కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం? | how much the distance between eye and book? | Sakshi
Sakshi News home page

కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?

Published Fri, Nov 7 2014 10:29 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

how much the distance between eye and book?

1.    మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
     ఎ) 3    బి) 2    సి) 6    డి) 4


 2.    కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
     ఎ) దృఢస్తరం      బి) రక్త పటలం     సి) నేత్ర పటలం    డి) శుక్ల పటలం


 3.    కనుపాప వెనుక ఉండే భాగం?
     ఎ) తారక        బి) కటకం     సి) నేత్ర పటలం    డి) ఏదీకాదు


 4.    కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి?
     ఎ) 4    బి) 3    సి) 6     డి) 2


 5.    దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి?
     ఎ) 1 : 15        బి) 1 : 1     సి) 15 : 1        డి) 12 : 15


 6.    రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం?
     ఎ) డి    బి) బి    సి) కె    డి) ఎ


 7.    కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
     ఎ) రొడాప్సిన్    బి) ఐడాప్సిన్     సి) ఎ, బి        డి) కెరాటిన్


 8.    కంటిలోని ఎల్లో స్పాట్‌లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి?
     ఎ) దండ కణాలు    బి) శంకు కణాలు     సి) రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి
     డి) ఎర్ర రక్త కణాలు


 9.    మానవునిలో ఉండే దృష్టి?
     ఎ) బైనాక్యులర్    బి) మోనాక్యులర్     సి) మల్టిపుల్      డి) ఏదీకాదు


 10.    {హస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు?
     ఎ) కుంభాకార     బి) పుటాకార     సి) ద్విపుటాకార    డి) సమతల దర్పణం


 11.    కిందివాటిలో కంటి వ్యాధి కానిది?
     ఎ) గ్లుకోమా    బి) ట్రకోమా     సి) పమోరియా    డి) కాటరాక్ట్


 12.    చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
     ఎ) 10 సెం.మీ.     బి) 20 సెం.మీ.     సి) 40 సెం.మీ.     డి) 30 సెం.మీ.


 13.    సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
     ఎ) కాటరాక్ట్    బి) జీరాప్తాల్మియా     సి) రే చీకటి    డి) ఏదీకాదు


 14.    కంటికి ముందు ఉన్న చిన్న గది?
     ఎ) కచావత్ కక్ష్య     బి) నేత్రోదక కక్ష్య     సి) కటకం        డి) కంటి పొర


 15.    కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
     ఎ) జీరంటాలజి     బి) ఆప్తమాలజి     సి) పేలినాలజి       డి) ట్రైకాలజి


 16.    బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
     ఎ) పక్షి        బి) కీటకం     సి) మానవుడు    డి) గబ్బిలం


 17.    భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
     ఎ) 30    బి) 40    సి) 20    డి) 10


 18.    నీటి కాసులు (గ్లుకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
     ఎ) దంతాలు    బి) కళ్లు     సి) పేగు        డి) కాలేయం


 19.    భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పో షకాహార లోపంతో బాధపడుతున్నారు?
     ఎ) 5    బి) 20    సి) 40     డి) 9


 20.    చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
     ఎ) నాలుకపై    బి) శరీరంపై     సి) మొప్పలపై    డి) వాజాలపై


 21.    నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది?
     ఎ) ముందు భాగం    బి) వెనుక భాగం     సి) అంచులు    డి) పైవన్నీ


 22.    శరీరంలో అతి పెద్ద అవయవం?
     ఎ) నాడీ దండం    బి) చర్మం     సి) వెంట్రుకలు    డి) తొడ ఎముక


 23.    సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
     ఎ) టానింగ్    బి) ఆల్పినో     సి) డెర్మటైటిస్    డి) ఏదీకాదు


 24.    చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి?
     ఎ)    ఎక్స్-రే కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
     బి)    గామా కిరణాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది
     సి)    యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
     డి)    పైవన్నీ


 25.    వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
     ఎ) అంతః చర్మం    బి) బాహ్య చర్మం     సి) ఎ, బి        డి) చర్మం మధ్యపొర


 26.    చర్మ సంబంధ వ్యాధి కానిది?
     ఎ) గజ్జి        బి) తామర     సి) స్కేబీస్    డి) ఏదీకాదు


 27.    స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
     ఎ) చర్మం పొర పొరలుగా రాలిపోవడం     బి) చర్మంలో బొరియలు పడటం
     సి)    స్వేద గ్రంథులు పని చేయకపోవడం     డి) చర్మం నల్ల బారడం


 28.    గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
     ఎ) కీటకాలు    బి) ఫంగస్     సి) బ్యాక్టీరియా       డి) వైరస్


 29.    గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
     ఎ) బ్యాక్టీరియా     బి) వైరస్     సి) ఫంగస్    డి) ప్రోటోజోవా


 30.    చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
     ఎ) అధిక కెరాటిన్       బి) అధిక మెలనిన్     సి) తక్కువ మెలనిన్    డి) ఏదీకాదు


 31.    వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
     ఎ) ట్రైకాలజి    బి) డెర్మటాలజి     సి) హెమటాలజి    డి) జీరంటాలజి


 32.    ఎఖిని అనేది ఒక?
     ఎ) కాలేయ సంబంధ వ్యాధి     బి) గుండె సంబంధ వ్యాధి
     సి) చర్మ సంబంధ వ్యాధి     డి) ఎముకల సంబంధ వ్యాధి


 33.    జతపరచండి.
     1. డెర్మటైటిస్           ఎ. కండరాలు
     2. టెటానస్           బి. కన్ను
     3. పమోరియా        సి. దంతాలు
     4. గ్లుకోమా          డి. చెవి
                             ఈ. చర్మం
     ఎ) 1-ఈ, 2-బి, 3-సి, 4-ఎ
     బి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-డి
     సి) 1-ఈ, 2-ఎ, 3-బి, 4-సి
     డి) 1-ఈ, 2-ఎ, 3-సి, 4-బి


 34.    చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
     ఎ) 6    బి) 3    సి) 8    డి) 12


 35.    కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది?
     ఎ) బాహ్య చెవి       బి) మధ్య చెవి     సి) అంతర చెవి    డి) ఏదీకాదు


 36.    బోనీ కండక్షన్‌లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు?
     ఎ) చెవులు    బి) ఎముకలు     సి) వెంట్రుకలు    డి) పైవన్నీ


 37.    జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
     ఎ) బాహ్య చెవి      బి) అంతర చెవి     సి) మధ్య చెవి      డి) కర్ణభేరి


 38.    మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను     నియంత్రించే భాగమేది?
     ఎ) మెడుల్లా    బి) సెరిబెల్లం     సి) హైపోథాలమస్    డి) పైవన్నీ


 39.    శరీరంలో అతి చిన్న ఎముక?
     ఎ) స్టెపిస్        బి) ఇంకస్     సి) ఇయర్ డ్రమ్    డి) మాలియస్


 40.    యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
     ఎ) నోటి కుహరం - లోపలి చెవి కుహరం     బి) నోటి కుహరం - మధ్య చెవి కుహరం
     సి)    బాహ్య చెవి కుహరం - మధ్య చెవి కుహరం     డి) నోటి కుహరం - బాహ్య చెవి కుహరం


 41.    మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
     ఎ) 5    బి) 3    సి) 4    డి) 10


 42.    మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
     ఎ) 20    బి) 50    సి) 5    డి) 15


 43.    చెమటలో ఉండే పదార్థాలు?
     ఎ) నీరు, సోడియం క్లోరైడ్     బి) నీరు, యూరియా     సి) నీరు, సోడియం క్లోరైడ్, యూరియా     డి) సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది


 44.    చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా?
     ఎ) 99, 0.2 - 0.5      బి) 0.5, 99     సి) 5, 90             డి) 0.5, 0.2


 45.    ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు?
     ఎ) చెవి        బి) కన్ను       సి) చర్మం        డి) గుండె


 46.    విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
     ఎ) యూరియా       బి) కోలెస్టిరాల్     సి) లిపిడ్లు        డి) ప్రోటీన్లు


 47.    జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
     ఎ) మస్తిష్కం    బి) అనుమస్తిష్కం     సి) మజ్జాముఖం    డి) ఏదీకాదు


 48.    సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
     ఎ) ఎఖిని        బి) ఫ్లూరైటిస్     సి) సోరియాసిస్    డి) స్కేబీస్


 49.    చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
     ఎ) కేరళ        బి) తమిళనాడు     సి) కర్ణాటక    డి) బీహార్


 50.    దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
     ఎ) పుటాకార    బి) కుంభాకార     సి) సమతల    డి) ద్వికుంభాకార


 51.    వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్‌నెస్) అనేది?
     ఎ) విటమిన్-ఎ లోపం వల్ల వస్తుంది      బి)    పోషకాహార లోపం వల్ల వస్తుంది
     సి) అనువంశిక వ్యాధి                         డి) ఏదీకాదు


 52.    కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
     ఎ) ఎక్జిమా    బి) సోరియాసిస్     సి) క్షయ        డి) ఎఖిని
 
 సమాధానాలు
 1) సి;    2) ఎ;    3) బి;    4) డి;    5) సి; 6) డి;    7) బి;    8) బి;    9) ఎ;    10) బి;
 11) సి;    12) డి;    13) ఎ;    14) బి;    15) బి; 16) బి;    17) బి;    18) బి;    19) డి;    20) బి;
 21) సి;    22) బి;    23) ఎ;    24) సి;    25) ఎ; 26) డి;    27) బి;    28) ఎ;    29) సి;    30) బి;
 31) ఎ;    32) సి;    33) డి;    34) ఎ;    35) ఎ; 36) బి;    37) బి;    38) సి;    39) ఎ;    40) బి;
 41) ఎ;    42) డి;    43) సి;    44) ఎ;    45) సి; 46) బి;    47) ఎ;    48) డి;    49) బి;    50) బి;
 51) సి;    52) సి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement