రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు నేమాం విద్యార్థులు
నేమాం (కాకినాడ రూరల్) : జిల్లా క్రీడామైదానంలో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 17, అండర్–14 విభాగాల్లో జరిగిన స్విమ్మింగ్ ఎంపిక పోటీల్లో నేమాం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ –17 విభాగంలో ఎం.శంకరనారాయణ, పి.రాజు, అండర్–14 విభాగంలో ఎస్.దుర్గా ప్రసాద్ ఎంపికయ్యారు. వీరు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామోపాధ్యాయుడు వి.మాచర్రావు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను గ్రామసర్పంచ్ కాటూరి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షులు రామదేవు సీతయ్యదొర, హైస్కూలు హెచ్‌ఎం వీవీ రమణ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.
నాగులాపల్లి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు..
కొత్తపల్లి : కొత్తపల్లి మండలం నాగులాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రధానోపాధ్యాయుడు బీఆర్‌వీ ప్రసాద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఎస్.మహేష్, ఎస్.మైకేల్, ఎస్.ఉమామహేశ్వరరావు, జి.ఉమేంద్రలను మండల ఉపాధ్యక్షుడు అనిÔð ట్టి సత్యానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా సత్యానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా Vð లుపొంది గ్రామానికి మంచి పేరు తేవాలన్నారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ స్విమ్మింగ్ వలన మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. అదే విధంగా వ్యాయామోపాధ్యాయురాలు పి.హరిమాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌టీ ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.