power workers
-
సమ్మెకు దిగితే బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి. విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి. -
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోం..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 29 రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బిజ్లీ క్రాంతి యాత్ర పేరుతో ఢిల్లీ చేరుకున్న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు బుధవారం జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు నినాదాలిచ్చారు. ఈ భారీ ధర్నాకు వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సీపీఎం ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ నేత డి.రాజా, సహా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే 28 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ లభించదని, ఒక్కో రైతు ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీలు కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటీకరణతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉండదని, దీంతో 25 లక్షల మంది ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచిఉందని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దని తీర్మానాలు చేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని.. ఇంకా చేయాలని చూస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంటులో విద్యుత్ ఉద్యోగుల సమస్యపై కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ను పెంచాలి బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. దేశమంతా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.1,400 కోట్లు కేటాయించి 56 శాతం జనాభాను అవమానించారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
విద్యుత్ కార్మికుల సమ్మెకు తెర
12% ప్రత్యేక అలవెన్స్‌తో పాటు రూ. 5 లక్షలకు ఎక్స్‌గ్రేషియా పెంపు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెను విరమించారు. విద్యుత్ సంస్థల తరఫున ‘దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ’ (ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం కార్మిక జేఏసీ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. వేతనాలు, ఎక్స్‌గ్రేషియా పెంపు, ప్రమాద బీమా సదుపాయం తదితర డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించడంతో గత 17 రోజులుగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన సమ్మెకు తెరపడింది. విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించాలనే కార్మికుల ప్రధాన డిమాండును యాజమాన్యాలు ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పటికే కొన్ని కార్మిక యూనియన్లు సమ్మె నుంచి తప్పుకోవడంతో విధి లేని పరిస్థితిలో సమ్మెను వీడాల్సి వచ్చిందని కార్మిక జేఏసీ ప్రకటించింది. ప్రస్తుతం జీవో నం.3 ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా, జీవో నం.11 ఆధారంగా చెల్లించే విషయంపై పరిశీలన జరుపుతామన్నారు. మూల వేతనంపై 12 శాతం స్పెషల్ అలవెన్స్‌ను వచ్చే నెల 1 నుంచి చెల్లించేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. విధి నిర్వహణలో మృతి చెందే కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచేందుకు అంగీకరించాయి. రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టర్లు తొలగించకుండా అధికారులు పర్యవేక్షించనున్నారు. తప్పని పరిస్థితిలో సమ్మె విరమణ: సాయిలు, కార్మిక జేఏసీ నేత సీఐటీయూ, 327, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్లు సమ్మెను విఫలం చేసేందుకు ప్రయత్నించాయని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేత సాయిలు ఆరోపించారు. విధి లేని పరిస్థితిలో సమ్మెను విరమించామని పేర్కొన్నారు. గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సాయిలుకు ఎస్పీడీసీఎల్ డెరైక్టర్(హెచ్ఆర్) మీర్ కమాలుద్దీన్ ఖాన్ ఉస్మానియా ఆస్పత్రిలో నిమ్మ రసం అందించి సమ్మెను విరమింపజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె