జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు హర్షి్వత
చింతూరు : మండలానికి చెందిన ఓ గిరిపుత్రిక అండర్ – 7 విభాగంలో జాతీయస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైంది. చింతూరులోని శాంతి స్కూల్లో రెండో తరగతి చదువుతున్న సున్నం హర్షి్వత నవంబరులో జరుగనున్న జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అర్హత సాధించింది. 8, 9 తేదీల్లో కృష్ణాజిల్లా నూజివీడులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో స్థానం సాధించడం ద్వారా హర్షి్వత జాతీయస్థాయికి ఎంపికైనట్టు తండ్రి సున్నం వెంకటరమణ తెలిపారు. హర్షి్వత, ఆమె సోదరి జోషిత కాకినాడలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవగా రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ – 7 విభాగంలో హర్షి్వత మూడోస్థానం, అండర్ – 14 విభాగంలో జోషిత ఆరో స్థానంలో నిలిచారు.