యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసులో ట్విస్టు | Youtuber Dhruv Rathee In Legal Trouble After Maha Cyber Police Filed Case, More Details Inside | Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై కేసులో ట్విస్టు

Published Sat, Jul 13 2024 7:33 PM | Last Updated on Sat, Jul 13 2024 8:03 PM

YouTuber Dhruv Rathee in legal trouble After Maha Cyber Police Filed Case

ముంబై: ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీపై Dhruv Rathee మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆయన పేరిట ఉన్న ఆ అకౌంట్‌ పేరడీదని, దానితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులు గుర్తించారు. దీంతో అకౌంట్‌ ఎవరది అనేది ధృవీకరణ చేసుకోవాల్సి ఉందని పోలీసులు అంటుఉన్నారు. 

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కుమార్తె అంజలి.. యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే పాసయ్యినట్లు సంబంధిత ‘ఎక్స్‌’ ఖాతాలో తప్పుడు సమాచారం పోస్టు చేసినట్లు సైబర్‌ విభాగం వెల్లడించింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అయితే తొలుత అది ధ్రువ్‌ రాఠీ ఖాతా అనుకున్నారంతా. అయితే ఆ ‘ఎక్స్’ అకౌంట్‌ బయోలో మాత్రం ‘‘ఇది ఫ్యాన్‌, పేరడీ ఖాతా. ధ్రువ్‌ రాఠీ అసలైన అకౌంట్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదు’’ అని రాసి ఉంది. 

దీంతో పోలీసులు ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. మరోవైపు ఆ ఖాతా నుంచి శనివారం మరో ట్వీట్‌ పోస్ట్‌ అయ్యింది. ‘‘సైబర్‌ విభాగం సూచనల మేరకు సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను. వాస్తవాల గురించి తెలియక వేరొకరి ట్వీట్‌లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు’’ అనే సందేశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement