ముగిసిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు
ముగిసిన రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రీడా పోటీలు
Published Sat, Feb 18 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
భానుగుడి (కాకినాడ) : కాకినాడ ప్రెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో మూడు రోజులగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేడ్ జర్నలిస్టుల క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో క్రీడాకారులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్షి్మసత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ నిరంతరం మెదడుతో పనిచేసే జర్నలిస్టులకు మానసిక ప్రశాంతత చేకూర్చే క్రీడలను నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. కబడ్డీలో కృష్ణా జిల్లా విజేతగా నిలవగా, తూర్పుగోదావరి రన్నర్‌గా నిలిచింది. క్రికెట్‌లో పశ్చిమ గోదావరి విజేతగా నిలవగా, గుంటూరు రన్నర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో 300 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. నాకౌట్ పద్దతిలో నిర్వహించిన ఈ క్రీడల్లో జర్నలిస్టులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రెస్‌ఫోరమ్ అధ్యక్షుడు వీసీ వెంకటపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement