
బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు గురూ! ఇది ఒకరి మాట..మనసు పెట్టాలే గానీ అదెంత పనీ అనేది సక్సెస్ అయిన వారి మాట. విజయవంతంగా తాము అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎంతోమంది వెయిట్‌లాస్ జర్నీల గురించి తెలుసుకున్నాం. తాజాగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ దాదాపు 90 కిలోలు తగ్గింది. అధిక బరువుతో బాధపడే ఆమె జీవనశైలి మార్పులతో జాగ్రత్తగా తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇంతకీ ఎవరామె? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? తెలుసుకుందాం పదండి.
వాస్తవానికి బరువు తగ్గడం అనేక సవాళ్లతో కూడుకున్నది. డైటింగ్ చేసి కష్టపడి బరువు తగ్గినా, దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. దీనికి మన శరీర తత్వంపై, మనం తింటున్న ఆహారంపై, మన జీవన శైలిపై అవగాహన ఉండాలి. వైద్య నిపుణుల సలహా మేరకు, ప్రణాళికా బద్దంగా ప్రయత్నించి ఒక్కో మైలురాయిని అధిగమించాలి. ఫలితంగా అధిక బరువు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడమేకాదు కొన్ని కిలోలు తగ్గి స్లిమ్‌గా ఆరోగ్యంగా కనిపించడం వల్ల కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేం.
న్యూట్రిషనిస్ట్ ప్రాంజల్ పాండే అదే చేసింది. తద్వారా 150కిలోల బరువునుంచి 66 కిలోలకు విజయవంతంగా బరువును తగ్గించుకుంది. కేవలం రెండేళ్లలో ఈ విజయాన్ని సాధించింది. అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ఉంచి ఆమె ప్రయాణం మొదలైంది. రోజువారీ శారీరక శ్రమ,ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించింది. దీనికి సంబంధించి ఎలా బరువు తగ్గిందీ ఇన్‌స్టాలో వివరించింది. తన అభిమానులు లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. బరువు తగ్గడం ఎవరికైనా సాధ్యమేనని రుజువు చేసింది.
తన కృషి , అంకితభావాన్నిఇలా చెప్పింది.
‘‘బరువున్నా.. బాగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని..అంతేకాదు అసలు నేను సన్నగా మారతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎలాగైతేనేం డబుల్ డిజిట్‌కి చేరాను. దీని కోసం చాలా కష్టపడ్డాను. ఎంతో చెమట చిందించాను. కన్నీళ్లు కార్చాను. చివరికి ఇన్నేళ్లకు 150 కిలోల నుండి 66 కిలోలకు చేరాను’’ అని తెలిపింది.
ప్రాంజల్ అనుసరించిన పద్దతులు
బరువు తగ్గడానికి డైటింగ్, ఎక్స్‌ర్‌సైజ్ కంటే.. జీవనశైలిమార్పులే ముఖ్యం అంటుంది ప్రాంజల్.
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన గోరువెచ్చని నీరు త్రాగడం
ప్రోటీన్ ఫుడ్ బాగా తినడం, చేపలు, పౌల్ట్రీ, రొయ్యలు ,గుడ్లు, అలాగే మొక్కల ప్రోటీన్,పనీర్, టోఫు, గ్రీకు యోగర్ట్, సోయాలాంటివి ఆహారంలో చేర్చుకోవడం.
భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం ముఖ్యంగాక్యారెట్లు , కీరలాంటివాటితో
సూక్ష్మపోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం తృణధాన్యాలు, పండ్లు , కూరగాయలు తినడం. ప్రతిరోజూ నాలుగు లీటర్ల నీరు త్రాగడం.
వ్యాయామం
ప్రతి భోజనంలో ప్రోటీన్‌కు ప్రాధాన్యత. ప్రతి భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలు రోజువారీ నడక. వాకింగ్ కుదరకపోతే భోజనం తర్వాత చురుకుగా ఉండటానికి 10-15 స్క్వాట్‌లు , పడుకునే ముందు 2-3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. జిమ్‌కు వెళ్లడం, పైలేట్స్ , వాకింగ్ లేదా జాగింగ్
నోట్: బరువు తగ్గడం, దానిని నిర్వహించడం అనేది పూర్తి జీవనశైలి మార్పు ద్వారా సాధ్యం అనేది ప్రాంజల్ అనుభవం. ఇది అందరికీ ఒకేలా ఉండకపోయినా.. దాదాపు అందరికీ వర్తిస్తుంది. అంకితభావం , ఆరోగ్యకరమైన జీవనశైలితో ఎవరైనా తమ లక్ష్యాలను సాధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment