ముగిసిన క్యారమ్స్ పోటీలు
ముగిసిన క్యారమ్స్ పోటీలు
Published Mon, Aug 1 2016 6:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
పురుషుల విభాగంలో తమిళనాడు హవా
చిలకలూరిపేట రూరల్ : సీఅర్ క్లబ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా నాలుగు రోజులపాటు పట్టణంలోని క్లబ్ ఆవరణలో నిర్వహించిన స్టేట్ సెకెండ్ ర్యాంకు, సౌత్ ఇండియా టోర్నమెంట్ క్యారమ్స్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రెండు విభాగాల్లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుంచి 120 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.
పోటీలలో విజేతలు..
సౌత్ ఇండియా టోర్నమెంట్ పురుషుల విభాగంలో తమిళనాడు క్రీడాకారులు వరుసగా నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన భారతిదాసన్, బి.రాధాకృష్ణన్ ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. మూడు, నాలుగు స్థానాలను సగమ భారతి, కుబేంద్రబాబు పొందారు. మహిళల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యు సరితాదేవి, విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. మూడు, నాలుగు స్థానాలను గుంటూరు చెందిన హుస్నాసమీర, విజయవాడ టి. తనూజ కైవసం చేసుకున్నారు. స్టేట్ సెకెండ్ ర్యాంకు పోటీలలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎల్. రాఘవేంద్ర ప్రథమ, మహిళ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎల్. హరిప్రియ ద్వితీయ స్థానంలో నిలిచారు. కార్యక్రమంలో అఖిల భారత క్యారమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ సంపతి, ప్రధాన కార్యదర్శి ఎ.విజయ్‌కుమార్, టెక్నికల్æడైరెక్టర్ డి.రవీంద్రన్, క్రమశిక్షణా సంఘం చైర్మన్ శంకరరావు, సీఆర్ క్లబ్ కోశాధికారి ఎన్. వెంకట్రామయ్య విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.
Advertisement