సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవచేశారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం చర్చించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు.
కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశచెందలేదని.. రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఓటమి చెందినట్లు భావిస్తున్నామన్నారు.
సీబీసీఐడీ విచారణ జరగాలి
రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరికలేదన్నారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment