ముంబై : ‘మహరాష్ట్రలో అసెంబ్లీ ఫలితాలు విడుదలై వారం రోజులవుతుంది. ఇంత వరకూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో స్పష్టత ఇవ్వకపోవడం దారుణం. అధికార మహాయుతి కూటమికి రాష్ట్రంపై ఉన్న అశ్రద్ధకు ఇదే నిదర్శనం’ అంటూ శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
మహరాష్ట్రలోని ప్రస్తుత రాజకీయాలపై ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందించారు. ఫలితాల విడుదలై వారం రోజులవుతున్నా ఓ ముఖ్యమంత్రిని నిర్ణయించలేకపోతున్నారని మహాయుతి కూటమిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు.
To not be able to decide on a chief minister, and form government, for more than a week after result day, is not just an insult to Maharashtra (for taking our state so lightly) but also to the assistance provided by their dearest Election Commission.
It seems that rules only…— Aaditya Thackeray (@AUThackeray) December 1, 2024
ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధికార మహాయుతి కూటమి తీరు చూస్తుంటే నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకు వర్తిస్తాయని, అధికార పార్టీలకు వర్తించవని తెలుస్తోంది. గవర్నర్‌కు సంఖ్యాబలం చూపకుండానే ఏకపక్షంగా ప్రమాణ స్వీకార తేదీని ప్రకటించడం అరాచకం’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి కీలక సమావేశం జరుగాల్సి ఉంది. అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అనూహ్యంగా సతారా జిల్లాలోని తన గ్రామానికి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. ఓ వైపు కీలక సమావేశం ఉన్నా ఏక్‌నాథ్ షిండే గైర్హాజరు కావడం మహరాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో ఆదిత్య ఠాక్రే ఎక్స్ వేదికగా స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment