
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన నిధులతో ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు కొనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విస్తుగొల్పే, తీవ్ర చర్య అని ఆవేదన వ్యక్తం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సమీకరిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుకు సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి నవంబరు 10 లోపు తమ ముందు హాజరు కావాలనీ, పథకం ఎందుకు పక్కదారి పట్టిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ నిధి మొత్తం రూ.29 వేల కోట్లు ఉండగా, దానిలో 10 శాతాన్ని అసలు ఉద్దేశం కోసం వినియోగించారనీ, మిగతా డబ్బుతో కొందరు కార్మికుల కోసమే వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు కొన్నారని కాగ్ లెక్కల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment