competetion
-
చిల్లూపార్పైనే అందరి దృష్టి.. 37 ఏళ్లుగా వారిదే ఆధిపత్యం!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన చిల్లూపార్ విధానసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 37 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గం చేతి నుంచి బయటికి వెళ్లని ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కమలదళం విజయం సాధించలేదు. దీంతో చిల్లూపార్లో కాషాయ జెండా ఎగరవేయాలని సీఎం యోగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోరఖ్‌పూర్ జిల్లాలోని కీలకమైన ఈ నియోజకర్గంలో సీనియర్ నేత హరిశంకర్ తివారీ హవా కొనసాగుతుండడం, బ్రాహ్మణుల ఓట్లు చీలడంతో ఫలితం ఆసక్తికరంగా మారనుంది. ఆధిపత్యం కొనసాగేనా..? చిల్లూపార్ అసెంబ్లీ స్థానానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1985 నుంచి 2007 వరకు వరసగా 22 ఏళ్లు హరిశంకర్ తివారీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజేష్ త్రిపాఠి చేతిలో హరిశంకర్ ఓడిపోయారు. ఆ తర్వాత హరిశంకర్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వినయ్ శంకర్ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై బరిలో దిగారు. 2017లో తొలిసారిగా చిల్లూపార్ నుంచి బీఎస్పీ టికెట్‌పై వినయ్ శంకర్ తివారీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎస్పీ తరఫున వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎమ్మెల్యే రాజేశ్ త్రిపాఠి బీజేపీ తరపున, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్ పెహల్వాన్, కాంగ్రెస్ అభ్యర్థినిగా సోనియా శుక్లా బరిలో దిగారు. చిల్లూపార్ అసెంబ్లీ స్థానంలోని 4.31 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు 1.05 లక్షలు. దళిత, నిషాద్ ఓటర్లు కూడా నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. దీంతో బ్రాహ్మణ, దళిత, యాదవ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంది. -
హైదరాబాద్ హైద్రాస్ వచ్చేస్తోంది..
హైదరాబాద్: ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమింగ్ ఆడాలనుకునే వారికి సరికొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్(ఈఎస్‌పీఎల్) పేరిట అభిమానులను అలరించేందుకు ఈ-ప్లాట్‌ఫామ్ సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలో దేశంలోని ఎనిమిది నగరాలు ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈఎస్‌పీఎల్‌లో పాల్గొంటాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ పేరిట ఓ జట్టు లాంచ్ అయ్యింది. ఈ జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రచారకర్తగా ఉన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ యజమానులు హైదరాబాద్ హైద్రాస్ జట్టును తీసుకొచ్చారు. ఆన్లైన్ గేమింగ్‌పై యువతకు ఉన్న ఆకర్షనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ హైద్రాస్ పని చేస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం పేర్కొంది. కాగా, ఈఎస్‌పీఎల్ తొలి సీజన్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంట్రీల కోసం ఆహ్వానాలు పంపగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే పరిశీలన అనంతరం 96 జట్లను ఫైనల్ చేయగా, అందులో నుంచి ఎనిమిది జట్లు మాత్రమే తుది దశకు అర్హత సాధించాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ ఒకటి. నిన్న మొదలైన ఈఎస్‌పీఎల్ తొలి సీజన్ దాదాపు రెండున్నర నెలల పాటు వర్చువల్ విధానంలో సాగనుంది. ఇందుకు ప్రైజ్‌మనీని రూ.25 లక్షలుగా ఖరారు చేయగా, విజేతకు రూ.12 లక్షలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లకు వరుసగా రూ.6 లక్షలు, రూ.3 లక్షల నగదు ప్రోత్సాహం లభించనుంది. ఈఎస్‌పీఎల్‌లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు www.indiatodaygaming.com/espl లో రిజిస్టర్ కావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈఎస్‌పీఎల్‌లో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. కరోనా వైరస్ దృష్ట్యా వర్చువల్ రీతిలో జరిగే మ్యాచ్‌లన్నీ డిస్నీ హాట్‌స్టార్‌తో పాటు ఇండియాటుడేకు చెందిన అధికారిక యూట్యూబ్, ఫేస్బుక్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
కోవిడ్–19పై ఆన్లైన్ టాలెంట్ కాంపిటీషన్
సుల్తాన్‌బజార్: కోవిడ్–19పై అలిండియాఆన్లైన్ టాలెంట్ కాంపిటీషన్స్ నిర్వహించనున్నట్లు ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఇఎస్ఎస్ నారాయణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నివారణ నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఇంటివద్దనే ఉంటూ లాక్డౌన్ పాటిస్తున్న కవులు, రచయితలు, కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను పోటీల ద్వారా వెలికి తీసి వారి ప్రతిభా పాటవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆన్లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కవితలు, కథానికలు, పాటలు, నృత్యం(సోలో), శాస్త్రీయ జానపద సినిమా, డ్రాయింగ్ తదితర కళలు తదితరఅంశాలపై పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారు వారి వారి ప్రతిభాపాటవాలకు సంబంధించిన వివరాలు, ఫొటో,సెల్ఫీ వీడియోలు ఈనెల 30వ తేదీలోగా al the bertartracadem y@ fmai.com కు పంపించాలని తెలిపారు. వివరాలకు సెల్ నం. 9652347207లో సంప్రదించాలన్నారు. -
14 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 8 స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో దింపింది. వాస్తవానికి టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో ఆరు స్థానాల విషయంలో స్పష్టత ఇచ్చినా.. వాటిల్లోనూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలో నిలిపింది. మరో రెండు స్థానాలపైనా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీజేఎస్ తమకు కాంగ్రెస్ ఇస్తానన్న 8 స్థానాలతోపాటు మరో ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలోకి దింపింది. అయితే విత్‌డ్రాకు సమయం ఉన్నందున ఈలోగా చర్చించి అదనపు సీట్లపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు మెదక్– జనార్దన్‌రెడ్డి, దుబ్బాక– రాజ్‌కుమార్, సిద్దిపేట్– భవానిరెడ్డి, వరంగల్ ఈస్ట్– గాదె ఇన్నయ్య, ఆసిఫాబాద్– విజయ్, చెన్నూరు– నరేష్, మల్కాజిగిరి– కపిలవాయి దిలీప్ కుమార్, మిర్యాలగూడ– విద్యాధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్– రాజేందర్‌రెడ్డి, అశ్వారావుపేట– ప్రసాద్, స్టేషన్‌ఘన్‌పూర్– చింతా స్వామి, ఖానాపూర్– భీంరావు, అంబర్పేట్– రమేష్, వర్ధన్నపేట్– దేవయ్య. -
చల్..చలో..చలో..!
అకాడమీలో శిక్షణకు క్రీడాకారుల ఎంపిక భానుగుడి(కాకినాడ): శాప్ ఆధ్వర్యంలో నాణ్యమైన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ,అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మెరిసేలా అకాడమీలలో కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో శనివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లాలోనే నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా 13 జిల్లాలో పలు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులనుంచి శనివారం దరఖాస్తులు స్వీకరించి, నైపుణ్యాలను పరిశీలించారు. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్ లకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 96మంది క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగా వారికి శరీరధారుడ్య పరీక్షలు నిర్వహించారు. అథ్లెటిక్స్‌కు 31 మంది, జూడోకు 27, జిమ్నాస్టిక్స్‌కు–7, వెయిట్ లిప్టింగ్‌కు 31 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్డీవో సయ్యద్ సాహెబ్ తెలిపారు. వీరందరికీ పలు పరీక్షలు నిర్వహించి ప్రతీ క్రీడకు 20 మంది చొప్పున క్రీడకారులను ఎంపిక చేస్తామన్నారు. ప్రతీ ఈవెంట్‌కు సంబంధించి నైపుణ్య పరీక్షలు నిర్వహించి క్రీడాకారుల ఎంపికలుంటాయన్నారు. ఎంపికలను శాప్ అడిషనల్ డైరక్టర్ ఎస్వీ రమణ పర్యవేక్షణలో జరుగుతున్నట్లు తెలిపారు. నేడు సత్తిగీత, ఎన్.లక్ష్మి హాజరు నేడు జరిగే ఎంపికలకు అంతర్జాతీయ అథ్లెట్ సత్తిగీత, వెయిట్‌లిఫ్టర్ ఎన్.లక్ష్మిలు హాజరు కానున్నారు. వీరితో విద్యార్థినులకు మోటివేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీఎస్డీవో తెలిపారు.రాష్ట్ర ఒలింపిక్ అసోషియేషన్ ప్రెసిడెంట్ బడేటి వెంకటరామ్, జిమ్నాస్టిక్స్ ప్రెసిడెంట్ రామరాజు, జూడో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెకంట్,బాబులు ఎంపికలు నిర్వహించారు. -
హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’
అలరించిన బాలల నృత్య ప్రదర్శన కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను గురువారం శుభోదయ ఫౌండేషన్ చైర్మన్ వాసా సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరిషత్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. బుద్ధరాజు చేస్తున్న సేవలను పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు కొనియాడారు. తదుపరి అభినయ ఆర్ట్స్(గుంటూరు) సారథ్యంలో శిష్టా చంద్రశేఖర్ రచించిన ‘సరికొత్త మనుషులు’ నాటికను ఎన్.రవీంద్రారెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. భారత దేశంలో అనాథశరణాలయాల ఆవశ్యతను చక్కగా చిత్రీకరించారు. మగవాడి పశువాంఛకు బలై గర్భం దాల్చిన కన్యలు పడుతున్న మనోబాధలను చక్కగా చిత్రీకరించారు. చేసిన తప్పుకు ఫలితంగా జన్మించిన పిల్లలను సమాజంలో గౌరవంగా సాకలేక, అలా అని వదిలిపెట్టలేక మనస్సు చంపుకొని అనాథ శరణాలయాలకు దొంగచాటుగా అప్పగిస్తున్న యధార్థ సంఘటనలను ఈ నాటికలో చిత్రీకరించారు. అనంతరం శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్రనాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్యులు ప్రదర్శించిన వినాయక శబ్ధం, శివ పంచాక్షరి నృత్యాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరీష, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు ఇక చాలు’ స్ధానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజల నుంచి నిర్వహిస్తున్న నాటిక పోటీలు గురువారంతో ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా చాలు ఇక చాలు నాటికను ఎంపిక చేసారు. ద్వితీయ ప్రదర్శనగా గోవు మాలచ్చిమి, తృతీయ ప్రదర్శనగా తేనేటీగలూ పగబడతాయి నాటికలు ఎంపిక చేసారు.అలాగే ఉత్తమ దర్శకులుగా చాలు ఇక చాలు నాటికకు దర్శకత్వ చేసిన గోపారాజు విజయ్, ఉత్తమ నటుడుగా చాలు ఇక చాలు కథానాయకుడు రమణ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారిణి అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటిగా సరికొత్త మనుషులు లో నటించిన టి.లక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ రచనకు గాను గోవుమాచ్చిమి నాటిక రచించిన చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ విలన్ గా తేనేటీగలూ పగబడతాయి నాటికలో దొర పాత్రదారి అమరేంద్ర ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా తేటేటీగలూ పగబడతాయి నాటికలో పాముల ఆదియ్య పాత్ర దారి బి.మోహాన్ ఎంపికయ్యారు. వీరికి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అవార్డులను ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కార్యదర్శి పంపన దయానందబాబు, సభ్యులు తదితరలు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’
రెండోరోజు ఉత్సాహంగా నాటికల పోటీలు కాకినాడ కల్చరల్: స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ముందుగా శ్రీమూర్తి అసోసియేషన్(కాకినాడ) సారధ్యంలో పీవీ భవానీ ప్రసాద్ రచించిన ‘అంతిమతీర్పు’ నాటికను డా.సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఒక దురదృష్ట సంఘటనకు లోనై తనలో తాను కుమిలిపోతు.. కసి, కోపం,ద్వేషం పెంచుకొని చివరకు కట్టుకున్న భర్తని, కన్న కొడుకును దరికి చేర్చుకోలేక , మనశ్శాంతికి దూరమైన ఒక జనని కథ అంతిమ తీర్పు నాటిక. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక (శ్రీకాకుళం) సారధ్యంలో కేకేఎల్ ప్రసాద్ దర్శకత్వం, రచన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’నాటిక ప్రదర్శించారు. భూస్వాముల దోపిడికి బడుగు, బీద వర్గం బలైపోయే సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రికరించారు. తదుపరి ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) సారధ్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రస్తుతం సమాజంలో అద్దె గర్భాలతో మన సంస్కృతిక, సాంప్రదాయలను మంట గలుపుతున్నారనే భావంతో ఈ నాటికను రూపొందించారు. పేద మహిళలు మనస్సు చంపుకొని ఏవిధంగా ఇటువంటి అద్దె గర్భాలకు అంగీకరిస్తోన్నారు కళ్ళకు కట్టినట్టు నాటిక ప్రదర్శించారు. తదుపరి శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకులూరు) సారధ్యంలో పి.వి.భవానీ ప్రసాద్ రచించిన ‘చాలు–ఇకచాలు’ నాటిక గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బొర్రా పద్మనాభం, కొల్లి వెంకట్రావు, ఎం.జానకీరామ్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరిష, తురగా సూర్యారవు తదితరులు పాల్గొన్నారు. నేడు సరికొత్త మనుషులు నాటిక స్థానిక సూర్యకళామందిర్‌లో గురువారం సాయంత్రం ఎన్.రవీంద్రా రెడ్డి దర్శకత్వంలో ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డు ప్రధానం చేస్తారు. 05కెకెడి197–270025: తేనేటీగలు పగబడతాయి నాటికలో ఒక సన్నివేశం 05కెకెడి198–270025: గోవు మాలచ్చిమి నాటికలో ఒక సన్నివేశం -
ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు గొల్లప్రోలు : శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో తాటిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న 12వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్థానిక అపర్ణా కళాతోరణం, బత్తుల మురళీకృష్ణ కళావేదికపై మూడు రోజులుగా నాటిక పోటీలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ‘చాలు ఇక చాలు’, ఖాళీలు పూరించండి నాటికలను ప్రదర్శించారు. నాటిక పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, కళాభిమానుల తరలివచ్చారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు పోటీల్లో ఉత్తమ నాటికగా కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ నాటికగా తాడేపల్లి వారి అరవింద ఆర్ట్స్ ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమనాటికగా సికింద్రాబాద్ వారి కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ఖాళీలు పూరించండి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు– కరణం సరేష్(అనంతం), ఉత్తమ నటి–సాదినేని శ్రీజ(ఖాళీలు పూరించండి) , ఉత్తమ రచన– పి.మృత్యుంజయరావు(అనగనగా..), ఉత్తమదర్శకుడు ఆర్ వాసు (అనగనగా..) ఉత్తమ క్యారెక్టర్ నటుడు బీవీ లక్ష్మయ్య(ఆగ్రహం), ప్రతినాయకుడు –పి.భద్రేశ్వరరావు(చేతిరాత ), రంగాలంకరణ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(అనగనగా..) ఆహార్యం– పి.మోహనేశ్వరరావు(అనగనగా), ఉత్తమ సంగీతం– కేఎస్ఎన్ రావు(పితృదేవోభవ) ఎంపికయ్యాయి. అనగనగా నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. నాటికలకు న్యాయనిర్ణేతలుగా రాజాతాతయ్య, కట్టా కృష్ణారావు వ్యవహరించారు. విజేతలకు శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ అధ్యక్షులు పడాల రవి, ప్రధానకార్యదర్శి జక్కా సాంబశివరావు, రాజాతాతయ్య, బత్తుల వెంకటశివరామారావు తదితరులు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. కుటుంబభావోద్వేగాలను చాటిన ‘చాలు ఇక చాలు ’: కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక కుటుంబభావోద్వేగాలను చాటింది. ఈ లోకంలో ప్రతి దానికి మితం ఉందని.. కానీ పిల్లలు ఏదడిగినా తల్లిదండ్రులు కాదు.. లేదు..కుదరదు అని చెప్పలేరని... అదే పిల్లలు ఎదిగి పెద్దవారయ్యాక తల్లిదండ్రులు ఏది అడిగినా ‘కాదు.. లేదు..కుదరదు’ అని ఎంతో సులువుగా తప్పించుకుంటున్నారనే ఇతి వృత్తంతో నాటిక సాగింది. ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పీవీ భవానీ ప్రసాద్ రచించారు. ఆలోచింపజేసిన ‘ఖాళీలు పూరించండి’.. సికింద్రాబాద్‌కు చెందిన కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. సమాజంలో జరుగుతున్న నేరాలు..వాటి పరిణామాలను ఇతి వృత్తంగా చేసుకుని నాటిక సాగింది. రచయిత భాగవతుల ఉదయ్ నాటిక ద్వారా చక్కని సందేశమిచ్చారు. హాస్యాస్పదంగా సాగిన‘ అంతా మన సంచికే ’.. గుంటూరుకు చెందిన గణేష్ ఆర్ట్స్‌వారు ‘అంతా మన సంచికే ’ నాటిక ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం హాస్యాస్పదంగా.. సందేశాత్మకంగా సాగింది. డబ్బు కంటే మమతానురాగాలు ముఖ్యమని నాటిక తెలియచెప్పింది. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) : ద్రాక్షారామ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా సికింద్రాబాద్ కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ ‘ఎవరిని ఎవరు క్షమించాలి,’ ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ ‘కేవలం మనుషులం,’ ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఉషోదయా కళానికేతన్ కట్రపాడు ‘గోవు మాలచ్చిమి,’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా ‘గోవు మాలచ్చిమి’ నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్.అమృతవర్షిణి. ఉత్తమ నటుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటికలో పుణ్యదాసు పాత్రధారి జోగారావు, ఉత్తమ దర్శకుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక దర్శకుడు ఉదయ్ భాగవతులు, ఉత్తమ రచనకు ‘కేవలం మనుషులం’ నాటిక రచయిత శిష్టా చంద్రశేఖర్, ఉత్తమ సంగీతం బహుమతి ‘గోవు మాలచ్చిమి’ నాటికకు పి.లీలామోహన్. ఉత్తమ విలన్‌గా ఒంగోలు జనచైతన్య ‘చేతిరాత’ నాటికలో గోవిందరాజు పాత్రధారి పి. భద్రేశ్వరరావు, ఉత్తమ కారెక్టర్ నటుడు ‘కేవలం మనుషులు’ నాటికలో మీర్జా ఆలీఖాన్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్, ఉత్తమ ద్వితీయ నటి ‘చేతిరాత నాటిక’లో దుర్గ పాత్రధారి ఎల్.పద్మావతి. ఉత్తమ ద్వితీయ నటుడు ‘గోవు మాలచ్చిమి’ నాటికలో నారాయణ పాత్రధారి చిరుకూటి సాంబశివరావుకు లభించాయి. ‘సప్తపది’ నాటికలో ముకుందం పాత్రధారి ఎ.హరిబాబు, ‘చేతిరాత’ నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి సీహెచ్ సుబ్బారావు, ‘కేవలం మనుషులం’ నాటికలో అమల్రాయ్ పాత్రధారి ఎ.లక్ష్మణశాస్త్రికి జ్యూరీ బహుమతులు లభించాయి. నాగిరెడ్డికి ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం ముగింపు సమావేశంలో ద్రాక్షారామ నాటక కళాపరిషత్ అధ్యక్షడు నాగిరెడ్డి సత్యనారాయణకు ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ నాగిరెడ్డి ఈ పరిషత్ స్థాపించి 80 ఏళ్ల వయసులో కూడా చేస్తున్న సేవలను కొనియాడారు. పరిషత్ ఉపా«ధ్యక్షుడు వైఎన్వీవీ సత్యనారాయణ (కొండ), కార్యదర్శి, సినీనటి వై.సరోజ, పరిషత్ కోశాధికారి అయినవిల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి వేమవరపు రాంబాబు, పరిషత్ ఆర్గనైజర్ నాగిరెడ్డి సతీష్‌రావు, పరిషత్ సభ్యులు మాకినీడి రామారావు, ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనను చిక్కాల సత్కరించారు. పెద్దిరెడ్డి సూరిబాబు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు స్టాలిన్, చింతపల్లి వీరభద్రరావు, చింతపల్లి ఈశ్వరరావు కాజులూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఆళ్ల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీర్జాఖాసిం హుస్సేన్, కోటిపల్లి అబ్బు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ
తాటిపర్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటకపోటీలు గొల్లప్రోలు (పిఠాపురం) : తాటిపర్తిలోని అపర్ణ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన విజయాదిత్య ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంటింటి కధ’ ఎంపికకాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన కళాంజలి బృందం ప్రదర్శించిన ‘జారుడుమెట్లు ’ ఎంపికైంది. ఉత్తమనటుడుగా ఇంటింటి కధ పాత్రధారి గోపరాజు విజయ్, ఉత్తమనటిగా జారుడుమెట్లు పాత్రధారి నవీన, ఉత్తమ రచనకు ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్ (ఇంటింటి కధ), ఉత్తమ దర్శకత్వానికి కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు), ఉత్తమ సంగీతం –సాంబశివరావు (ఇంటింటి కధ), రంగాలంకరణ–పిఠాపురం బాబూరావు (మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఉత్తమ ప్రతినాయకి– రజనీ శ్రీకళ (జారుడుమెట్లు), ఉత్తమ హాస్యనటుడు– పీఎస్ సత్యనారాయణ (ఇంటింటి కధ), సహాయ నటి–రమాదేవి æ(ఇంటింటి కధ), సహాయనటుడు–వరప్రసాద్ (జారుడుమెట్లు), ఆహార్యం– పరమేశ్వరరావు(మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఎంపికయ్యారు. విజేతలకు ప్రముఖసినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు, నాటకపరిషత్ కార్యదర్శి బత్తుల వీరభద్రం, ఆకొండి వెంకటేశ్వరశర్మ, దాసం కామరాజు, బాబూరావు, ఆకొండి వెంకటేశ్వరరావు, అమరాది గోపాలకృష్ణ, ప్రభాకరశాస్త్రి, సిద్దా నానాజీ, న్యాయనిర్ణేతలు రాజా తాతయ్య, సీఎ¯ŒS మూర్తి, కె పుల్లారావు తదితరులు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. హరనాథరావు మాట్లాడుతూ అపర్ణ నాటకకళాపరిషత్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకపోటీలు రసవత్తరంగా సాగాయన్నారు. ప్రతీ సంవత్సరం నాటకాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ నాటకరంగం రక్షించబడుతుందో అక్కడ కళారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కళాపరిషత్‌లు నాటక రంగానికి జీవం పోస్తున్నాయని తెలిపారు. -
జాతీయ వాలీబాల్ విజేత పోస్టల్ కర్ణాటక- జేపీఆర్ చెన్నై
బహుమతులు అందజేసిన రాష్ట్ర మంత్రులు ముగిసిన క్రీడా సంబరం అమలాపురం/ఉప్పలగుప్తం (అమలాపురం) : జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగం పోస్టల్ (కర్ణాటక), మహిళ విభాగంలో జేపీఆర్ (చెన్నై) జట్లు విజేతగా నిలిచాయి. లీగ్ పద్ధతిలో జరిగిన పోటీల్లో పాయింట్ల ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ రెండు జట్లు ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో ద్వితీయస్థానంలో సీఆర్పీఎఫ్ (ఢిల్లీ), తృతీయ స్థానంలో వెస్ట్రన్ రైల్వే (ముంబై) నిలవగా, నాలుగో స్థానంలో ఆంధ్రా స్పైకర్ నిలిచాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఇన్‌కంటాక్స్ చెన్నై, సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. మహిళా విభాగంలో జెపీఆర్ చెన్నై జట్టు విన్నర్స్‌గాను, రన్నర్స్‌గా మైసూర్ హాస్టల్ కర్ణాటక జట్టు, మూడో స్థానంలో ఎస్సీ రైల్వే సికింద్రాబాద్, నాలుగో స్థానంలో సాయి గుజరాత్ జట్లు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు రూ.60 వేలతోపాటు ట్రోఫీనందుకున్నాయి. ముగిసిన పోటీలు జాతీయ వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. విజేతలకు ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖామంత్రి చింతకాలయ అయ్యన్న పాత్రుడు, వ్యవసాయశాఖా మంత్రి పత్తిపాటి పుల్లారావు బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఎమ్మెల్సీలు బోడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆదిరెడ్డి అప్పారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, జ్యోతుల నెహ్రూ, దాట్ల బుచ్చిరాజు, నిమ్మల రామానాయుడు, పులపర్తి నారాయణమూర్తి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చెల్లి వివేకానంద, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, ఏరియా ఆసుపత్రి చైర్మన్ మెట్ల రమణబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో మెరిసిన ‘కిరణం’
ఆలమూరు : అంతర్జాతీయ స్థాయి కుంగ్‌పూ పోటీల్లో మండలంలోని మడికి శివారు చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి కిరణ్‌కుమార్ రజతపతకాన్ని సాధించాడు. ఈనెల 12న నేపాల్‌లో నిర్వహించిన పోటీల్లో కిరణ్ ఈ ఘనత సాధించడంతో పాటు వచ్చే ఏప్రిల్‌లో తైవాన్‌లో జరిగే ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించాడు. కిరణ్ గత అక్టోబర్‌లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచాడు. కిరణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో రజత పతకాన్ని సాధించడంతో పాటు ఏసియన్ గేమ్స్‌కు అర్హత సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం స్తున్నారు. -
సత్కారాలు రాజకీయాలు కాకూడదు
సినీ గేయ రచయిత అదృష్టదీపక్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం రామచంద్రపురం : కళాకారులను సత్కరించటంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ప్రముఖ సినీగేయ రచయిత, విమర్శకులు అదృష్టదీపక్ సూచించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలోని బుద్దవరపు మహాదేవుడు కళావేదికలో మూడు రోజులు పాటు మయూర కళాపరిషత్ ఆధ్వర్వంలో నిర్వహించే 14వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. పరిషత్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రంగస్థల నటుడు, వై.ఎస్.కృష్ణేశ్వరరావును కళాపరిషత్ ఆధ్వర్యంలో సత్కరించడం అభినందనీయమన్నారు. నాటికల రచన, దర్శకత్వం, నటనలో కృష్ణేశ్వరరావు తనదైన శైలిలో ప్రేక్షకులను రంజిపజేస్తారని కొనియాడారు. నాటిక పోటీల ద్వారా ప్రజలకు సందేశాలను అందించటమే కళాకారుల విధి అని, అటువంటి నాటిక పోటీలను నిర్వహిచండంలో మయూర కళా పరిషత్ ముందున్నదన్నారు. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం అప్పలాచార్యర్ పరిషత్ ముందుమాటను వివరించారు. అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి నాటిక పోటీల విశిష్టతను వివరించారు. సినీ రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘చాలు... ఇక చాలు’, ‘మాకంటూ ఓ రోజు’ నాటికలను ప్రదర్శించారు. మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ జి.సూర్యనారాయణ, కమిషనర్ సిహెచ్.శ్రీరామశర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నందుల రాజు, మోడరన్ విద్యా సంస్థల అధినేత జీవీ రావు, చిలుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేత అదృష్టదీపక్ వ్యవహరిస్తున్నారు. -
చిరుతల్లా.. శరాల్లా..
సత్తా చాటుతున్న డీఎడ్ విద్యార్థులు హోరాహోరీగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు రాజమహేంద్రవరం రూరల్ :వారు వేట వేళ చిరుతల్లా లంఘిస్తున్నారు. సంధించిన శరాల్లా దూసుకుపోతున్నారు. వివిధ క్రీడల్లో తమ సత్తాను, వడీ, వడుపులను చాటుతూ సంభ్రమానందాలు కలిగిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్)లో జిల్లాస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు రెండవరోజు గురువారం హోరాహోరీగా సాగాయి. డైట్ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలు, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌లలో విద్యార్థులు తలపడ్డారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కాగా సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్యపోటీలు నిర్వహించారు. పోటీలను డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు, లెక్చరర్ రాయుడు, ఇతర లెక్చరర్లు, పీఈటీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, పీడీ ప్రసాద్, పీఈటీలు పర్యవేక్షించగా, ప్రైవేటు డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ప్రదర్శనకు మధుప్రియ ప్రాజెక్టు
రైతుకు ఎంతో ఉపకరించే ధాన్యం ఆరబోత యంత్రం రాష్ట్ర, దక్షిణభారతస్థాయిలలో మన్ననలందుకున్న సృజన పామర్రు(కె.గంగవరం) : పామర్రు ఉన్నత పాఠశాల విద్యార్థి అనుసూరి మధుప్రియ రూపొందించిన ధాన్యం ఆరబోసే యంత్రం ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికైనట్లు హెచ్ఎం ఆర్. దయామణి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు ప్రక్కి వీర బ్రహ్మానందం మార్గదర్శకత్వంలో మధుప్రియ రూపొందించిన ప్రాజెక్టు గత ఏడాది రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలందుకుందని, అక్కడి నుంచి బెంగళూరులో నిర్వహించిన దక్షిణభారత స్థాయి ప్రదర్శనకు ఎంపికైందని తెలిపారు. ఈ నెల 13 నుంచి 19 వరకూ బెంగళూరులో నిర్వహించే 43వ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మేథమేటిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్‌కు ఈ ప్రాజెక్టు జిల్లా నుంచి ఒక్కటే ఎంపికైందన్నారు. ఈ సందర్భంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బ్రహ్మానందం మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు తడిసిపోవడంతో ఆరుదల శాతం తక్కువగా ఉండిపోవడంతో గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందడం చూసి ఈ ప్రాజెక్టును రూపొందించినట్టు తెలిపారు. విద్యుత్ మోటార్ ఆధారంగా నడిచే ఈ యంత్రం ద్వారా ధాన్యం త్వరగా ఆరిపోతుందని, కూలీల అవసరం లేకుండా ధాన్యాన్ని సులువుగా ఆరబెట్టొచ్చని అన్నారు. -
క్షీరధారలే..‘సిరి’నామాలు
-అవగాహన పశుపోషణ లాభదాయకం -అందుకు పాలపోటీలు దోహదం -15 నుంచి 17 వరకూ మండపేటలో రాష్ట్రస్థాయి పాలు, పశుప్రదర్శన పోటీలు మండపేట : ఒకనాడు రైతు ఆర్థిక పరిస్థితి దాదాపు స్వయం సమృద్ధం. చేలో పంట పండితే, గట్టున కందులో, కూరలో పండేవి. దిబ్బ మీద పాకలో ఒకటో రెండో పాడిపశువులు క్షీరధారలు కురిపిస్తే, పాక పైకి పాకించిన ఆనబ, గుమ్మడి, బీర వంటి పాదులు కాయలను ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కారణాలేమైనా.. తరతరాలుగా పాడిపశువులతో ఉన్న బంధాన్ని తెంపుకొని, రైతులే పాలప్యాకెట్లు కొనుక్కుంటున్న రోజులు వచ్చిపడ్డాయి. అయినా సరే.. రైతన్నకు వ్యవసాయం తర్వాత అదనపు ఆదాయాన్ని సమకూర్చే వ్యాపకంగా నేటికీ పాడి పరిశ్రమనే ముందు చెప్పవచ్చు. సాగులో ఆటుపోట్లు ఎదురైనా జీవనోపాధికి ఎంతో కొంత భరోసానిచ్చేది పశుపోషణే. పశుపోషణపై అవగాహనలేమే రైతుల అదనపు ఆదాయానికి గండి కొడుతోందంటున్నారు మండపేటలోని రాష్ట్రపశుసంవర్ధక శిక్షణ కేంద్రం అధ్యాపకులు డాక్టర్ విజయకుమారశర్మ. ఆధునిక శాస్త్రీయ పద్ధతులపై అవగాహన కల్పించడం ద్వారా మేలుజాతి పశుపోషణపై రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు పాలపోటీలు ఎంతగానో ఉపకరిస్తాయంటున్నారాయన. ఈనెల 15 నుంచి 17 వరకూ మండపేటలో రాష్ట్రస్థాయి పాలపోటీలు జరుగనున్న నేపథ్యంలో పాలపోటీల ప్రయోజనాల గురించి విజయకుమారశర్మ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచంలోని గేదెల సంపదలో మనదేశం ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తే, ఆవుల సంపదలో ద్వితీయస్థానంలో ఉంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలోని ముర్రాజాతి గేదెలను అత్యంత మేలుజాతిగా భావిస్తారు. రోజుకు 20 నుంచి 25 లీటర్ల పాలిచ్చే ఈ జాతి పశువులకు విపరీతమైన గిరాకీ ఉంది. రోజుకు 4–6 లీటర్ల పాలిచ్చే దేశవాళీ గేదెల స్థానే ముర్రాజాతి పశుపోషణ రాష్ట్రంలో ఊపందుకుంటోంది. పశుపోషణ పట్ల రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు, మెళకువలపై అవగాహన కల్పించేందుకు పశుసంవర్ధకశాఖ ఎప్పటికప్పుడు పాలపోటీలను నిర్వహిస్తోంది. పాలపోటీల ప్రాముఖ్యత.. -పాలపోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఆయా జాతుల పశువులను రైతులు ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. - అంతరించిపోతున్న ఒంగోలు, థియోని, పుంగనూరు జాతుల విశిష్టతలు తెలుసుకోవడం ద్వారా వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులను చైతన్యవంతుల్ని చేయేచ్చు. -విదేశాలకు చెందిన సంకర జాతి ఆవులు మన వాతావరణంలో ఎలా మనగలుగుతున్నాయి, రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా ఆధునిక శాస్త్రీయ పద్ధతుల గురించి తెలుసుకునేందుకు వీలు కలుగుతుంది. -యంత్ర పరికరాలు అవసరం లేకుండా నిర్ణీత వ్యవధిలో అధికంగా పాలిచ్చే పశువుల నుంచి పాలు తీసే విధానంపై అవగాహన ఏర్పడుతుంది. - పశు పునరుత్పత్తిలో అవలంబించే వ్యాధి రక్షణ, యాజమాన్య విధానాల గురించి తెలుసుకోవచ్చు. -అత్యధికంగా పాలిచ్చే మేలుజాతి గేదెలకు పుట్టిన దున్నలను భవిష్యత్ తరాల వీర్యదాతల్ని చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన ఏర్పడి మేలుజాతి దున్నలు మాంస విక్రయ కేంద్రాలకు తరలిపోకుండా నియంత్రించేందుకు వీలు కలుగుతుంది. -పశుపోషణలో వివిధ ప్రాంతాల రైతులు పాటిస్తున్న మెళకువలను ప్రత్యక్షంగా చూసే వీలు కలుగుతుంది. తద్వారా రైతులను చైతన్యవంతుల్ని చేసేందుకు, పాడి సంపద వృద్ధికి పాలపోటీలు దోహదపడతాయి. పాలపోటీల నిబంధనలివీ.. - ఐదు విభాగాల్లో నిర్వహించే ఈ పాలపోటీలకు సంబంధించి రోజుకు 15 లీటర్ల పైబడి పాలిచ్చే ముర్రా, జాఫర్‌బాది గేదెలు, ఎనిమిది లీటర్ల పైబడి పాలిచ్చే ఒంగోలు, గిర్ జాతి ఆవులు, ఐదు లీటర్ల పైబడి పాలిచ్చే పుంగనూరు ఆవులను పోటీలకు అనుమతిస్తారు. - డిసెంబరు 14 మధ్యాహ్నం నుంచి 15 మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పేర్లు నమోదు చేసుకుంటారు. 15న తీసిన పాలు నమూనాగానే తప్ప పోటీకి పరిగణించరు. - 16న ఉదయం, సాయంత్రం, 17న ఉదయం పశువైద్యుల కమిటీ పర్యవేక్షణలో తీసిన పాలను తూకం వేసేటప్పుడే రైతులు సరిచూసుకోవాలి. -15న సాయంత్రం తీసిన పాల దిగుబడికి, తదుపరి రోజు అనగా 16న ఉదయం తీసిన పాలదిగుబడికి వ్యత్యాసం రెండు కేజీల పైబడి ఉండకూడదు. వ్యత్యాసం ఉంటే పశువును పోటీ నుంచి తొలగిస్తారు. -దూడలు లేని పాడిపశువులను కూడా పోటీలకు అనుమతిస్తారు. -ఉదయం, సాయంత్రం ఆరు గంటల సమయంలో కమిటీ పర్యవేక్షణలో పాలు పితకడం ప్రారంభిస్తారు. -పశువుల నమోదుపై పశువైద్యుల కమిటీదే తుది నిర్ణయం. ఈ విభాగాల్లో పశు ప్రదర్శన.. ఒంగోలు, పుంగనూరు, గిర్ జాతుల ఆడ, మగ విభాగాల్లో, ముర్రా జాతికి చెందిన ఆడ, మగ విభాగాల్లో పశుప్రదర్శన పోటీలు జరుగుతాయి. పాలపళ్లు, రెండు నుంచి నాలుగు పళ్ల వరకు, ఆరు పళ్లు, ఆపైన విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కాకినాడ సిటీ : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో వల్లూరి వెంకటరావు స్మారక రాష్ట్ర స్థాయి పాల పోటీలు, అందాల పోటీలు మండపేటలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో పోటీల పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు, డివిజనల్ సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ అంబేద్కర్ పాల్గొన్నారు. -
రేపు జిల్లాస్థాయి డ్యాన్స్ పోటీలు
పోలాకి: రామకృష్ణ నాట్య కళా సమితి ఆధ్వర్యంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 3న మండల కేంద్రం పోలాకిలో జిల్లాస్థాయి డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహక సభ్యుడు యందవ హరి తెలిపారు. ఉత్సాహవంతులైన డ్యాన్సర్లు, డ్యాన్స్ గ్రూపులు పోటీల్లో పాల్గొనేందకు 9505626727 నంబరులో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. బుల్లితెర యాంకర్ సుధాపూర్ణిమ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈకార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయనున్నామని పేర్కొన్నారు. -
ముంబై మహానగర పాలికపై బిజెపి కన్ను
-
అన్న తమ్ముళ్ల మధ్య టెలికాం ఆఫర్ల వార్
-
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు నేమాం విద్యార్థులు
నేమాం (కాకినాడ రూరల్) : జిల్లా క్రీడామైదానంలో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 17, అండర్–14 విభాగాల్లో జరిగిన స్విమ్మింగ్ ఎంపిక పోటీల్లో నేమాం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ –17 విభాగంలో ఎం.శంకరనారాయణ, పి.రాజు, అండర్–14 విభాగంలో ఎస్.దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. వీరు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామోపాధ్యాయుడు వి.మాచర్రావు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను గ్రామసర్పంచ్ కాటూరి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్యదొర, హైస్కూలు హెచ్ఎం వీవీ రమణ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. నాగులాపల్లి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు.. కొత్తపల్లి : కొత్తపల్లి మండలం నాగులాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రధానోపాధ్యాయుడు బీఆర్వీ ప్రసాద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఎస్.మహేష్, ఎస్.మైకేల్, ఎస్.ఉమామహేశ్వరరావు, జి.ఉమేంద్రలను మండల ఉపాధ్యక్షుడు అనిÔð ట్టి సత్యానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా సత్యానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా Vð లుపొంది గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ స్విమ్మింగ్ వలన మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. అదే విధంగా వ్యాయామోపాధ్యాయురాలు పి.హరిమాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్టీ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘అమరవీరుల సంస్మరణ’ పోటీల గడువు పెంపు
వరంగల్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్, రూరల్ జిల్లా పోలీసు ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 30వ తేదీ వరకు అందించవచ్చని సీపీ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగా అన్ని పోటీలకు పంపించే ఎంట్రీలను ఈనెల 20వ తేదీ వరకు మాత్రమే అందించాలని గడువు విధించామన్నారు. అయితే అందరి విజ్ఞప్తి మేరకు ఈనెలాఖరు వరకు గడుపు పెంచినట్లు వారు పేర్కొన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌పై కథనాలు, వార్తలు, వీడియోలను కమిషనరేట్ పరిధిలోని ఎంట్రీలను పీఆర్వో మో హన్కృష్ణ(94409–04687), రూరల్ జిల్లా పోలీసు పరిధిలోని ఎంట్రీలను రూరల్ ఎస్పీ పీఆర్వో తాళ్లపల్లి రామారావు (94409–04670)కు అందించాలన్నారు. -
ముగిసిన క్యారమ్స్ పోటీలు
పురుషుల విభాగంలో తమిళనాడు హవా చిలకలూరిపేట రూరల్ : సీఅర్ క్లబ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నాలుగు రోజులపాటు పట్టణంలోని క్లబ్ ఆవరణలో నిర్వహించిన స్టేట్ సెకెండ్ ర్యాంకు, సౌత్ ఇండియా టోర్నమెంట్ క్యారమ్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు విభాగాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీలలో విజేతలు.. సౌత్ ఇండియా టోర్నమెంట్ పురుషుల విభాగంలో తమిళనాడు క్రీడాకారులు వరుసగా నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన భారతిదాసన్, బి.రాధాకృష్ణన్ ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. మూడు, నాలుగు స్థానాలను సగమ భారతి, కుబేంద్రబాబు పొందారు. మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యు సరితాదేవి, విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. మూడు, నాలుగు స్థానాలను గుంటూరు చెందిన హుస్నాసమీర, విజయవాడ టి. తనూజ కైవసం చేసుకున్నారు. స్టేట్ సెకెండ్ ర్యాంకు పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎల్. రాఘవేంద్ర ప్రథమ, మహిళ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో అఖిల భారత క్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ సంపతి, ప్రధాన కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్, టెక్నికల్æడైరెక్టర్ డి.రవీంద్రన్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ శంకరరావు, సీఆర్ క్లబ్ కోశాధికారి ఎన్. వెంకట్రామయ్య విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. -
’వరంగల్‌లో పోటీ టీఆర్ఎస్-వైఎస్సార్సీపీ మధ్యనే’
-
ఏపీ ఒలంపిక్సంఘం అద్యక్షపదవిలో మరోట్విస్ట్
-
అనంతపురంలో ’గ్రామీణక్రీడ’