సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం సత్వర సాయంగా ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయించింది. అదేవిధంగా ప్రమాదం జరిగిన భవనం రిజిస్టర్ కాకపోయినప్పటికీ బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ప్రత్యేక మినహాయింపు కల్పించింది. మృతదేహాన్ని స్వస్థలాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని కార్మిక శాఖ పేర్కొంది.