ముంబయి: అనుమతి లేకుండా వంతెనను ప్రారంభించారనే ఆరోపణలతో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రేపై కేసు నమోదైంది. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్‌వేను అధికారిక అనుమతి లేకుండా థాక్రే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన ముంబయి పోలీసులు.. కేసు నమోదు చేశారు.
లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్ వంతెన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారిక సంస్థలు ఇంకా ధ్రువీకరించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా వంతెనను ఆదిత్య థాక్రే ప్రారంభించారు. థాక్రే చర్యలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
సునీల్ షింద్, సచిన్ అహిర్‌లతో పాటు ఆదిత్య ఠాక్రేపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 143, 149, 336, 447 కింద కేసు నమోదు చేయబడింది. ఈ సెక్షన్‌లు చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య నేరపూరిత నేరాలకు సంబంధించినవి ఉంటాయి.
దక్షిణ ముంబయి లోయర్ పరేల్ మధ్య నిర్మిస్తున్న కీలకమైన లింక్ డెలిస్లే బ్రిడ్జ్‌ను జూన్‌లో పాక్షికంగా తెరిచారు. కర్రీ రోడ్ నుండి లోయర్ పరేల్‌ను కలిపే మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభించబడింది.
ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment