రాష్ట్రస్థాయి డీఎడ్ క్రీడాపోటీల ఓవరాల్ ఛాంప్‌గా ‘తూర్పు’
రాజమహేంద్రవరం రూరల్ : గుంటూరు జిల్లాలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి డీఎడ్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక పోటీల్లో 55 పాయింట్లతో తూర్పు గోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఎ.జయప్రకాశరావు తెలిపారు. డైట్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను ఆయన అభినందించారు. బొమ్మూరు డైట్ కళాశాల విద్యార్థులు 400 మీటర్ల పరుగు రిలేలో ప్రథమ, బాలికల విభాగంలో ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. విజేతలను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు, ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.శేషగిరి, డివైఈవో ఎస్.అబ్రహం, పీఈటీ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జీవన్‌దాస్, ప్రైవేటు డీఎడ్ కళాశాలల ప్రతినిధులు డీవీ సుబ్బరాజు, ఆర్.విశ్వనాథరావు, ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఐహెచ్‌జీఎన్ ప్రసాద్, ఐఏఎస్‌ఈ కళాశాల ప్రాంగణ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఆర్.నాగేశ్వరరావు, డైట్ అధ్యాపకులు జె.సుబ్రహ్మణ్యం, డి.నాగేశ్వరరావు, ఆర్‌జేడీ రాజు, ఎ.రామకృష్ణ, కేవీ సూర్యనారాయణ, సాల్మన్‌రాజు, బావాజీరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.
రాష్ట్రస్థాయి విజేతలు వీరే..
బాలుర వాలీబాల్ పోటీలో రత్న సలోమన్ డీఎడ్ కళాశాల (గోకవరం), కబడ్డీలో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), హైజంప్‌లో వీవీఎస్ డీఎడ్ కళాశాల (యు.కొత్తపల్లి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల, బాలికల విభాగం 400 మీటర్ల పరుగులో సాయిరామ్ డీఎడ్ కళాశాల (పిడింగొయ్యి) ప్రథమ స్థానాలు సాధించాయని జయప్రకాశరావు తెలిపారు. చెస్‌లో వైవీఎస్ అండ్ బీఆర్‌ఎం డీఎడ్ కళాశాల (ముక్తేశ్వరం) ద్వితీయ, బాలికలు 200 మీటర్ల రన్నింగ్, పాటల పోటీల్లో డైట్ కళాశాల (ఐటీడీఏ, రంపచోడవరం), లాంగ్‌జంప్‌లో నారాయణ డీఎడ్ కళాశాల (మలికిపురం), వక్తృత్వ పోటీల్లో జీబీఽఆర్ డీఎడ్ కళాశాల (అనపర్తి), 100 + 4 మీటర్ల పరుగు రిలేలో బొమ్మూరు డైట్ కళాశాల ద్వితీయ స్థానాలు సాధించాయని వివరించారు.