building workers
-
కార్మికుల సొమ్ముతో వాషింగ్ మెషీన్లు
న్యూఢిల్లీ: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాల్సిన నిధులతో ల్యాప్టాప్లు, వాషింగ్ మెషీన్లు కొనడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. విస్తుగొల్పే, తీవ్ర చర్య అని ఆవేదన వ్యక్తం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం సమీకరిస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని కోర్టు ఆక్షేపించింది. ఈ కేసుకు సంబంధించి కార్మిక శాఖ కార్యదర్శి నవంబరు 10 లోపు తమ ముందు హాజరు కావాలనీ, పథకం ఎందుకు పక్కదారి పట్టిందో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సంక్షేమ నిధి మొత్తం రూ.29 వేల కోట్లు ఉండగా, దానిలో 10 శాతాన్ని అసలు ఉద్దేశం కోసం వినియోగించారనీ, మిగతా డబ్బుతో కొందరు కార్మికుల కోసమే వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్లు కొన్నారని కాగ్ లెక్కల్లో తేలింది. -
వాచ్మెన్ దంపతులపై భవన కార్మికుల దాడి
-
వాచ్మెన్ దంపతులపై భవన కార్మికుల దాడి
హైదరాబాద్: నగరంలోని రాజేంద్ర నగర్ల బండ్లగూడలో ఆదివారం ఓ దారుణం చోటుచేసుకుంది. బండ్లగూడలో నివాసముంటున్న వాచ్మెన్ దంపతులపై భవన కార్మికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాచ్మెన్ భార్య మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితులు పరారయ్యాయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భవన కార్మికుల అంతిమ ఖర్చుకు రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం సత్వర సాయంగా ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయించింది. అదేవిధంగా ప్రమాదం జరిగిన భవనం రిజిస్టర్ కాకపోయినప్పటికీ బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ప్రత్యేక మినహాయింపు కల్పించింది. మృతదేహాన్ని స్వస్థలాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ పేర్కొంది.