కళ్లజోళ్లకూ ఆన్‌లైనే.. | Goggles in online | Sakshi
Sakshi News home page

కళ్లజోళ్లకూ ఆన్‌లైనే..

Published Sat, Jul 29 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 5:05 PM

కళ్లజోళ్లకూ ఆన్‌లైనే..

కళ్లజోళ్లకూ ఆన్‌లైనే..

రూ.250కే ఫ్రేములు, లెన్స్‌
దేశ, విదేశాల నుంచి బ్రాండెడ్‌ ఉత్పత్తుల దిగుమతి
ప్రస్తుతం అబిడ్స్‌లో స్టోర్‌; వారం రోజుల్లో కూకట్‌పల్లిలోనూ..


ఇంజనీరింగ్‌ చదివే సమయంలో ప్రాజెక్ట్‌ వర్క్‌లో భాగంగా సందర్శించిన అరవింద్‌ ఐ కేర్‌.. ఏకంగా కంపెనీ ప్రారంభానికి పునాది వేసింది. కళ్లజోళ్ల విభాగంలో వ్యాపార అవకాశాలను తెలియజేసింది. ఈ ఉపోద్ఘాతమంతా హైదరాబాదీ స్టార్టప్‌ లెన్స్‌ఫిట్‌.కామ్‌ గురించి! మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ వంశీ సీమకుర్తి మాటల్లోనే..

ప్రాజెక్ట్‌ వర్క్‌ కంపెనీ ప్రారంభానికి పునాది వేసిందంటే ఎవరూ నమ్మరు. కానీ, ఇది నిజం. – గీతం వర్సిటీలో ఇంజినీరింగ్‌ చదివే సమయంలో జాగృతి యాత్రలో భాగంగా అరవింద్‌ ఐ కేర్‌కు వెళ్లా. అక్కడ గడిపిన సమయం నన్ను మార్చింది. ఐ కేర్‌లో  వ్యాపారావకాశాలు తెలిశాయి. నిజం చెప్పాలంటే మన దగ్గర ఆన్‌లైన్‌లో కళ్లజోళ్ల ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశాలు తక్కువే. ఉన్నా.. కొన్ని సంస్థలే ఉండటంతో ధరల్లో, నాణ్యతలో పెద్ద తేడా లేదనిపించింది. దీనికి పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో అభిలాష్‌తో కలిసి ఈ ఏడాది ప్రారంభంలో లెన్స్‌ఫిట్‌.కామ్‌ను ప్రారంభించాం.

ఫ్రేము, లెన్స్‌ కలిపి రూ.250..: లెన్స్‌ఫిట్‌ వెబ్‌సైట్, యాప్స్‌ అభివృద్ధి, మార్కెటింగ్‌ ఇతరత్రా వాటికి రూ.5 లక్షల పెట్టుబడులు పెట్టాం. ఇప్పటికే ఈ విభాగంలో కంపెనీలున్నా మా ప్రత్యేకత ఏంటంటే.. కళ్లజోళ్ల ఫ్రేము, లెన్స్‌ కలిపి రూ.250కు అందించడమే. నాణ్యతలో ఏమాత్రం తగ్గకుండా. లెన్స్‌ఫిట్‌లో కళ్లజోళ్ల ఫ్రేములు, సన్‌గ్లాసులు, కాంటాక్ట్‌ లెన్స్‌లు, కళ్లజోళ్ల బాక్స్‌లు, స్క్రూడైవర్‌ సెట్లు, కీచెయిన్ల వంటి ఇతరత్రా ఉత్పత్తులుంటాయి. ఆయా ఉత్పత్తులు పెద్దలవి, పిల్లలవి, అన్ని రంగుల్లోనూ లభ్యమవుతాయి.

విదేశాల నుంచి దిగుమతి..
ఫ్రేములను, లెన్స్‌లను మన దేశంతో పాటు చైనా, ఇటలీ, అమెరికా, జపాన్, కొరియా నుంచి దిగుమతి చేసుకున్నాం. టామ్‌ వాలెన్‌టైన్, ఆల్కాన్, అక్యూవ్యూ, ఫ్రెష్‌లుక్, బౌష్‌ అండ్‌ ల్యాంబ్, చార్లె రిచ్‌మండ్, కిడ్డో, వైల్డ్‌స్పిరిట్‌ వంటి బ్రాండ్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం మా వద్ద 2,000 రకాల ఫ్రేములు, లెన్స్‌లున్నాయి. ఫ్రేములను, లెన్స్‌లను పెద్ద మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తాం. ఇటీవలే టెక్‌ మహీంద్రాలో మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ నిర్వహించాం. ఒకేరోజు 50కి పైగా ఆర్డర్లొచ్చాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కొనుగోలు..
లెన్స్‌ఫిట్‌ ఉత్పత్తుల కొనుగోలుకు వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్‌ ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో అయితే అబిడ్స్‌లో ఫ్రాంచైజీ విధానంలో స్టోర్‌ ఉంది. వారం రోజుల్లో కూకట్‌పల్లిలోని సుజన ఫోరం మాల్‌లో మరో స్టోర్‌ను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం 400 మంది రిజిస్టర్డ్‌ కస్టమర్లున్నారు. వచ్చిన ఆర్డర్లను ఫ్రేములు, లెన్స్‌ల ప్రకారం అబిడ్స్‌లోని తయారీ కేంద్రంలో బిగిస్తాం. కళ్లజోళ్ల ఫ్రేములు, లెన్స్‌ల బిగింపు సరిగాలేకపోయినా.. పొరపాట్లు జరిగినా రిటర్న్‌ తీసుకొని కొత్తవి అందిస్తాం. 3–4 రోజుల్లో ఆర్డర్ల డెలివరీ పూర్తి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement