ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’ | state level drama competetion | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’

Jul 5 2017 10:26 PM | Updated on Sep 5 2017 3:17 PM

ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’

ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’

కాకినాడ కల్చరల్‌: స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్‌ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి

రెండోరోజు ఉత్సాహంగా నాటికల పోటీలు
కాకినాడ కల్చరల్‌: స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్‌ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా పరిషత్‌ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ముందుగా శ్రీమూర్తి అసోసియేషన్‌(కాకినాడ) సారధ్యంలో పీవీ భవానీ ప్రసాద్‌ రచించిన ‘అంతిమతీర్పు’ నాటికను డా.సి.ఎస్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఒక దురదృష్ట సంఘటనకు లోనై తనలో తాను కుమిలిపోతు.. కసి, కోపం,ద్వేషం పెంచుకొని చివరకు కట్టుకున్న భర్తని, కన్న కొడుకును దరికి చేర్చుకోలేక , మనశ్శాంతికి దూరమైన ఒక జనని కథ అంతిమ తీర్పు నాటిక. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక (శ్రీకాకుళం) సారధ్యంలో కేకేఎల్‌ ప్రసాద్‌  దర్శకత్వం, రచన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’నాటిక ప్రదర్శించారు. భూస్వాముల దోపిడికి బడుగు, బీద వర్గం బలైపోయే సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రికరించారు. తదుపరి ఉషోదయా కళానికేతన్‌(కట్రపాడు) సారధ్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రస్తుతం సమాజంలో అద్దె గర్భాలతో మన సంస్కృతిక, సాంప్రదాయలను మంట గలుపుతున్నారనే భావంతో ఈ నాటికను రూపొందించారు. పేద మహిళలు మనస్సు చంపుకొని ఏవిధంగా ఇటువంటి అద్దె గర్భాలకు అంగీకరిస్తోన్నారు కళ్ళకు కట్టినట్టు నాటిక ప్రదర్శించారు. తదుపరి  శ్రీసాయి ఆర్ట్స్‌ (కొలుకులూరు) సారధ్యంలో పి.వి.భవానీ ప్రసాద్‌ రచించిన ‘చాలు–ఇకచాలు’ నాటిక గోపరాజు విజయ్‌ దర్శకత్వంలో ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బొర్రా పద్మనాభం, కొల్లి వెంకట్రావు, ఎం.జానకీరామ్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరిష, తురగా సూర్యారవు తదితరులు పాల్గొన్నారు.
నేడు సరికొత్త మనుషులు నాటిక
స్థానిక సూర్యకళామందిర్‌లో గురువారం సాయంత్రం ఎన్‌.రవీంద్రా రెడ్డి దర్శకత్వంలో ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డు ప్రధానం చేస్తారు.
 
05కెకెడి197–270025: తేనేటీగలు పగబడతాయి నాటికలో ఒక సన్నివేశం
05కెకెడి198–270025: గోవు మాలచ్చిమి నాటికలో ఒక సన్నివేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement