సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 8 స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో టీజేఎస్ తమ అభ్యర్థులను పోటీలో దింపింది. వాస్తవానికి టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో ఆరు స్థానాల విషయంలో స్పష్టత ఇచ్చినా.. వాటిల్లోనూ కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలో నిలిపింది.
మరో రెండు స్థానాలపైనా పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీజేఎస్ తమకు కాంగ్రెస్ ఇస్తానన్న 8 స్థానాలతోపాటు మరో ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలోకి దింపింది. అయితే విత్‌డ్రాకు సమయం ఉన్నందున ఈలోగా చర్చించి అదనపు సీట్లపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు
మెదక్– జనార్దన్‌రెడ్డి, దుబ్బాక– రాజ్‌కుమార్, సిద్దిపేట్– భవానిరెడ్డి, వరంగల్ ఈస్ట్– గాదె ఇన్నయ్య, ఆసిఫాబాద్– విజయ్, చెన్నూరు– నరేష్, మల్కాజిగిరి– కపిలవాయి దిలీప్ కుమార్, మిర్యాలగూడ– విద్యాధర్‌రెడ్డి, మహబూబ్‌నగర్– రాజేందర్‌రెడ్డి, అశ్వారావుపేట– ప్రసాద్, స్టేషన్‌ఘన్‌పూర్– చింతా స్వామి, ఖానాపూర్– భీంరావు, అంబర్‌పేట్– రమేష్, వర్ధన్నపేట్– దేవయ్య.
Comments
Please login to add a commentAdd a comment