సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి.
విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment