
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
చిలుకూరు: ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చిలుకూరుకు చెందిన దళితవాడ సమీపంలో కోదాడ – హుజూర్‌నగర్ రోడ్డుపై ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం నేటి వరకు బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కోటేష్, మండల కార్యదర్శి కందుకూరి ఎల్లయ్య, నాయకులు సిద్దెల శ్రీను, జిల్లా శ్రీను, మల్లేపంగు ఉపేందర్, వీరబాబు, రాంబాబు, ప్రవీణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.