చిరుతల్లా.. శరాల్లా..
చిరుతల్లా.. శరాల్లా..
Published Thu, Jan 5 2017 10:20 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
సత్తా చాటుతున్న డీఎడ్ విద్యార్థులు
హోరాహోరీగా జిల్లాస్థాయి క్రీడాపోటీలు
రాజమహేంద్రవరం రూరల్ :వారు వేట వేళ చిరుతల్లా లంఘిస్తున్నారు. సంధించిన శరాల్లా దూసుకుపోతున్నారు. వివిధ క్రీడల్లో తమ సత్తాను, వడీ, వడుపులను చాటుతూ సంభ్రమానందాలు కలిగిస్తున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణాసంస్థ (డైట్)లో జిల్లాస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక, సాహిత్య పోటీలు రెండవరోజు గురువారం హోరాహోరీగా సాగాయి. డైట్ ప్రాంగణంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలు, జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్‌లలో విద్యార్థులు తలపడ్డారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కాగా సాంస్కృతిక విభాగంలో పాటలు, ఏకపాత్రాభినయం, నృత్యపోటీలు నిర్వహించారు. పోటీలను డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు, లెక్చరర్ రాయుడు, ఇతర లెక్చరర్లు, పీఈటీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, పీడీ ప్రసాద్, పీఈటీలు పర్యవేక్షించగా, ప్రైవేటు డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
Advertisement