misleading
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్‌పై జనం ఆగ్రహం
-
హోంశాఖ జారీ చేసిన జీవోపై ఎల్లోమీడియా వక్రభాష్యం
-
ఆ జీవో టీడీపీకి, ఎల్లో మీడియాకి అర్థం కాలేదేమో!
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 1పై టీడీపీ, ఎల్లోమీడియా వక్రభాష్యం చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభల నిషేధానికంటూ దుష్ప్రచారం నిర్వహిస్తోంది. జీవోలో స్పష్టంగా మార్గదర్శకాలు పేర్కొన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే రీతిలో రాతలను ఎల్లోమీడియా ద్వారా ప్రొత్సహిస్తోంది టీడీపీ. ఇంతకీ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన మార్గదర్శకాలను ఓసార పరిశీలిస్తే.. ఏపీ ప్రభుత్వం తరపున హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 1.. ప్రజల భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణతో ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని అందులో పేర్కొంది. హైవేలపైనా సభలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. అంతేకాదు.. ప్రజలకు ఇబ్బందుల్లేని పబ్లిక్ గ్రౌండ్స్‌లో, ప్రత్యామ్నాయ ప్రైవేట్ స్థలాల్లో సభలను నిర్వహించుకోవాలని సూచించింది. మున్సిపల్, పంచాయతీ రోడ్లు మరింత ఇరుకుగా ఉన్నందున.. పబ్లిక్ మీటింగ్స్ శ్రేయస్కరం కాదని పేర్కొంది ప్రభుత్వం. ఇరుకు రోడ్లలో సభలతో ప్రజనలకు హానికరమని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో లిఖితపూర్వక కారణాలు తెలియజేసే దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశం జారీ చేసింది కూడా. రోడ్డు వెడల్పు, మీటింగ్ సమయం, స్థలం, ఎగ్జిట్ పాయింట్స్, ఆ సభలకు హాజరయ్యే జనాభా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. సభలు పెట్టేవారికి పోలీసులు ప్రత్యామ్నాయ ప్రదేశాలు సూచించాలని కూడా ప్రభుత్వం ప్రస్తావించింది ఆ మార్గదర్శకాల్లో. ప్రజల భద్రత, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, జిల్లా పోలీస్ యంత్రాంగం సభలకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొంది. ట్రాఫిక్, ప్రజల రాకపోకలు, ఎమర్జెన్సీ సేవలు.. నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా గుర్తించాలని ఆదేశించింది. స్పష్టంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా దుష్టచతుష్టయం దుష్ప్రచారం నిర్వహిస్తోంది. సభలు, ర్యాలీలు మొత్తానికే నిషేధించారంటూ వక్రభాష్యం చెప్తోంది. -
పేదలను దోచుకున్నోళ్లే... నన్ను తిడుతున్నారు: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: ‘‘ఆటంక్, లట్కానా, భట్కానా (అడ్డుకోవడం, ఆలస్యం చేయడం, తప్పుదోవ పట్టించడం)... కాంగ్రెస్ నమ్ముకున్న సూత్రం ఇదే’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. పేదలను లూటీ చేసినవారు తనను దూషిస్తున్నారని చెప్పారు. అవినీతికి చరమగీతం పాడినందుకు నిత్యం తిడుతున్నారని ఆక్షేపించారు. గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతికి ఆస్కారమున్న పనులు తప్ప ప్రజలకు మంచి చేసే పనులు చేయలేదని ఆరోపించారు. మోదీ శుక్రవారం గుజరాత్లో బనస్కంతా జిల్లా కాంక్రేజ్ గ్రామంలో ఎన్నికల సభలో ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతాలకు నర్మదా జలాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. పేదలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవు కాంగ్రెస్ పాలనలో దేశంలో మధ్యలో వదిలేసిన 99 తాగునీటి సరఫరా పథకాలను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 4 లక్షల నకిలీ రేషన్ కార్డులను రద్దు చేశామన్నారు. అవినీతి అడ్డుకోవడం కొందరికి నచ్చడం లేదని, అందుకే తనను దూషిస్తున్నారని వ్యాఖ్యానించారు. పేద ప్రజలను దోచుకొనేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పుడు పనులు చేసి దొరికిపోయినవారు తనను తిడుతున్నారని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోబీజేపీ మరోసారి విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. కాంక్రేజ్‌లోని ఔగర్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతల బానిస మనస్తత్వం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వాన్ని అలవర్చుకున్నారని మోదీ చెప్పారు. బ్రిటిషర్ల చెడు అలవాట్లను కాంగ్రెస్ నాయకులు నేర్చుకున్నారని తెలిపారు. ఆనంద్ జిల్లాలోని సోజిత్రా పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ సమస్య కేవలం సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ మాత్రమే కాదని, దేశ ఐక్యత కూడా అని చెప్పారు. విభజించు, పాలించు అనే విధానంపైనే కాంగ్రెస్ రాజకీయాలు ఆధారపడి ఉంటాయన్నారు. ప్రజలందరినీ ఏకం చేయాలని సర్దార్ పటేల్ భావించారని, అందుకే ఆయనంటే కాంగ్రెస్‌కు గిట్టదని పేర్కొన్నారు. బీజేపీ విజయాన్ని ఒప్పుకున్న కాంగ్రెస్ గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ట్యాంపరింగ్ చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. ‘‘ఓటమి తప్పదని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చింది. అందుకే ఈవీఎంలపై నిందలు మోపుతోంది. తద్వారా బీజేపీ విజయాన్ని పరోక్షంగా అంగీకరించింది’’ అని అన్నారు. ఆయన ఉత్తర గుజరాత్‌లోని పఠాన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు మోదీని తిట్టడం, ఎన్నికలయ్యాక ఈవీఎంలను నిందించడం.. కాంగ్రెస్‌కు తెలిసింది ఈ రెండు విషయాలేనని ఎద్దేవా చేశారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు దక్కాల్సిన సొమ్మును దోచుకున్నాయని దుయ్యబట్టారు. ధనికుల, పేదల మధ్య అంతరాలు పెంచిన ఘనత కాంగ్రెస్‌దేనని ధ్వజమెత్తారు. -
విశాఖ ఆకస్మిక సర్వే.. ఓ తప్పుడు కథనం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తీరును, నేతలను బద్నాం చేసేలా యెల్లో మీడియా వరుసగా అసత్య కథనాలతో వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా విశాఖ అటవీ భూముల్లో ఆకస్మిక సర్వే పేరుతో ఓ కథనం ప్రచురించింది ఈనాడు. అయితే.. సదరు కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ పేరు మీద ఒక ప్రకటన విడుదల అయ్యింది. సదరు సర్వే.. అదొక సాధారణ స్పందన అర్జీలో భాగమని ప్రకటించారు. నవంబర్ 26వ తేదీన ఈ సర్వే జరిగిందని, ఇందుకుగానూ నోటీసులు 12 రోజుల ముందే అందించామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారు, డివిజనల్ ఫారెస్ట్ అధికారికి నోటీసులు అందించి.. నోటీసుల ప్రకారం ఈ తేదీనే TS.NO:88/B1, B2, B3 భూమిని సర్వే చేసినట్లు వెల్లడించారు. శీరంవహిత ఫర్మా ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను జత చేసి సర్వే చేయాలని స్పందన ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారని అధికారులు వెల్లడించారు. అంతేగానీ.. కడప ప్రాంతానికి చెందిన నేత ప్రమేయం ఉందంటూ ఈనాడులో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కార్యాలయం తరపున ఒక ప్రకటన వెలువడింది. ఇదీ చదవండి: ‘రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’ -
అడ్డదారిలో మందులోళ్లు.. డాక్టర్లకు ఖరీదైన కార్లు.. బహుమతులు
కర్నూలు(హాస్పిటల్): కొన్ని ఫార్మాకంపెనీలు వైద్యులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తమ మందులు రాస్తే ఖరీదైన బహుమతులు ఇస్తామని ఆశ చూపుతున్నాయి. భారీగా నగదు అందజేస్తామని ఊరిస్తున్నాయి. మందుల ధరల్లో వ్యత్యాసాలను బట్టి 20 నుంచి 30 శాతం వరకు చెక్కుల రూపేణా ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరికి డిప్లొమా సర్టిఫికెట్లు తెచ్చి ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? తమ మందులు అమ్ముకోవడానికి కొన్ని ఫార్మా కంపెనీలు ఎంతకైనా తెగిస్తున్నాయి. బాగా మందులు రాసే వైద్యునికి ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉంటే చాలు డిప్లొమా కోర్సుల సర్టిఫికెట్లను తెప్పించే బాధ్యతను అవే తీసుకుంటున్నాయి. సదరు డాక్టర్ కేవలం పేరు, వివరాలు చెబితే చాలు..మొత్తం పనంతా సదరు కంపెనీనే చూసుకుంటుంది. ఆన్లైన్లో విదేశీ యూనివర్సిటీలకు దరఖాస్తు చేయడం, కొన్ని వారాల్లోనే సర్టిఫికెట్లు తెప్పించడం జరిగిపోతోంది. వాటినే అందంగా ఫ్రేమ్ వేయించి మరీ వైద్యం చేస్తున్నారు కొందరు డాక్టర్లు. కర్నూలు నగరంలో ఇలాంటి వైద్యులు 40 మందికి పైగా ఉన్నారు. ఎన్ఆర్ పేట, శ్రీనివాసనగర్, గాయత్రి ఎస్టేట్స్, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ, జనరల్ హాస్పిటల్ ఎదురుగా పలువురు ఇలాంటి డిగ్రీలతో వైద్యం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరులోని ఓ బీఏఎంఎస్(ఆయుర్వేదిక్ కోర్సు చేసిన వారు) వైద్యుడు ఏకంగా డయాబెటాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్టుగా బోర్డు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆయనెప్పుడూ బిజీ ప్రాక్టీషనరే. అలాగే ఆదోనిలోనూ ఎంబీబీఎస్ అర్హతతో ఓ వైద్యుడు కార్డియాలజిస్టు అవతారమెత్తాడు. నిమ్స్, ఉస్మానియాతో పాటు అన్నామలై యూనివర్సిటీల్లో డిప్లొమా కోర్సును రెండేళ్ల పాటు చేసిన వైద్యులు తమ బోర్డుల్లో డిప్లొమా ఇన్ కార్డియాలజీ, డిప్లొమా ఇన్ డయాబెటాలజిగా రాసుకుంటున్నారు. కానీ అర్హతలేని యూనివర్సిటీల్లో సర్టిఫికెట్లు తెచ్చుకున్న వైద్యులు మాత్రం ఏకంగా డయాబెటాలజిస్ట్, కార్డియాలజిస్టు అని రాసుకోవడంతో 12 ఏళ్ల పాటు కష్టపడి వైద్యవిద్యను చదివిన డాక్టర్లు తీవ్రమనస్తాపానికి గురవుతున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేసే వారు అధికంగా ప్రాపగండ డిస్టిబ్యూషన్ కంపెనీ(పీడీసీ) మందులు రాస్తున్నారు. ఇవి బ్రాండెడ్ మందుల కంటే ఎంఆర్పీ అధికంగా ఉంటాయి. కానీ వైద్యులు ఇవే కొనాలని రోగులకు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని మందులు ఎంత మేరకు పనిచేస్తాయో వైద్యులకు కూడా తెలియదు. ఇటీవల షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా డి డయాబెటిక్స్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు. బహుమతులుగా ఖరీదైన కార్లు కర్నూలులో 200 మందికి పైగా ‘పీడీ’ వ్యాపారం చేసే వారు ఉన్నారు. పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. పాతబస్టాండ్, ఎన్ఆర్ పేట, జనరల్ హాస్పిటల్ ఎదురుగా, నంద్యాల రోడ్డు ప్రాంతాల్లో ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. వీరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వైద్యుల వద్దకు పంపిస్తూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తమ మందులు రోగులకు రాస్తే ఎలాంటి ఖరీదైన కారు కావాలన్నా కొనిస్తున్నారు. ఇటీవల పలువురు వైద్యులు స్కోడా, వోక్స్వాగన్, ఆడికార్లతో పాటు నర్సింగ్‌హోమ్‌లు ఉన్న వైద్యులు అంబులెన్స్‌లు కూడా బహుమతులుగా తీసుకున్నారు. ఇలాంటి వైద్యుల్లో ప్రైవేటుగా క్లినిక్‌లు, హాస్పిటల్స్ నిర్వహించే పలువురు ప్రభుత్వ వైద్యులు కూడా ఉండటం గమనార్హం. కొందరు డాక్టర్లకు క్యాష్ కార్డులు! ప్రముఖ పట్టణాలు, నగరాల్లో వైద్యసదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు కంపెనీలు వైద్యులను ఆహా్వనిస్తాయి. ఓ అరగంట, పావు గంటపాలు లెక్చర్ ఇస్తారు. కానీ అంతకు మించి వారికి భారీగా గౌరవ వేతనంగా కంపెనీలు ముట్టజెబుతున్నాయి. అంటే ఇది అడ్డదారిలో వైద్యులకు బహుమతులు ఇవ్వడం అన్నమాట. మరికొన్ని కంపెనీలు వైద్యులకు పెట్రోకార్డులు, గోల్డ్‌కార్డులు/కూపన్లు, క్యాష్కార్డులు బహుమతులుగా ఇస్తున్నాయి. ఇవేవీ వద్దని క్యాషే కావాలనుకుంటే వైద్యుని బంధువులు, స్నేహితుల పేరుపై లేదా మెడికల్ రెప్ పేరుపైనే కంపెనీలు చెక్కులను పంపిస్తాయి. వాటిని డ్రా చేసుకుని నగదును మాత్రం వైద్యులకు ముట్టజెప్పాలి. మరికొందరు వైద్యులు కుటుంబానికి అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలను ఫార్మాకంపెనీలతో సమకూర్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. తగ్గేది లేదంటున్న ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ అర్హత ఉన్నవారే కాదు ఆర్ఎంపీలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు డిగ్రీలు పెట్టేసుకుని వైద్యం చేస్తున్నారు. వన్‌టౌన్, కల్లూరు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు తమ బోర్డులో ఫిజీషియన్ అండ్ సర్జన్‌గా పెట్టుకుని వైద్యం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారు ఆదోని డివిజన్లోని కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, పత్తికొండ, తుగ్గలి, కోడుమూరు, మంత్రాలయం ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. బోర్డులో డిగ్రీల పేరు చూసి నిజంగా వారు అంత చదివారేమోనని అక్కడి ప్రజలు నమ్మి మోసపోతున్నారు. -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్‌పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
వోడాఫోన్ ఐడియాకు ట్రాయ్ షాక్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభానికి తోడు, ఏజీఆర్ బకాయిల ఇబ్బందుల్లో ఉన్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియాకు మరో షాక్ తగిలింది. వివాదాస్పద రెడ్ఎక్స్ ప్లాన్లద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలతో టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వోడాఫోన్ ఐడియాకు షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో అందిస్తున్న అఫర్లలో పారదర్శకత లేదని, నియంత్రణ సూత్రాలకు అనుగుణంగా లేదని ట్రాప్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనపై చర్య ఎందుకు తీసుకోకూడదో "కారణం చూపించమని" సంస్థను కోరింది. ఆగస్టు 31 లోగా సమాధానం ఇవ్వాలని ట్రాయ్ ఆదేశించింది. అయితే ఇదే వివాదంలో భారతి ఎయిర్‌టెల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ ఐడియా నెట్ స్పీడ్, ప్రియారిటీ కస్టమర్ కేర్ ఆఫర్లతో రెడ్ ఎక్స్ ప్లాన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిర్టెల్ కూడా ప్లాటినం ప్లాన్లతో తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రీమియం సేవలను ఆఫర్ చేస్తోంది. ట్రాయ్ గతంలో ఇదే విషయంపై వోడాఫోన్ ఐడియాతోపాటు ఎయిర్టెల్ ను ప్రశ్నించింది. సంబంధిత డేటాను అందించమని కోరింది. దీంతో ఎయిర్టెల్ ఆ ప్లాన్లకు మార్పులు, చేర్పులు చేసింది. అయితే వోడాఫోన్ ఐడియా మాత్రం ఈ ప్లాన్ కొత్తది కాదంటూ ప్రతికూలంగా స్పందించడంతో వివాదం నెలకొంది. -
రాహుల్‌కి నిర్మలా సీతారామన్ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుల బకాయిల మాఫీ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ముఖ్యంగా రుణాలను ఎగవేసిన వారిలో ఎక్కువగా బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన దాడికి ఆమె ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన నిర్మలా సీతారామన్ బ్యాంకు రుణాల మాఫీ విషయంపై రాహుల్ వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మండిపడ్డారు. ఈ విషయంలో అవగాహన కోసం కాంగ్రెస్ హాయంలో ఆర్థికమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సంప్రదించాలని కోరారు. బ్యాంకులు ఎవరి రుణాలను మాఫీ చేయలేదని, రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని ‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా ఆర్బీఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని గుర్తు చేశారు. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం ఎన్‌పిఎలకు (నిరర్ధక ఆస్తులు) కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. నాటి యూపీఏ ఫోన్ బ్యాంకింగ్ ద్వారా లాభపడినవారే డిఫాల్టర్లుగా మారారని నిర్మలా సీతారామన్ ఎదురు దాడికి దిగారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీఐ గవర్నరుగా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఉటంకించారు. 2006-2018 మధ్య కాలంలోనే మొండి రుణాలను ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి కూడా సీతారామన్ చెప్పుకొచ్చారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వివరాలను కూడా ట్విట్ చేశారు. వీళ్లను ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించడంతోపాటు వారికి సంబంధించిన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులిచ్చాం. వారిని స్వదేశానికి తిరిగి రప్పించేందుకు ఆయాదేశాలతో కలసి పని చేస్తున్నామని చెప్పారు. వరుసగా 13 ట్వీట్లలో ప్రభుత్వ వైఖరిని వివరించారు. (‘ఎగవేతదారుల్లో వారే అధికం’) కాగా ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఆర్బీఐ 50 మంది డీఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ మిత్రులు ఉన్నారంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. @INCIndia and Shri.@RahulGandhi should introspect why they fail to play a constructive role in cleaning up the system. Neither while in power, nor while in the opposition has the @INCIndia shown any commitment or inclination to stop corruption & cronyism. — Nirmala Sitharaman (@nsitharaman) April 28, 2020 -
యూట్యూబ్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: నిరాధార వార్తలను అరికట్టడమే లక్ష్యంగా, ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్ చేయడాన్ని యూట్యూబ్‌లో నిషేధించనున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది. తాము నియమించిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లు ఆయా వీడియోలను నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది. ‘వార్తా సమాచారానికి విశ్వసనీయ సోర్స్‌గా యూట్యూబ్‌ను తీర్చిదిద్దేందుకు గత కొన్నేళ్లుగా కసరత్తు ముమ్మరం చేశాం. అదే సమయంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు బహిరంగ వేదికగా మలిచేందుకు కృషి చేస్తున్నామ’ని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ లెస్లీ మిల్లర్ పేర్కొన్నారు. ఆన్లైన్ వివక్ష తొలగించేందుకు టెక్ కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు దుర్వినియోగంతో వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు గత నెలలో ఫేస్బుక్ ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నామని ట్విటర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: యూట్యూబ్ డబ్బుతో 25 కోట్ల భవంతి) -
కార్మికుల సొమ్ముతో వాషింగ్ మెషీన్లు
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన నిధులతో ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు కొనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విస్తుగొల్పే, తీవ్ర చర్య అని ఆవేదన వ్యక్తం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సమీకరిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుకు సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి నవంబరు 10 లోపు తమ ముందు హాజరు కావాలనీ, పథకం ఎందుకు పక్కదారి పట్టిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ నిధి మొత్తం రూ.29 వేల కోట్లు ఉండగా, దానిలో 10 శాతాన్ని అసలు ఉద్దేశం కోసం వినియోగించారనీ, మిగతా డబ్బుతో కొందరు కార్మికుల కోసమే వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారని కాగ్ లెక్కల్లో తేలింది. -
ఆక్వాప్లాంట్ యాజమాన్యం కొత్త ఎత్తుగడ
-
తప్పుడు కేసులపై వాటికా గ్రూపు ఆగ్రహం
గూర్గావ్ : రియల్ ఎస్టేట్ డెవలపర్ వాటికా గ్రూపుపై వచ్చిన ఆరోపణలను, నమోదైన తప్పుడు కేసులను ఆ గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సీనియర్ అధికారులు తిప్పికొడుతున్నారు. చీటింగ్‌కు పాల్పడామంటూ తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, అవన్నీ తప్పుడు ఆరోపణలు మాత్రమేనని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే వాటికా గ్రూపు ఎండీ గౌతమ్ భల్లా, గ్రూపు డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లా, క్లైయింట్ సర్వీసు హెడ్ అంకిత్ నాగ్‌పాల్‌లపై చీటింగ్ కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన స్యాంత్పురా వాసి సుమన్ ప్రీత్ కౌర్, ఆమె భర్త సురేంద్ర పాల్ సింగ్ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ సెక్షన్లు 406,420ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే కంపెనీ రిప్యూటేషన్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి చీటింగ్ కేసులను తమపై పెడుతున్నారని వాటికా గ్రూపు సీఆర్ఎమ్ అధినేత వికాస్ మన్హాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోపణల్లో నిజమెతుందో త్వరలోనే బయటపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. పోలీసుల విచారణలో కచ్చితంగా నిజనిజాలను బయటకి వస్తాయని, ఫిర్యాదుదారులు నిజాలను దాచిపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో ఫిర్యాదుదారులు వాటికా వన్ ఎక్స్‌ప్రెస్ సిటీలో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారని, దానికోసం 22 లక్షల వరకు ఇన్స్టాల్ మెంట్లో చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే తాము 2015 డిసెంబర్లో సైట్‌కి వెళ్లి చూస్తే, ఇంకా స్థలం బంజరు భూమిలానే ఉందని చెప్పారు. తాము చెల్లించిన నగదును రీఫండ్ చేయాలని కోరినప్పుడు, ఆ ప్రాజెక్టు రద్దైందని, కొత్త ప్రాజెక్టుకు తమ నగదు బదిలీ చేయాలని అప్పుడే రీఫండ్ చేస్తామని కంపెనీ అధికారి నాగ్‌పాల్ బెదిరించినట్టు ఫిర్యాదులో కౌర్ పేర్కొన్నారు. ఆ నగదును వాటికా ఇతర ప్రాజెక్టులకు మరలించినప్పటికీ, తమ చెల్లింపులు వెనక్కి రాలేదని వాపోయారు. రీప్లేస్మెంట్లో బెదిరించి వాటికా సెవన్ ఎలిమెంట్స్‌లో ఓ ఫ్లాట్ బుక్ చేశారని, కానీ తాము బుక్ చేసుకున్నదానికి, కంపెనీ ఆఫర్ చేసిన దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం విచారణ జరుపుతోంది. -
రాందేవ్ కు మరో భారీ షాక్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు పోటీగా దూసుకు వస్తున్న యోగా గురు రాందేవ్ కంపెనీ పతంజలికి మరోసారి ఎదురు దెబ్బతప్ప లేదు. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ) మళ్లీ మొట్టికాయలు వేసింది. దేశ ప్రకటనలపై వాచ్డాగ్ స్కానర్ గా ఉన్న ఈ సంస్థ 'దాంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్ కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని వివరించింది. దంతస్రావం, వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు పసుపు రంగులో కి మారడం సెన్సిటివిటీ, చెడువాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి మోసానికి పాల్పడిందని తెలిపింది. క్రిములు, సూక్ష్మజీవులనుంచి పళ్లను దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు, పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా సందిగ్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది పతంజలితోపాటుగా సహా అనేక కంపెనీ యాడ్స్ పై అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది. న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్ యు ఎల్ ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది. న్యూ గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణం తెల్లబడటం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. డార్క్ స్పాట్స్ పై పోరాటం... తక్షణం తెల్లబడటం ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని సమర్థించింది. ఫుడ్ అండ్ బ్యావెరేజెస్ రంగంలో దేశంలో మిస్ లీడింగ్ యాడ్స్ పై దేశ సర్వోన్నత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) తో గత వారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎఎస్సీఐ ఈ నివేదికలు రూపొందించింది.