lens
-
2,000 మంది నియామకం: లెన్స్‌కార్ట్
న్యూఢిల్లీ: కంటి అద్దాల తయారీ, విక్రయంలో ఉన్న లెన్స్‌కార్ట్ వచ్చే ఏడాది మార్చి నాటికి కొత్తగా 2,000 మందికిపైగా సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. అలాగే సింగపూర్, పశ్చిమ ఆసియా, యూఎస్‌లో మరో 300 మందిని చేర్చుకోనున్నట్టు బుధవారం వెల్లడించింది. టెక్నాలజీ, డేటా సైన్స్, విక్రయాలు, సరఫరా, ఫైనాన్స్, మానవ వనరుల వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్టు తెలిపింది. సంస్థ వృద్ధిలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతా ల్లో నిపుణులైన మానవ వనరులను కొత్తగా చేర్చుకుంటున్నట్టు లెన్స్‌కార్ట్ ఫౌండర్ పీయూష్ బన్సల్ వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 5,000 పైచిలుకు సిబ్బంది ఉన్నట్టు చెప్పారు. 2010లో ప్రారంభమైన లెన్స్‌కార్ట్ ఇప్పటికే కేకేఆర్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, ఐఎఫ్‌సీ వంటి సంస్థల నుంచి నిధులను సమీకరించింది. -
కళ్లజోళ్లకూ ఆన్లైనే..
రూ.250కే ఫ్రేములు, లెన్స్ ► దేశ, విదేశాల నుంచి బ్రాండెడ్ ఉత్పత్తుల దిగుమతి ►ప్రస్తుతం అబిడ్స్‌లో స్టోర్; వారం రోజుల్లో కూకట్‌పల్లిలోనూ.. ఇంజనీరింగ్ చదివే సమయంలో ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా సందర్శించిన అరవింద్ ఐ కేర్.. ఏకంగా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది. కళ్లజోళ్ల విభాగంలో వ్యాపార అవకాశాలను తెలియజేసింది. ఈ ఉపోద్ఘాతమంతా హైదరాబాదీ స్టార్టప్ లెన్స్‌ఫిట్.కామ్ గురించి! మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ వంశీ సీమకుర్తి మాటల్లోనే.. ప్రాజెక్ట్ వర్క్ కంపెనీ ప్రారంభానికి పునాది వేసిందంటే ఎవరూ నమ్మరు. కానీ, ఇది నిజం. – గీతం వర్సిటీలో ఇంజినీరింగ్ చదివే సమయంలో జాగృతి యాత్రలో భాగంగా అరవింద్ ఐ కేర్‌కు వెళ్లా. అక్కడ గడిపిన సమయం నన్ను మార్చింది. ఐ కేర్‌లో వ్యాపారావకాశాలు తెలిశాయి. నిజం చెప్పాలంటే మన దగ్గర ఆన్లైన్లో కళ్లజోళ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలు తక్కువే. ఉన్నా.. కొన్ని సంస్థలే ఉండటంతో ధరల్లో, నాణ్యతలో పెద్ద తేడా లేదనిపించింది. దీనికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో అభిలాష్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో లెన్స్‌ఫిట్.కామ్‌ను ప్రారంభించాం. ఫ్రేము, లెన్స్ కలిపి రూ.250..: లెన్స్‌ఫిట్ వెబ్సైట్, యాప్స్ అభివృద్ధి, మార్కెటింగ్ ఇతరత్రా వాటికి రూ.5 లక్షల పెట్టుబడులు పెట్టాం. ఇప్పటికే ఈ విభాగంలో కంపెనీలున్నా మా ప్రత్యేకత ఏంటంటే.. కళ్లజోళ్ల ఫ్రేము, లెన్స్ కలిపి రూ.250కు అందించడమే. నాణ్యతలో ఏమాత్రం తగ్గకుండా. లెన్స్ఫిట్లో కళ్లజోళ్ల ఫ్రేములు, సన్‌గ్లాసులు, కాంటాక్ట్ లెన్స్‌లు, కళ్లజోళ్ల బాక్స్‌లు, స్క్రూడైవర్ సెట్లు, కీచెయిన్ల వంటి ఇతరత్రా ఉత్పత్తులుంటాయి. ఆయా ఉత్పత్తులు పెద్దలవి, పిల్లలవి, అన్ని రంగుల్లోనూ లభ్యమవుతాయి. విదేశాల నుంచి దిగుమతి.. ఫ్రేములను, లెన్స్‌లను మన దేశంతో పాటు చైనా, ఇటలీ, అమెరికా, జపాన్, కొరియా నుంచి దిగుమతి చేసుకున్నాం. టామ్ వాలెన్‌టైన్, ఆల్కాన్, అక్యూవ్యూ, ఫ్రెష్‌లుక్, బౌష్ అండ్ ల్యాంబ్, చార్లె రిచ్మండ్, కిడ్డో, వైల్డ్స్పిరిట్ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం మా వద్ద 2,000 రకాల ఫ్రేములు, లెన్స్లున్నాయి. ఫ్రేములను, లెన్స్‌లను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తాం. ఇటీవలే టెక్ మహీంద్రాలో మార్కెటింగ్ క్యాంపెయిన్ నిర్వహించాం. ఒకేరోజు 50కి పైగా ఆర్డర్లొచ్చాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ కొనుగోలు.. లెన్స్‌ఫిట్ ఉత్పత్తుల కొనుగోలుకు వెబ్సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో అయితే అబిడ్స్‌లో ఫ్రాంచైజీ విధానంలో స్టోర్ ఉంది. వారం రోజుల్లో కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్లో మరో స్టోర్‌ను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్డ్ కస్టమర్లున్నారు. వచ్చిన ఆర్డర్లను ఫ్రేములు, లెన్స్‌ల ప్రకారం అబిడ్స్‌లోని తయారీ కేంద్రంలో బిగిస్తాం. కళ్లజోళ్ల ఫ్రేములు, లెన్స్‌ల బిగింపు సరిగాలేకపోయినా.. పొరపాట్లు జరిగినా రిటర్న్ తీసుకొని కొత్తవి అందిస్తాం. 3–4 రోజుల్లో ఆర్డర్ల డెలివరీ పూర్తి చేస్తాం. -
రాందేవ్ కు మరో భారీ షాక్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ రంగంలో టాప్ కంపెనీలకు పోటీగా దూసుకు వస్తున్న యోగా గురు రాందేవ్ కంపెనీ పతంజలికి మరోసారి ఎదురు దెబ్బతప్ప లేదు. ఇటీవల వంట, హెయిర్ నూనెల ప్రకటనతో ఇబ్బందులు పడ్డ పతంజలి సంస్థకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎఎస్సీఐ) మళ్లీ మొట్టికాయలు వేసింది. దేశ ప్రకటనలపై వాచ్డాగ్ స్కానర్ గా ఉన్న ఈ సంస్థ 'దాంత్ కాంతి' టూత్ పేస్టు ప్రకటనలో పతంజలి తప్పుడు విషయాలు పేర్కొంటోందని తెలిపింది. పతంజలి ఉత్పత్తుల్లో ఎక్కువ ఆదరణ పొందిన 'దాంత్ కాంతి ' ప్రకటనలో చెబుతున్నట్టుగా ఎఫెక్టివ్ గా లేదని వివరించింది. దంతస్రావం, వాపు, చిగురులు బ్లీడింగ్, పళ్లు పసుపు రంగులో కి మారడం సెన్సిటివిటీ, చెడువాసన లాంటి సమస్యలకు బాగా పనిచేస్తుందనేది నిరూపించబడలేదని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ ప్రకటన ద్వారా పతంజలి మోసానికి పాల్పడిందని తెలిపింది. క్రిములు, సూక్ష్మజీవులనుంచి పళ్లను దీర్ఘకాలం రక్షిస్తుందని ప్రకటించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించింది. అలాగే సంస్థ మిగిలిన ఉత్పత్తులైన ఆవాల నూనె పతంజలి ప్రకటనలు, పండ్ల రసాలు, పశువుల దాణా ప్రకటనల పై కూడా సందిగ్ధతను వ్యక్తం చేసింది. ఈ ప్రకటనలలోని విశ్వసనీయతపై సందేహాలను వ్యక్తం చేసింది పతంజలితోపాటుగా సహా అనేక కంపెనీ యాడ్స్ పై అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా హెచ్ యూఎల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కెల్లాగ్ ఇండియా, లోరియల్, కాల్గేట్ పామోలివ్ వంటి కంపెనీ ప్రకటనలను కూడా సంస్థ తప్పుబట్టింది. ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించింది. న్యూ గార్నియర్ కంప్లీట్ డబుల్ యాక్షన్ ఫేస్ వాష్ , హెచ్ యు ఎల్ ఇన్ స్టెంట్ వైట్నింగ్ ప్రకటనలపై సంస్థ తీవ్రంగా స్పందించింది. న్యూ గార్నియర్ వైట్ పూర్తి డబుల్ యాక్షన్, లోరియల్ ప్రకటనల్లో చెప్పినట్టుగా తక్షణం తెల్లబడటం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కేవలం క్రీమ్ ల వల్ల తెల్లగా కనిపిస్తారని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. డార్క్ స్పాట్స్ పై పోరాటం... తక్షణం తెల్లబడటం ఇదంతా మోసమని ఎఎస్సీఐ తెలిపింది. ఊహలతో ఆయా సంస్థలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. వినియోగదారులను మరోసారి ఆలోచించాలని కోరింది. మొత్తం 141 ఫిర్యాదులను విచారించిన సంస్థ 67 ని సమర్థించింది. ఫుడ్ అండ్ బ్యావెరేజెస్ రంగంలో దేశంలో మిస్ లీడింగ్ యాడ్స్ పై దేశ సర్వోన్నత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) తో గత వారం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎఎస్సీఐ ఈ నివేదికలు రూపొందించింది. -
ట్రావెల్ క్లిక్స్
ఫొటోగ్రఫీ ఓ అభిరుచి. కానీ... మనసుకు హత్తుకునే ఓ దృశ్యం కనిపించినప్పుడు దాన్ని అంతే అపురూపంగా లెన్స్‌లో బంధించాలంటే నైపుణ్యం కావాలి. అంటే... కెమెరాపై పూర్తి అవగాహన... మనం చూసే దృష్టిలో కళాత్మకత ఉండాలి. అప్పుడే ఆ చిత్రం ప్రతి మదినీ చేరుతుంది. చూడగానే మనకు కలిగిన అనుభూతి ఛాయాచిత్రంగా ప్రతిబింబిస్తుంది. ఇక ట్రావెల్ ఫొటోగ్రఫీ అంటే..! అదో పెద్ద సబ్జెక్టు అనుకుని నిట్టూర్చే వారికి... అది అంత కష్టం కాదని భరోసా ఇచ్చారు ప్రముఖ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ సౌరబ్ చటర్జీ. మెదడుపై ఒత్తిడి తగ్గించి... ఎదుటున ఉన్నదానిపై దృష్టి పెడితే చాలంటారు ఆయన. సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో ఇటీవల ట్రావెల్ ఫొటోగ్రఫీపై ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఔత్సాహికులకు ఆయన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే సులువుగా ‘క్లిక్’మనిపించడానికి కొన్ని చిట్కాలూ చెప్పారు. సాధారణ దృశ్యాలను కూడా అద్భుతంగా బంధించాలంటే రెండు అంశాలు కీలకమంటారు చటర్జీ. ఒకటి... కంపోజిషన్. రెండు లైట్. ఈ రెండింటిపై అవగాహన పెంచుకుని, ఆచరణలో పెడితే మెమరబుల్ మూమెంట్స్ ఎన్నో క్లిక్మనిపించవచ్చంటారాయన. ‘ఇక నా విషయానికొస్తే... లైఫ్‌లో రెండు ప్రధానమైన మిషన్స్ ఉన్నాయి. దేశంలో కెమెరాలున్న ప్రతి ఒక్కరినీ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌ను చేయాలి. ట్రావెల్ ఫొటోగ్రాఫర్లు ప్రపంచమంతా తిరిగి మంచి చిత్రాలు బంధించి దేశానికి గర్వకారణంగా నిలవాలి’ అంటున్న సౌరబ్ ఫొటో జర్నలిజంలో డిప్లమో చేశారు. ‘గత ఏడాది ఇద్దరు జర్మనీ ఫొటోగ్రాఫర్లతో కలసి పనిచేసే అవకాశం లభించింది. అలాగే... గాబ్రియల్ అండ్ యాన్డ్రియాస్ రోస్ట్ డాక్యుమెంటరీ నిర్మాణం కోసం చెన్నై వెళ్లా. అక్కడ రకరకాల చిత్రాలు తీశాను. మంచి ఆదరణ, గుర్తింపు వచ్చాయి. అక్కడ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి నాలుగేళ్లు శిక్షణనిచ్చారు. ఆ తరువాత ఫొటోగ్రఫీపై మంచి అవగాహన వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్స్, డైలీస్లో నేను తీసిన ఫొటోలెన్నో పబ్లిష్ అయ్యాయి. అలాగే నేషనల్ జాగ్రఫికల్ ట్రావెలర్, లోన్లీ ప్లానెట్, టైమ్ అవుట్ ఎక్స్‌ప్లోరర్ (యూకే)ల్లో కూడా ట్రావెల్ ఫొటోగ్రఫీపై కార్యక్రమాలు చేశాను. రీసెంట్గా దిల్లీ బ్రాండ్స్ అకాడమీ ఫొటోగ్రఫీ వర్క్‌షాప్స్ నుంచి ‘టైనర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నా. ఇలా ఫొటోగ్రఫీతో పాటు నా జర్నీ సాగిపోతోంది’ అని తన నేపథ్యం చెప్పుకొచ్చారు సౌరబ్ చటర్జీ. ప్రవీణ్, అడ్డగుట్ట -
దృశ్యం.. అమితం
Lens& లైఫ్ ఆమె కెమెరా కన్ను పడితే ప్రతి దృశ్యం అపురూపమే. ప్రతి కదలికా ప్రత్యేకమే. ఆరేళ్ల వయసు నుంచే ‘లెన్స్’తో అనుబంధం... ‘క్లిక్’ల్లో వినూత్నం... సామాజిక నేపథ్యం. చారిత్రక కట్టడాలు, దైవారాధన, ప్రకృతి సౌందర్యం, గిరిజనుల జీవన విధానం, బాల కార్మికుల బతుకులు... ఆమె కెమెరాకు కనిపించే దృశ్యాలివే. పంజాబ్‌లో పుట్టి... సిటీలో స్థిరపడిన అమితా తల్వార్ ‘లెన్స్ అండ్ లైఫ్’ ఆమె మాటల్లోనే... మాది పంజాబ్‌లోని పాటియాలా. 1954లో పుట్టిన నేను పెరిగింది అక్కడే. పాటియాలా సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసే నాన్న దయాకృష్ణన్పూరీ హాబీగా కెమెరా క్లిక్‌మనిపించేవారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పర్యాటక ప్రదేశాలకు వెళ్లినా పెంటాక్స్ కెమెరా వెంట తీసుకొచ్చేవారు. అలా నాకు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఇది గమనించిన అమ్మానాన్న నాకు బేబీ బ్రౌన్ కెమెరా చేతికిచ్చారు. ఇక అప్పటి నుంచి ఎక్కడికెళ్లినా ఫొటోలు తీయడం హాబీగా మారింది. చండీగఢ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో పీజీ చేశా. 1974లో కోల్‌కతాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పరిక్షిత్ తల్వార్‌తో వివాహమైంది. ఆయన నా ఆసక్తిని గమనించి వెన్నుతట్టారు. అలా నేను ఇప్పటివరకు శ్రీనగర్, జైపూర్, అలహాబాద్‌లోని ప్రయాగ్ మేళా, ఛత్తీస్‌గఢ్, లేహ్, లడఖ్, భూటాన్లలో పర్యటించి అక్కడి చారిత్రక, ప్రకృతి అందాలను లెన్స్‌లో బంధించగలిగా. లండన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో కరస్పాన్‌డెన్స్ కోర్సు చేశా. కొన్ని ఇంగ్లిష్ పత్రికలకు ఫొటో జర్నలిస్ట్‌గా పనిచేశా. భర్త ఐటీసీ భద్రాచాలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాం. సిటీలో జరిగే ఆర్ట్ అండ్ కల్చర్‌ను కళ్లకు కట్టినట్లు చూపించగలిగా. ఇందులో భాగంగానే ఇటీవలే క్యాన్సర్ రోగులు, బాలల విద్య కోసం నిధులు సేకరించేందుకు ఫొటో ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటుచేశా. ఫిల్మ్ మేకింగ్ చేస్తుంటా. ఆ క్లిక్ మరవలేను... నా కెమెరాలో బందీ అయిన అన్నీ దృశ్యాలు నాకు బెస్ట్. చారిత్రక కట్టడాలు అయినా, ప్రకృతి సౌందర్యమైనా, బాల కార్మికుల స్థితిగతులైనా... ప్రతి ఫొటోకూ మంచి స్పందన వచ్చింది. ఎన్జీవోలకు నిధుల సేకరణ కోసం నా ఫొటోల ఎగ్జిబిషన్ ‘బుక్ ఆఫ్ మై ఫొటోగ్రఫీ’కి వచ్చిన రెస్పాన్స్ సంతృప్తినిచ్చింది. 2011, 2012, 2013... ఇలా మూడేళ్లు బనారస్ పర్యటనకు వెళ్లా. ఈ ఏడాది కూడా వెళుతున్నా. తొలిసారి నేను ‘కోర్స్ ఆఫ్ రివర్ గంగా’ వద్దకు వెళ్లి, శివుడికి పూజలు అందించే దృశ్యాన్ని క్లిక్‌మనిపించా. గంగా తీరం, సంధ్యా సమయం.. భక్తజన సంద్రం ఆధ్యాత్మిక వాతావరణంలో పారవశ్యులవుతున్నారు. విశ్వనాథుడు, గంగానది, సూర్యుడు, అగ్ని దేవతలను పూజిస్తూ గంగమ్మకు భక్తులు హారతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో హారతికి ముందు విజిల్ వేస్తారు. వేకువ జామునే లేచి... ఆ విజిల్ వేసే దృశ్యాన్ని కెమెరాలో బంధించా. చలికాలం కావడంతో విపరీతమైన మంచు. భక్తులు, వారు వెలిగించిన కర్పూర హారతులను క్లిక్‌మనిపించా. ఈ ఫొటో నాకెంతో సంతృప్తినిచ్చింది. కుటుంబ సభ్యులతో ప్రముఖ పర్యాటక కేంద్రం కాశీకి వెళ్లాను. ఆ ట్రిప్‌నూ క్లిక్‌లతో ఫుల్ ఎంజాయ్ చేశా. ఇదే కాదు... నేను తీసిన ఎన్నో ఫొటోలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈ ఫొటో కోసం నికాన్డీ 800 కెమెరా వాడా. బనారస్ ఫొటోలన్నింటితో ఓ పుస్తకం తేవాలనుకుంటున్నా. తద్వారా వచ్చే నిధులను సమాజసేవకు వినియోగించాలన్నదే నా అభిలాష. ప్రజంటర్: వాంకె శ్రీనివాస్ -
కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
1. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య? ఎ) 3 బి) 2 సి) 6 డి) 4 2. కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర? ఎ) దృఢస్తరం బి) రక్త పటలం సి) నేత్ర పటలం డి) శుక్ల పటలం 3. కనుపాప వెనుక ఉండే భాగం? ఎ) తారక బి) కటకం సి) నేత్ర పటలం డి) ఏదీకాదు 4. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? ఎ) 4 బి) 3 సి) 6 డి) 2 5. దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఎ) 1 : 15 బి) 1 : 1 సి) 15 : 1 డి) 12 : 15 6. రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం? ఎ) డి బి) బి సి) కె డి) ఎ 7. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం? ఎ) రొడాప్సిన్ బి) ఐడాప్సిన్ సి) ఎ, బి డి) కెరాటిన్ 8. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి? ఎ) దండ కణాలు బి) శంకు కణాలు సి) రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి డి) ఎర్ర రక్త కణాలు 9. మానవునిలో ఉండే దృష్టి? ఎ) బైనాక్యులర్ బి) మోనాక్యులర్ సి) మల్టిపుల్ డి) ఏదీకాదు 10. {హస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు? ఎ) కుంభాకార బి) పుటాకార సి) ద్విపుటాకార డి) సమతల దర్పణం 11. కిందివాటిలో కంటి వ్యాధి కానిది? ఎ) గ్లుకోమా బి) ట్రకోమా సి) పమోరియా డి) కాటరాక్ట్ 12. చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం? ఎ) 10 సెం.మీ. బి) 20 సెం.మీ. సి) 40 సెం.మీ. డి) 30 సెం.మీ. 13. సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి? ఎ) కాటరాక్ట్ బి) జీరాప్తాల్మియా సి) రే చీకటి డి) ఏదీకాదు 14. కంటికి ముందు ఉన్న చిన్న గది? ఎ) కచావత్ కక్ష్య బి) నేత్రోదక కక్ష్య సి) కటకం డి) కంటి పొర 15. కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఎ) జీరంటాలజి బి) ఆప్తమాలజి సి) పేలినాలజి డి) ట్రైకాలజి 16. బహుళ నేత్రం దేనిలో ఉంటుంది? ఎ) పక్షి బి) కీటకం సి) మానవుడు డి) గబ్బిలం 17. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు? ఎ) 30 బి) 40 సి) 20 డి) 10 18. నీటి కాసులు (గ్లుకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది? ఎ) దంతాలు బి) కళ్లు సి) పేగు డి) కాలేయం 19. భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు? ఎ) 5 బి) 20 సి) 40 డి) 9 20. చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి? ఎ) నాలుకపై బి) శరీరంపై సి) మొప్పలపై డి) వాజాలపై 21. నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది? ఎ) ముందు భాగం బి) వెనుక భాగం సి) అంచులు డి) పైవన్నీ 22. శరీరంలో అతి పెద్ద అవయవం? ఎ) నాడీ దండం బి) చర్మం సి) వెంట్రుకలు డి) తొడ ఎముక 23. సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు? ఎ) టానింగ్ బి) ఆల్పినో సి) డెర్మటైటిస్ డి) ఏదీకాదు 24. చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి? ఎ) ఎక్స్-రే కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది బి) గామా కిరణాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది సి) యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది డి) పైవన్నీ 25. వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి? ఎ) అంతః చర్మం బి) బాహ్య చర్మం సి) ఎ, బి డి) చర్మం మధ్యపొర 26. చర్మ సంబంధ వ్యాధి కానిది? ఎ) గజ్జి బి) తామర సి) స్కేబీస్ డి) ఏదీకాదు 27. స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం? ఎ) చర్మం పొర పొరలుగా రాలిపోవడం బి) చర్మంలో బొరియలు పడటం సి) స్వేద గ్రంథులు పని చేయకపోవడం డి) చర్మం నల్ల బారడం 28. గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది? ఎ) కీటకాలు బి) ఫంగస్ సి) బ్యాక్టీరియా డి) వైరస్ 29. గజికర్ణ (తామర) వ్యాధికి కారణం? ఎ) బ్యాక్టీరియా బి) వైరస్ సి) ఫంగస్ డి) ప్రోటోజోవా 30. చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం? ఎ) అధిక కెరాటిన్ బి) అధిక మెలనిన్ సి) తక్కువ మెలనిన్ డి) ఏదీకాదు 31. వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఎ) ట్రైకాలజి బి) డెర్మటాలజి సి) హెమటాలజి డి) జీరంటాలజి 32. ఎఖిని అనేది ఒక? ఎ) కాలేయ సంబంధ వ్యాధి బి) గుండె సంబంధ వ్యాధి సి) చర్మ సంబంధ వ్యాధి డి) ఎముకల సంబంధ వ్యాధి 33. జతపరచండి. 1. డెర్మటైటిస్ ఎ. కండరాలు 2. టెటానస్ బి. కన్ను 3. పమోరియా సి. దంతాలు 4. గ్లుకోమా డి. చెవి ఈ. చర్మం ఎ) 1-ఈ, 2-బి, 3-సి, 4-ఎ బి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-డి సి) 1-ఈ, 2-ఎ, 3-బి, 4-సి డి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-బి 34. చెవిలో ఉండే ఎముకల సంఖ్య? ఎ) 6 బి) 3 సి) 8 డి) 12 35. కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది? ఎ) బాహ్య చెవి బి) మధ్య చెవి సి) అంతర చెవి డి) ఏదీకాదు 36. బోనీ కండక్షన్లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు? ఎ) చెవులు బి) ఎముకలు సి) వెంట్రుకలు డి) పైవన్నీ 37. జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం? ఎ) బాహ్య చెవి బి) అంతర చెవి సి) మధ్య చెవి డి) కర్ణభేరి 38. మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది? ఎ) మెడుల్లా బి) సెరిబెల్లం సి) హైపోథాలమస్ డి) పైవన్నీ 39. శరీరంలో అతి చిన్న ఎముక? ఎ) స్టెపిస్ బి) ఇంకస్ సి) ఇయర్ డ్రమ్ డి) మాలియస్ 40. యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది? ఎ) నోటి కుహరం - లోపలి చెవి కుహరం బి) నోటి కుహరం - మధ్య చెవి కుహరం సి) బాహ్య చెవి కుహరం - మధ్య చెవి కుహరం డి) నోటి కుహరం - బాహ్య చెవి కుహరం 41. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య? ఎ) 5 బి) 3 సి) 4 డి) 10 42. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం? ఎ) 20 బి) 50 సి) 5 డి) 15 43. చెమటలో ఉండే పదార్థాలు? ఎ) నీరు, సోడియం క్లోరైడ్ బి) నీరు, యూరియా సి) నీరు, సోడియం క్లోరైడ్, యూరియా డి) సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది 44. చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా? ఎ) 99, 0.2 - 0.5 బి) 0.5, 99 సి) 5, 90 డి) 0.5, 0.2 45. ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు? ఎ) చెవి బి) కన్ను సి) చర్మం డి) గుండె 46. విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం? ఎ) యూరియా బి) కోలెస్టిరాల్ సి) లిపిడ్లు డి) ప్రోటీన్లు 47. జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి? ఎ) మస్తిష్కం బి) అనుమస్తిష్కం సి) మజ్జాముఖం డి) ఏదీకాదు 48. సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు? ఎ) ఎఖిని బి) ఫ్లూరైటిస్ సి) సోరియాసిస్ డి) స్కేబీస్ 49. చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఎ) కేరళ బి) తమిళనాడు సి) కర్ణాటక డి) బీహార్ 50. దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం? ఎ) పుటాకార బి) కుంభాకార సి) సమతల డి) ద్వికుంభాకార 51. వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్నెస్) అనేది? ఎ) విటమిన్-ఎ లోపం వల్ల వస్తుంది బి) పోషకాహార లోపం వల్ల వస్తుంది సి) అనువంశిక వ్యాధి డి) ఏదీకాదు 52. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది? ఎ) ఎక్జిమా బి) సోరియాసిస్ సి) క్షయ డి) ఎఖిని సమాధానాలు 1) సి; 2) ఎ; 3) బి; 4) డి; 5) సి; 6) డి; 7) బి; 8) బి; 9) ఎ; 10) బి; 11) సి; 12) డి; 13) ఎ; 14) బి; 15) బి; 16) బి; 17) బి; 18) బి; 19) డి; 20) బి; 21) సి; 22) బి; 23) ఎ; 24) సి; 25) ఎ; 26) డి; 27) బి; 28) ఎ; 29) సి; 30) బి; 31) ఎ; 32) సి; 33) డి; 34) ఎ; 35) ఎ; 36) బి; 37) బి; 38) సి; 39) ఎ; 40) బి; 41) ఎ; 42) డి; 43) సి; 44) ఎ; 45) సి; 46) బి; 47) ఎ; 48) డి; 49) బి; 50) బి; 51) సి; 52) సి. -
కెమెరా లెన్స్...రంగు భేదం ఎరగదు!
నాటి సావిత్రి, వాణిశ్రీ, స్మితాపాటిల్ నుంచి నేటి బిపాస బసు వరకు చిత్రసీమను ఏలినవారంతా చామనచాయతో ఆకట్టుకున్నవారే! రంగు తక్కువ అని బాధపడేవారినే కెమెరా కన్ను ఎక్కువగా ప్రేమించింది. ఇంకా ప్రేమిస్తోంది. ‘మేని రంగు తెలుపా, నలుపా కాదు కెమెరా లెన్స్‌కి కావల్సింది వారి ముఖ కవళికలు, శరీరాకృతి, నటన.. ’ అన్నారు అరవింద్ ఛెంజి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ అంటే అంతగా పరిచయం లేని కాలంలోనే అరవింద్ ఛెంజి కెమెరా చేతబట్టారు. అప్‌కమింగ్ మోడల్స్‌కు పర్సనల్ పోర్ట్ ఫోలియోలు డిజైన్ చేయడం దగ్గర్నుంచి... అందాల రాణుల స్పెషల్ ఫొటో షూట్ల దాకా ‘ఫ్యాషన్ క్లిక్స్’కు కేరాఫ్‌గా మారారు. దాదాపు మూడున్నర దశాబ్దాల కెరీర్లో ఆయనకు తెలియని ఫ్యాషన్ అరుదే అని చెప్పాలి. ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎలా ఉండాలో సరికొత్త లెన్స్‌లో చూపించిన ఈ డౌన్ టు ఎర్త్ ఫొటోగ్రాఫర్‌తో ‘సాక్షి ఫ్యామిలీ’ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. ప్రసిద్ధ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పేరున్న మీరు, ఈ రంగంలోకి ఎలా వచ్చారు? మీ కుటుంబ నేపథ్యం? అరవింద్ ఛెంజి: మా పూర్వీకులు మహారాష్ట్రీయులైనా పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే! నాన్న ఇంజినీర్, అమ్మ డాక్టర్. చెల్లెలు బిజినెస్ రంగంలో ఉంది. ఇంట్లో ఎవరూ ఈ ఫీల్డ్‌లో లేరు. నాకే కెమెరా అంటే పిచ్చి. ఇలాగే చదవాలనే ఆంక్షలు లేవు. అమ్మ, నాన్న ఆంక్షలు పెట్టలేదు. బీఎస్సీ చేశాను. కెమెరా పట్టడానికి ముందు నాకు నలుగురిలో కలవాలంటే అపరిమితమైన సిగ్గు. ఎవరినీ పలకరించేవాడిని కాదు. కనీసం మా చెల్లెలు స్నేహితులు వచ్చినా వారి ముందుకూ వెళ్లేవాడిని కాదు. ఆడవాళ్లకు ఆమడదూరం ఉండేవాడిని. అలాంటిది కెమెరా పట్టాక ఇతరులతో సంభాషించడం, అందరితో కలిసిపోవడం నేర్చుకున్నాను. తప్పదు, ఫొటోగ్రఫీలో మాటే ముఖ్యం. క్లైంట్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటేనే, వారూ ఫ్రీగా ఉండగలుగుతారు. లేదంటే ఫొటో అనగానే బిగుసుకుపోతారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు.. ఇలా అందరితోనూ వారి వారి మనస్తత్వానికి తగినట్టుగా మారిపోతాను. ఒకరకంగా చెప్పాలంటే కెమెరా పట్టుకున్న సైకాలజిస్ట్ అని చెప్పవచ్చు. మీరు కెమెరా పట్టుకున్నప్పటి రోజులు, ఇప్పటి రోజులు ఫొటోగ్రఫీలో వచ్చిన మార్పులు? అరవింద్: ఈ రంగంలో దాదాపు 35 ఏళ్లు దాటిపోయాయి. నాకు గురువెవ్వరూ లేరు. సొంతంగా నేర్చుకున్నాను. ఒకప్పుడు ఫొటోగ్రఫీ అంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అని మాత్రమే అనుకునేవారు. అలాంటిది ఇప్పుడా పదానికి అర్థమే మారిపోయింది. ఫొటోగ్రఫీ ఎంత విస్తృతమైనదో చాలామందికి తెలిసొచ్చింది. ఈ పదేళ్లలో చాలా మంచి మార్పులు వచ్చాయి. ఫొటోగ్రాఫర్లకు మంచి ఇమేజ్ రావాలని తపించాను. అలాంటి రోజులనే ఇప్పుడు చూస్తున్నాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి, ఇతర ఫొటోగ్రఫీకి వ్యత్యాసం? అరవింద్: ఫ్యాషన్ మాత్రమే కాదు, ఫుడ్, ప్రకటనలు, ఎడిటోరియల్ ఫొటోలూ తీస్తుంటాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో గ్లామరే ప్రధానం. అందంగా చూపించడానికే ప్రయత్నిస్తుంటాం. అయితే ఇదంతా ముందే సెట్ చేసుకొని, ఒక అవగాహన ప్రకారం ఫొటోలు తీయడం. అదే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీ అయితే ఒక కథ చూపించగలగాలి. ఇది ముందుగా సెట్ చేసుకున్నది కాదు. జరుగుతున్నదే ఫొటోలో చూపించగలగాలి. అందుకే ఎడిటోరియల్ ఫొటోగ్రఫీని బాగా ఇష్టపడతాను. మీరు చాలామంది మోడల్స్ ఫొటోలు తీశారు. మోడల్స్ అంటే అందంగా ఉంటే చాలా? అరవింద్: అందం ఒక్కటే సరిపోదు. ‘నేను అందమైన అమ్మాయిని, అబ్బాయిని’ అనుకొని ఈ రంగంలోకి వచ్చేస్తుంటారు. అందం పుట్టుకతో వస్తుంది. దానికి మెరుగుపెట్టాలి. చాలా కష్టపడాలి. ఉదాహరణకు బాలీవుడ్ నటుడు హృతిక్రోషన్నే తీసుకుంటే.. ఇటీవల ఓ సినిమా కోసం అతను బరువు పెరగాల్సి వచ్చింది. అందుకోసం ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక సమోసా తిన్నాడట. అంటే ఈ రంగంలో ఎంతో త్యాగం చేయాల్సి ఉంటుంది. శరీరాకృతి, చర్మనిగారింపు... అన్నీ బెస్ట్‌గా ఉండాలి. అందుకు ఆహారనియమాలు పాటించాలి. వ్యాయామాలు చేయాలి. దీంతో పాటు వారి ముఖంలో భావాలు ఒలికించాలి. యాక్షన్ ఉంటేనే ఈ రంగంలో బాగా రాణించగలరు. నా పని వల్ల క్లయింట్ బిజినెస్ పెరగాలనుకుంటాను. ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో తాజాగా వచ్చిన మార్పులేంటి? భవిష్యత్తు? దీని కింద ఏయే విభాగాలొస్తాయి? అరవింద్: ఇప్పుడంతా డిజిటల్స్. పని సులువయ్యింది. విభిన్నత చూపించడం పెరిగింది. ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి ఎప్పుడూ ఆదరణ పెరుగుతుందే తప్ప, తగ్గదు. బ్యూటీ కూడా ఫ్యాషన్ కిందకే వస్తుంది. ఫొటోగ్రాఫర్ పని ఒక్కదానికే పరిమితం అనేది ఉండదు. ఒక జనరల్ డాక్టర్ లాగే అన్ని అంశాలలోనూ ప్రావీణ్యత సాధించాలి. వ్యక్తి రూపంలో ఉన్న లోపాలను ఫొటోలు తీసే విధానంలో కవర్ చేయవచ్చా? అరవింద్: లోపం లేకుండా ఎవరూ ఉండరు. అలాగని లోపాలను కప్పి పెట్టి ఫొటోలను తీయను. అయితే వారిలో ఉన్న మంచిని బయటకు తీసుకువస్తాను. కళ్లలో నిజాయితీ, కళ కనిపించకపోతే జనాలకు నచ్చదు. అందుకే నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. మనిషిలో శరీరాకృతి, నవ్వు, చూపు.. ఇలా ఏదో ఒకటి బాగుంటుంది. దాన్నే బయటకు తీసుకువస్తాను. నల్లగా ఉన్నామని చాలా మంది కెమెరా ముందుకు రావడానికి భయపడుతుంటారు. కానీ కెమెరాకు నలుపు మైనస్ కాదు. ఎప్పుడూ ప్లస్సే! ఇప్పుడు ఏ చిన్న తేడా వచ్చినా ఫొటోషాప్‌లో మార్పులు చేసేస్తున్నారు. అలా సరిచేయడం అంటే చెరుకు పిప్పి నుంచి రసం తీసి, పంచదార కలిపినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మొబైల్స్‌తో ఫొటోలు తీసేస్తున్నారు. ఇలాంటివారికి మీరిచ్చే సూచనలు? అరవింద్: ఓ రకంగా మంచిదే! కానీ, ఫొటోలు తీయడానికి వారికి బేసిక్స్ కూడా తెలియవు. టైపింగ్ నేర్చుకున్నంత మాత్రాన నవల రాయలేరు కదా! పెద్ద ఫొటోగ్రాఫర్లే ఏది బెస్ట్ ఫొటో అనేది చెప్పలేకపోతున్నారు. ఇక సాధారణ వాళ్ల పరిస్థితి చెప్పక్కర్లేదు. నాలుగు ఫొటోలు తీసి, ఫేస్బుక్లో పెట్టినంత మాత్రాన వాళ్లని ఫొటోగ్రాఫర్స్ అనలేం. ఫొటోగ్రఫీ అనేది ఒక హాబీ. ఆత్మసంతృప్తి కోసం ఫొటోలు తీస్తూనే ఉండాలి. గడిచిన పదేళ్లలో ఫొటోగ్రఫీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అత్యున్నత స్థాయికి చేరింది. ఇంకో పదేళ్లు గడిచిపోతే మళ్లీ బ్యాక్ టు అంటూ బెస్ట్ ఫొటోగ్రాఫర్స్ వైపు చూస్తారు. ఫ్యాషన్ ఫొటోలు బాగా రావాలంటే మంచి రంగులు ఉండాలా? ఫొటోలు తీయడానికి ఏ సమయం మేలు? అరవింద్: ఎంత తక్కువ కలర్స్ ఉంటే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. కలర్స్ కోసమే చేస్తే అది ఫొటో అనిపించుకోదు. ఎప్పుడైనా తెల్లవారుజామున తీసిన ఫొటోలే అద్భుతంగా వస్తాయి. ఏ టైమ్‌లో తీసినా లైటింగ్ ప్రధానంగా చూసుకుంటాను. ఎంచుకునే థీమ్‌ను బట్టి ఉదయం, సాయంత్రం, రాత్రి ఉంటుంది. ఫ్యాషన్ ఫోటోలు తీయాలంటే మోడల్స్‌కి ఉదయం 8 గంటలలోపే పని ముగించేస్తాను. అందుకే వారికి ఉదయం 5:30 గంటలకే మేకప్‌తో రెడీగా ఉండమని చెబుతాను. ఫొటోగ్రాఫర్ ఏ కొంత రాజీపడినా ఫొటో నాణ్యత దెబ్బతింటుంది. ఏయే మోడల్స్‌తో వర్క్ చేశారు? ప్రముఖులతో వర్క్ చేసినప్పుడు అనుభవాలు? అరవింద్: దాదాపు పాత తరం తెలుగు నటీనటులందరినీ ఫొటోలు తీశాను. వారిలో నటి సౌందర్య, సిమ్రాన్, సాక్షిశివానంద్... ఉన్నారు. చిన్నా, పెద్ద మోడల్స్ నుంచి మిస్‌యూనివర్స్ మంత్రి ప్రార్, మిస్ ఇండియా రాణీ జయరాజ్, క్రీడాకారులు సానియామీర్జా, జ్వాలాగుత్తా, సింధు, సైనా నెహ్వాల్, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు... నా జాబితాలో ఇలా చాలా మందే ఉన్నారు. ప్రముఖులతో పని చేసినప్పుడు వారి షెడ్యూల్‌ను బట్టి నా టైమ్ సెట్ చేసుకుంటాను. చాలా మంది లేడీ మోడల్స్‌తో కలిసి పనిచేస్తుంటారు. దీనివల్ల్ల మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు..? అరవింద్: (నవ్వుతూ) అస్సలు లేవు. కెమెరా పట్టుకున్న తర్వాత ఆడ, మగ.. అనే తేడాలు గుర్తుకురావు. న్యూడ్ ఫొటోగ్రాప్స్ కూడా తీసాను. తీసే ఫొటో వైవిధ్యంగా, అద్భుతంగా రావాలి.. దానిపైనే దృష్టి అంతా! నా పని విధానం గురించి మా ఆవిడ షిప్రాకు పూర్తిగా తెలుసు. నేను ఏదైనా చెప్పినా ‘నాకు అరవింద్ ఛెంజి గురించి తెలుసు, ఇంకేమీ తెలియదు వదిలేయండి’ అంటుంది. మాది ప్రేమ వివాహం. తను ఇంటీరియర్ డిజైనర్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యాపారం చేస్తోంది. మాకు నలుగురు అబ్బాయిలు. మరో వందేళ్లకు నా మనవలు నా ఫొటో గుర్తుపట్టి, అరవింద్ ఛెంజి తీసిన ఫొటో ఇదీ .. అంటే చాలు... అదే నాకు పెద్ద అవార్డ్. ఎందుకంటే నేను వేరే అవార్డులేవీ ఇష్టపడను. అవి ప్రతిభకు కొలమానం కాదు. సంభాషణ: నిర్మలారెడ్డి