
సుల్తాన్‌బజార్: కోవిడ్–19పై అలిండియాఆన్‌లైన్ టాలెంట్ కాంపిటీషన్స్ నిర్వహించనున్నట్లు ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ ఇఎస్‌ఎస్ నారాయణరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా నివారణ నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా ఇంటివద్దనే ఉంటూ లాక్‌డౌన్ పాటిస్తున్న కవులు, రచయితలు, కళాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను పోటీల ద్వారా వెలికి తీసి వారి ప్రతిభా పాటవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కవితలు, కథానికలు, పాటలు, నృత్యం(సోలో), శాస్త్రీయ జానపద సినిమా, డ్రాయింగ్ తదితర కళలు తదితరఅంశాలపై పోటీలు ఉంటాయన్నారు.
పోటీల్లో పాల్గొనే వారు వారి వారి ప్రతిభాపాటవాలకు సంబంధించిన వివరాలు, ఫొటో,సెల్ఫీ వీడియోలు ఈనెల 30వ తేదీలోగా al the bertartracadem y@ fmai.com కు పంపించాలని తెలిపారు. వివరాలకు సెల్ నం. 9652347207లో సంప్రదించాలన్నారు.