అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో మెరిసిన ‘కిరణం’
అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో మెరిసిన ‘కిరణం’
Published Mon, Feb 13 2017 10:09 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM
ఆలమూరు : అంతర్జాతీయ స్థాయి కుంగ్‌పూ పోటీల్లో మండలంలోని మడికి శివారు చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి కిరణ్‌కుమార్ రజతపతకాన్ని సాధించాడు. ఈనెల 12న నేపాల్‌లో నిర్వహించిన పోటీల్లో కిరణ్ ఈ ఘనత సాధించడంతో పాటు వచ్చే ఏప్రిల్‌లో తైవాన్‌లో జరిగే ఏసియన్ గేమ్స్ పోటీలకు అర్హత సాధించాడు. కిరణ్ గత అక్టోబర్‌లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచాడు. కిరణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో రజత పతకాన్ని సాధించడంతో పాటు ఏసియన్ గేమ్స్‌కు అర్హత సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం స్తున్నారు.
Advertisement
Advertisement