రాందేవ్ కు మరో భారీ షాక్ | Patanjali under lens for misleading advertising | Sakshi
Sakshi News home page

రాందేవ్ కు మరో భారీ షాక్

Published Tue, Jul 5 2016 1:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

రాందేవ్ కు మరో భారీ షాక్

రాందేవ్ కు మరో భారీ షాక్

న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు  పోటీగా దూసుకు వస్తున్న  యోగా గురు రాందేవ్ కంపెనీ పతంజలికి మరోసారి ఎదురు దెబ్బతప్ప లేదు. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ)  మళ్లీ మొట్టికాయలు వేసింది.  దేశ ప్రకటనలపై  వాచ్డాగ్ స్కానర్ గా ఉన్న ఈ సంస్థ 'దాంత్ కాంతి' టూత్ పేస్టు  ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది.  

 పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్  కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని  వివరించింది. దంతస్రావం,  వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు  పసుపు రంగులో కి మారడం  సెన్సిటివిటీ,  చెడువాసన లాంటి సమస్యలకు  బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని  కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి  మోసానికి పాల్పడిందని  తెలిపింది.  క్రిములు, సూక్ష్మజీవులనుంచి  పళ్లను  దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే  సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు,  పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా   సందిగ్ధతను వ్యక్తం చేసింది.  ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది

పతంజలితోపాటుగా  సహా అనేక కంపెనీ యాడ్స్ పై  అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్   ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా   హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్  ఇండియా,  లోరియల్,  కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ  తప్పుబట్టింది.  ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది.


న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్  యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్ యు ఎల్  ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది.  న్యూ  గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా  తక్షణం తెల్లబడటం  వాస్తవం  కాదని తేల్చి చెప్పింది.  కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని  భావిస్తున్నారా? అని ప్రశ్నించింది.

డార్క్ స్పాట్స్ పై పోరాటం...  తక్షణం తెల్లబడటం  ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది.  మొత్తం  141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని  సమర్థించింది.   ఫుడ్ అండ్  బ్యావెరేజెస్ రంగంలో దేశంలో  మిస్ లీడింగ్ యాడ్స్   పై  దేశ సర్వోన్నత  ఫుడ్  సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్  రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ)  తో గత వారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం   ఎఎస్సీఐ ఈ  నివేదికలు రూపొందించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement