక్సెస్ పాఠశాలగా ఎంపిక చేసిన తరువాత అదనపు గదులు కూడ మంజూరు చేయాల్సి ఉన్నప్పుటికి నేటి వరకు గదులు మంజూరు చేయలేదు. దీంతో విద్యార్థులు చాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అదికారులు చొరవ తీసుకొని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని పలువురు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
రాందేవ్ కు మరో భారీ షాక్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు పోటీగా దూసుకు వస్తున్న యోగా గురు రాందేవ్ కంపెనీ పతంజలికి మరోసారి ఎదురు దెబ్బతప్ప లేదు. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ) మళ్లీ మొట్టికాయలు వేసింది. దేశ ప్రకటనలపై వాచ్డాగ్ స్కానర్ గా ఉన్న ఈ సంస్థ 'దాంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్ కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని వివరించింది. దంతస్రావం, వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు పసుపు రంగులో కి మారడం సెన్సిటివిటీ, చెడువాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి మోసానికి పాల్పడిందని తెలిపింది. క్రిములు, సూక్ష్మజీవులనుంచి పళ్లను దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు, పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా సందిగ్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది పతంజలితోపాటుగా సహా అనేక కంపెనీ యాడ్స్ పై అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది. న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్ యు ఎల్ ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది. న్యూ గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణం తెల్లబడటం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. డార్క్ స్పాట్స్ పై పోరాటం... తక్షణం తెల్లబడటం ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని సమర్థించింది. ఫుడ్ అండ్ బ్యావెరేజెస్ రంగంలో దేశంలో మిస్ లీడింగ్ యాడ్స్ పై దేశ సర్వోన్నత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) తో గత వారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎఎస్సీఐ ఈ నివేదికలు రూపొందించింది. -
అక్కడ ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం!
సముద్ర గర్భంలో ఎన్నో వింతలు విశేషాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో పరిశోధకులు సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించడం ప్రారంభించారు. లక్షల ఏళ్ళ క్రితమే చివరి మంచు యుగం ప్రకారం సముద్ర మట్టానికి అడుగున ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నట్లు సైంటిస్టులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఫ్లోరిడా ఆసిల్లా నదీ గర్భంలో జరిపిన పరిశోధనల్లో అమెరికా ప్రజల ఉనికిని తెలిపే మరిన్ని సాక్ష్యాలు ఆవిష్కరించాయి. ప్రాచీన చరితకు ఆనవాళ్ళు లభించాయి. ఆరు దశాబ్దాల ముందే ఎవ్వరికీ తెలియని కొత్త ప్రపంచం ఉందన్నపరిశోధకుల అనుమానాలను నిజం చేస్తూ ఫ్లోరిడా ఆసిల్లా నది ఆడుగు భాగంలో ఆధారాలు దొరికాయి. మంచుయుగానికి ముగింపు సమయంలోనే అమెరికా ప్రజల ఉనికిని తెలిపే అనేక రాతి పనిముట్లు సహా పురాతన రుజువులను.. సైంటిస్టులు కనుగొన్నారు. సుమారు పదివేల ఏళ్ళ క్రితం హిమఖండాలు కరగటం ప్రారంభించి సముద్రంలో ఆపారమైన జలరాసి కలిసిపోయింది. తీర ప్రాంతాలు సహా అనేక నాగరికతలూ సమాధి అయిపోయాయి. అయితే సముద్రగర్భంలోని చరిత్రను వెలికి తీసేందుకు ఇటీవల ఆర్కియాలజిస్టులు అనేక పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అవశేషాలను బయటకు తీయడంలో ప్రత్యేక శ్రద్ధ వహింస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఫ్లోరిడాలోని ఆసిల్లా నది గర్భంలో నిర్వహించిన నిర్వహించిన పరిశోధనల్లో అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. నదిలోని గోధుమరంగు ముర్కీ జాలాల్లో మానవుల ఉనికిని గుర్తించే వేటగాళ్ళు వినియోగించిన ప్రాచీన రాతియుగంనాటి పనిముట్లు, అతి పెద్ద ఏనుగును తలపించే జంతువు మాస్టోడాన్ సహా ఒంటెలు, అడవిదున్నలు, గుర్రాలు, అతి పెద్ద క్షీరదాల ఎముకలు సాక్షాత్కరించాయి. సముద్ర గర్భానికి అడుగున రాతి పనిముట్టతోపాటు, జంతువుల ఎముకలు, మాస్టోడాన్ దంతాలను కనుగొన్నామని, వీటిని బట్టి ఆగ్నేయ అమెరికాలో 14,550 సంవత్సరాలకు పూర్వమే అంటే... ఇంత క్రితం తెలుసుకున్నదానికి 1500 సంవత్సరాలకు ముందే మానవ చరిత్ర ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. క్లోవిస్ ప్రజల విలక్షణ నాయకత్వానికి గుర్తుగా సుమారు 13000 సంత్సరాల పురాతత్వ ఆధారాలు దొరికినట్లు వెల్లడించారు. ఫ్లోరిడా రాజధాని తల్లహశ్సీ సమీపంలోని పేజ్ లాడ్సన్ సైట్లో 2012 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 890 సార్లు నీటిలో మునిగి, నదీ గర్భంలో పరిశోధనలు నిర్వహించిన సైంటిస్టులు.. 35 అడుగుల లోతులోని భూభాగంలో ఉన్న సున్నపురాయిని 11 మీటర్లమేర తవ్వకాలు జరిపామని, ఈ నేపథ్యంలో అనేక చారిత్రక ఆధారాలు దొరికినట్లు తెలిపారు. ఇప్పటికీ క్లోవిస్ ముందు అక్కడ అద్భుత మానవ చరిత్ర ఉన్నట్లు నమ్ముతున్న పురాతత్వ వేత్తలు తమ పరిశోధనలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో నివేదించారు. -
అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యం
-
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ హల్చల్
-
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం..!
మోనాలీసా చిత్రం వెనుక రహస్యం ఏమిటి? ఒక్కోరికీ ఒక్కోలా కనిపించే ఆ పెయింటింగ్ వెనుక దాగున్న కథను వర్ణించేందుకు శాస్త్రవేత్తలు ఒక్కోరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా రిఫ్లెక్టివ్ లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ ఫ్రెంచ్ సైంటిస్టు ఆమె చిత్రం వెనుక కనిపించని కథను కళ్ళకు కట్టేందుకు ప్రయత్నించారు. మోనాలీసా చిత్రానికి లియోనార్డో డావిన్సీ తన కళా ప్రతిభతో ప్రాణం పోస్తే... నేటి సైంటిస్టులు డిజిటల్ శక్తితో పునర్నిర్మిస్తున్నారు. శాస్త్రవేత్త పాస్కల్ కొట్టే... మోనాలీసా చిత్రంపై షాంఘైలోని విలేకరుల సమావేశంలో మంగళవారం విశ్లేషించారు. చిత్రలేఖనానికి వెనుక భాగంలో మల్టీ లెన్స్ కెమెరా వినియోగించి లోలోపల దాగిన బహుళ రూపాలను ప్రదర్శించారు. కొన్ని ముఖ్యమైన తేడాలతో కూర్చొని ఉన్నట్లుగా దాదాపు ఒకేలా కనిపించే మరికొన్ని చిత్రాలు దీనివెనుక దాగొన్నట్లు చెప్పారు. లోపలి చిత్రంలో పక్కకు తిరిగి కూర్చొని ఉన్న ఆమె.. ప్రేక్షకులపైపు చూస్తున్నట్లుగా కనిపించడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంది. సుమారు ఐదు వందల సంవత్సరాలకు పైనుంచి ఆమె చిరునవ్వు వెనుక మర్మమేమిటో తెలియక వీక్షకులు నోరెళ్ళబెడుతూనే ఉన్నారు. ఓ నిజ జీవితానికి చెందిన పెయింటింగ్ గా జనం ఆమోదించిన మోనాలీసా... ఫ్లోరెంటైన్ పట్టు వ్యాపారి భార్య అని, 16వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ మహిళ.. లిసా గెరార్దిని అని తన పరిశోధనల ద్వారా తేలినట్లు సైంటిస్టు పాస్కల్ కొట్టే చెప్తున్నారు. మోనాలిసా చిత్రాన్ని నేను పునర్నిర్మించిన అనంతరం ఆమె పోర్టరైట్ ముందు నిలబడితే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుందని, మరొక స్త్రీగా ఉంటుందని అంటున్నారు. మరో పరిశోధకుడు అండ్రూ గ్రాహమ్ డిక్సన్ కూడ పాస్కల్ కొట్టే అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారు. అయితే ఇతర కళా చరిత్రకారులు మాత్రం పాస్కల్ కొట్టే అన్వేషణలపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఎన్ని పరిశోధనలు జరిపినా.. ప్రపంచానికి తెలిసిన మోనాలీసా నిజంగా మోనాలీసానా కాదా అన్న సంశయం మాత్రం నేటికీ తీరలేదు.