inaugurate
-
ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్
-
హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్
-
2026 మార్చిలో ‘దేవాదుల’ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చి లోపు వందశాతం పూర్తి చేసి, అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలో 300 రోజుల పాటు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులతో కలిసి ఆయన సందర్శించారు.దేవాదుల పంప్‌హౌస్ వద్ద ప్రాజెక్ట్ పురోగతిపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోపు దేవాదుల పూర్తి చేసి 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్వోసీ కోసం ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పిస్తామన్నారు. ధరలు పెరగడంతో ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ ఇబ్బందిగా మారిందని, ఇందుకోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నామని తెలిపారు. కాలపరిమితిని పెట్టి వీలైనంత త్వరగా సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డిలను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం ఇరిగేషన్ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్ డెకాయిట్లా వ్యవహరించారని, ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేశారని, ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్ట్‌ల పేరుతో రూ.1.81 లక్షల కోట్ల నిధులు ఖర్చుపెట్టారని, రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంచారని వెల్లడించారు. రూ.1.81 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ బిల్లులను తప్పనిసరిగా చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. 15 ఏళ్లుగా నత్తనడకన దేవాదుల: పొంగులేటి దేవాదుల ప్రాజెక్ట్ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. దీనికోసం మరో 3 వేల ఎకరాల భూసేకరణ నవంబర్ 15 లోపు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఇచి్చన హామీ మేరకు, భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, ప్రభుత్వ కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పాల్గొన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఊపేక్షించం సాక్షి, యాదాద్రి: రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఉన్న నీటిపారుదల వనరులపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లలో అన్ని శాఖల కంటే ఎక్కువగా నష్టపోయింది నీటిపారుదల శాఖే అని అన్నారు. సీఎం ఆలోచనల మేరకు మూసీ నదిలో నీటి లభ్యతను పెంచుతామన్నారు. అంతకు ముందు హన్మాపురం వద్ద బునాదిగాని కాలువను మంత్రులు పరిశీలించారు. రుణమాఫీకి మరో రూ.500 కోట్లు: పొంగులేటి రైతు రుణమాఫీ కోసం అవసరమైమే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇంకా ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లతో పాటు అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అ«ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేల్, మల్రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రిలయన్స్, బిర్లా భారీ పెట్టుబడులు
-
ఆడుదాం ఆంధ్రా… ఇది అందరి ఆట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభం కానున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. టోర్నమెంట్ తేదీలివే.. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజులపాటు గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్లు క్రీడాకారులు : 34.19 లక్షలు ప్రేక్షకులు : 88.66 లక్షలు మొత్తం : 122.85 లక్షలు కార్యక్రమ లక్ష్యాలు క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం. క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం. ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ప్రదానం చేస్తారు. మొత్తం రూ. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర ఉత్తేజకరమైన బహుమతులు అందిస్తారు. -
Live: ఆలయాలకు సీఎం జగన్ ప్రారంభోత్సవం..
-
ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
ముంబయి: అనుమతి లేకుండా వంతెనను ప్రారంభించారనే ఆరోపణలతో శివసేన నాయకుడు ఆదిత్య థాక్రేపై కేసు నమోదైంది. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్‌వేను అధికారిక అనుమతి లేకుండా థాక్రే గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ చర్యపై ఆందోళన వ్యక్తం చేసిన ముంబయి పోలీసులు.. కేసు నమోదు చేశారు. లోయర్ పరేల్ వద్ద డెలిస్లే బ్రిడ్జి రెండో క్యారేజ్ వంతెన ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. వంతెనను వాహనదారులు వాడుకోవచ్చని అధికారిక సంస్థలు ఇంకా ధ్రువీకరించలేదు. ఇవేవీ పట్టించుకోకుండా వంతెనను ఆదిత్య థాక్రే ప్రారంభించారు. థాక్రే చర్యలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సునీల్ షింద్, సచిన్ అహిర్లతో పాటు ఆదిత్య ఠాక్రేపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 143, 149, 336, 447 కింద కేసు నమోదు చేయబడింది. ఈ సెక్షన్లు చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు చేయడం, ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య నేరపూరిత నేరాలకు సంబంధించినవి ఉంటాయి. దక్షిణ ముంబయి లోయర్ పరేల్ మధ్య నిర్మిస్తున్న కీలకమైన లింక్ డెలిస్లే బ్రిడ్జ్‌ను జూన్‌లో పాక్షికంగా తెరిచారు. కర్రీ రోడ్ నుండి లోయర్ పరేల్‌ను కలిపే మరో దశ సెప్టెంబర్‌లో ప్రారంభించబడింది. ఇదీ చదవండి: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ -
ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్..!
-
ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యలో నూతన విప్లవం
-
ఈరోజు అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
-
స్టార్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
విశాఖలో ఈనెల 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన
-
సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగల సచివాలయం.. వైరల్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమవుతోంది. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన సచివాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 8 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన భవన సముదాయాన్ని నిర్శించారు. పార్లమెంట్ తరహాలో రెడ్‌శాండ్ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సర్వమత సమ్మేళనానికి సంకేతంగా మసీద్, మందిర్, చర్చిల నిర్మాణాలు.. వందలాది వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ స్థలంతో అద్భుతంగా సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అత్యాధునిక వసతులతో హంగులతో దక్కన్-కాకతీయ ఆర్కిటెక్చర్, సంస్కృతి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ! -
హెలీకాఫ్టర్ పై నుంచి పూలాభిషేకం..అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
-
కిరాక్ ఆర్పీ చేపల పులుసు బ్రాంచ్ ప్రారంభించిన నాగబాబు.. ఫోటోలు వైరల్
-
వకుళమాత సంప్రోక్షణలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
ఏపీలో వ్యర్ధాలతో విద్యుత్ ఉత్పత్తి
-
తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రి ప్రారంభించిన సీఎం జగన్
-
తాడిపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్ ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... ‘‘ కోవిడ్ టైంలో, ఆక్సిజన్ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్ స్టీల్‌కు ఎయిర్ సపరేషన్ ప్లాంట్ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్ హ్యంగర్‌లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. అర్జాస్ స్టీల్స్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తికి ప్రత్యేక అభినందనలు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిది’’ అని అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్ శ్రీకారం సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం జగన్
-
‘పచ్చని’ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరి శ్రమల స్థాపనను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లా చౌటు ప్పల్ మండలం దండు మల్కాపూర్‌లో ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సహకారంతో రాష్ట్ర పారి శ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ‘గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు’ను పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు నవంబర్ 1న ప్రారంభించనున్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివర్ణిస్తున్న దండుమల్కాపూర్ పారిశ్రామికవాడలో తొలి దశలో ఏర్పాటవుతున్న 450 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రెండేళ్ల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించాలనే నిబంధన విధించారు. సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడి అంచనాతో 35 వేల మందికి ఉపాధి కల్పించే ఈ పారిశ్రామికవాడ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుందని రాష్ట్ర పారి శ్రామికవేత్తల సమాఖ్య వర్గాలు చెబుతు న్నాయి. ప్రస్తుతం 438 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయగా, భవిష్యత్తులో 1,200 ఎకరాల్లో విస్తరిం చేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అద్దె స్థలాల్లోనే ఎక్కువ ఎంఎస్ఎంఈలు.. రాష్ట్రంలో సుమారు 25 లక్షలకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉండగా వాటిలో 40 శాతం పరిశ్రమలకే సొంత స్థలాలు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలోని 142 పారిశ్రామిక వాడల్లో 20 శాతంలోపే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఫ్ కోరింది. దీంతో దండుమల్కాపూర్‌లో తొలి దశలో 371 ఎకరాలు, రెండో దశలో 67 ఎకరాలు కలుపుకొని మొత్తంగా 438 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఎకరాకు రూ. 14 లక్షల చొప్పున టిఫ్కు కేటాయించింది. ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల నుంచి 1,200 మంది దరఖాస్తు చేసుకోగా తొలి విడతలో 450 మందికి ప్లాట్లు కేటాయించారు. టిఫ్ సమర్పించిన నివేదికను అనుసరించి పారిశ్రామిక పార్కులో మౌలిక సౌకర్యాల కల్పన ప్రణాళికను రూపొందించారు. ఈ పార్కుకు హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిని అనుసంధా నిస్తూ 2.5 కిలోమీటర్ల పొడవైన అప్రోచ్ రోడ్డుతో పాటు రోడ్లు, మురుగు, వర్షపునీటి కాలువలు, విద్యుత్ తదితర మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేశారు. అప్రోచ్ రోడ్డును 100 అడుగుల వెడల్పు తో నిర్మించారు. బాహ్య మౌలిక సౌకర్యాల కల్పన కు టీఎస్ఐఐసీ రూ.35 కోట్లు, అంతర్గత మౌలిక సౌకర్యాలకు టిఫ్ రూ.150 కోట్లు ఖర్చు చేశాయి. సకల సౌకర్యాలు... రెడ్ కేటగిరీకి చెందిన కాలుష్యకారక పరిశ్రమలకు పార్కులో అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించడం తోపాటు గ్రీన్ కేటగిరీ పరిశ్రమలనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం మురుగు నీటి, వాననీటి కాలువలు, సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి. భగీరథ ద్వారా పార్కుకు నీటి సరఫరాకు ప్రత్యేక పైపులైన్లు నిర్మించారు. భవిష్యత్తులో ఉమ్మడి సౌకర్యాల కేంద్రం, పోలీసు స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, ట్రక్ టర్మినల్, బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసు ఏర్పాటు చేయనున్నారు. ‘మల్టీ ప్రోడక్ట్’ మార్కెటింగ్ మెళకువలపై పారిశ్రామికవేత్తలకు శిక్షణ, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తారు. పార్కులోనే టౌన్‌షిప్‌లు... ‘వాక్ టు వర్క్ ప్లేస్’ నినాదంతో పారిశ్రామిక పార్కులో సమీకృత జనావాసాలు (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు) నిర్మించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్ఐ పాస్‌తోపాటు కొత్త మున్సిపల్ చట్టం నిబంధనల మేరకు పారిశ్రామికవాడల్లోనే టౌన్‌షిప్‌లు నిర్మించే యోచనకు దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ గ్రీన్ పార్కులో శ్రీకారం చుడుతున్నారు. దండుమల్కా పూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును 1,242.36 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని టీఎస్ఐఐసీ ప్రతిపా దించగా ఇప్పటివరకు 1,087 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 155 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మరో 700 ఎకరాల భూసేకరణకు అనుమతివ్వాలని టీఎస్ఐఐసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భూసేక రణ ప్రక్రియ పూర్తయ్యాక గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును దశలవారీగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు రచిస్తోంది. పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమలు.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వైమానిక రంగం, ఆహార శుద్ధి, డ్రిల్లింగ్, రక్షణ రంగం. కాలుష్యరహిత పరిశ్రమలకే చోటు.. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో కాలుష్య రహిత పరిశ్రమలకే అనుమతి ఇస్తాం. పార్కులో పరిశ్రమల స్థాపనకు అనేక మంది ముందుకు వస్తుండటంతో ప్లాట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో 2 వేల ఎకరాల భూసేకరణ దిశగా టీఎస్ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పార్కుతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమల దశ, దిశ పూర్తిగా మారిపోతుంది. ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు లభిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉంది. అతి తక్కువ ధరలో పరిశ్రమల యజమానులకు ఇక్కడ ప్లాట్లు కేటాయించాం. చదరపు గజం ధర రూ. 1,600 లోపే ఉంది. చవకగా ప్లాట్లు లభిస్తుండటంతో పెట్టుబడి భారం తగ్గుతుంది. -కొండవీటి సుధీర్‌రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు దేశంలోనే మోడల్ ఇండస్ట్రియల్ పార్కు భారీ పరిశ్రమలకు దీటుగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. టిఫ్ అభ్యర్థన మేరకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు పనులు ముగింపు దశకు చేరకున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్ఐఐసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ దండుమల్కాపూర్ పార్కు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. – గ్యాదరి బాలమల్లు, టీఎస్ఐఐసీ చైర్మన్ -
‘ది హాత్’ షురూ
-
అభివృద్ధికి ఆమడదూరంలో దేశం : మోదీ
లక్నో : కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం కారణంగా దేశం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో బన్సాగర్ నీటిపారుదల ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. పర్యటనలో భాగంగా గంగానదీపై ఇటీవల నిర్మించిన వంతెనను ప్రారంభించిన మోదీ, మెడికల్ కాలేజీ, 229 కోట్లతో మీర్జాపూర్-ఆలహాబాద్ నేషనల్ హైవేకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన రోడ్‌షోలో మోదీ ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి కాలేదని మండిపడ్డారు. ఇరవై ఏళ్ల క్రితం బన్సాగర్ ప్రాజెక్టుకు 350 కోట్లతో శంకుస్థాపన చేసి వదిలేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 3500 కోట్లుతో ప్రాజెక్టును పూర్తి చేసినట్లు మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మీర్జాపూర్యే కాకుండా ఆలహాబాద్కు కూడా నీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 55ఏళ్ల పాలనలో ఒక్క ఎయియ్స్ కూడా నిర్మించలేకపోయిందని, తమ ప్రభుత్వం 700 మెడికల్, 50 శస్త్రచికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. రాష్ట్రానికి సీఎం అయిన కొంత కాలంలోనే యూపీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని సీఎం యోగి ఆదిత్యానాధ్ను మోదీ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింల పక్షానే నిలుస్తుందని, ట్రిపుల్ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమని శనివారం మోదీ విమర్శించిన విషయం తెలిసిందే. -
ఫైబర్ గ్రిడ్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి
-
ఔరంగాబాద్‌లో అతి పెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
-
సర్దార్ సరోవర్ డ్యాంను ప్రారంభించనున్న మోదీ
-
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు
-
మళ్లీ ఒకరోజు ఎర్రవల్లికి వస్తాను..
-
ఐదుకోట్ల మందికి గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ లో అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మొత్తం 17మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో ఫూంచ్ కమిషన్ సిఫారసులు, అంతర్గత భద్రత, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల సయోధ్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత అంతర్ రాష్ట్ర మండలి భేటీ అయింది. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలని అన్నారు. దేశ అభివృద్ధికి రాష్ట్రాల సహకారం అవసరం అని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు బలపడాలని చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు పెంచడం ద్వారా కిరోసిన్ వాడకం తగ్గించ వచ్చని, కిరోసిన ఆదా చేస్తే మిగిలే నిధుల్లో 75శాతం రాష్ట్రాలకు వాటాగా అందుతుందని చెప్పారు. 5కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. -
డెహ్రాడూన్‌లో శక్తిమాన్ స్మారక పార్కు
-
రేపటి నుంచే ఆటా రజతోత్సవాలు
చికాగో: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పడి 25 సంవత్సరాలు గడచిన సందర్భంగా.. మూడు రోజుల పాటు రజతోత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఆటా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి(శుక్రవారం) నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో చికాగోలోని రోజ్‌మెంట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఆటాలో ముఖ్యసభ్యులు కొందరు అరోరాలోని తమరిండ్ రెస్టారెంట్లో సమావేశమై రజతోత్సవ ఏర్పాట్లకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. మూడు రోజులపాటూ ఘనంగా నిర్వహించనున్న ఈ వేడుకలకు హాజరయ్యే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆటా అధ్యక్షుడు సుధాకర్.ఆర్.పెర్కారి తెలిపారు. అమెరికాలో నివాసముంటున్న తెలుగు వారి సంక్షేమం కోసం 25 సంవత్సరాల క్రితం ఆటా ఏర్పడింది. అప్పటి నుంచి తెలుగు రాష్ర్టాలతో పాటూ అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను ఆటా నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఆటా రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కన్వెన్షన్ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాషా పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న ఆటా వేడుకలకు తెలుగువారు భారీ ఎత్తున హాజరై భావితరాలవారికి వారధులుగా నిలవాలని కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి తెలిపారు. రజతోత్సవ వేడుకలు భావోద్వేగంతో కూడుకున్నవని నిబద్ధతతో విజయవంతం చేయడానికి తమవంతు కృషిచేస్తున్నామని ఆటా ట్రస్టీ హనుమంత్ రెడ్డి తెలిపారు. ఎంతో ఘణమైన చరిత్ర ఉన్న ఆటా ఉత్సవాలు తొలిసారి చికాగోలో 1991లో ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. కాన్ఫరెన్స్ కో కన్వీనర్ కృష్ట ముశ్యమ్, కన్వెన్షన్ మీడియా అధికార ప్రతినిధి కీర్తి కుమార్ రావూరిలు మాట్లాడుతూ మూడు రోజులపాటూ జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్టు తెలిపారు. ఇఫ్తీకర్ షరీఫ్, హరీష్ కొలసాని, భాను స్వర్గమ్లు ఆటా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సమావేశంలో కరుణాకర్ అసిరెడ్డి, మధు బొమ్మినేని, అనిల్ బోడిరెడ్డి, కమల చిమట, జగన్ బుక్కరాజు, డా. మెహర్ మేడవరం, వెంకట్ తుడి, రమణ అబ్బరాజు, మోహన్ మన్నె, శర్మ కంకపాక, హరీశ్ కొలసాని, ఉమా కట్‌కి, పార్త పంతం, సుజాత అప్పలనేని, దినకర్ కరుమురి, రమేశ్ గారపాటి, మల్లారెడ్డి, విక్రం రెడ్డి, శ్రీనివాస్ పెదమల్లు, కరుణాకర్ రెడ్డి దొడ్డం, రామరాజు, చలమారెడ్డి బండారు, మహేందర్ ముస్కుల, రమేశ్ పూల, సాయి ప్రియారెడ్డి, ఉషా ప్రీతి, బింది గంగటి, అమర్ నీతం, యెడవల్లి మూర్తి, చాందినీ దువ్వూరి, వీజే రెడ్డి, సునితా రెడ్డి, రాధా కృష్ణా రెడ్డి, సుధీర్ వేల్పుల, రత్నాకర్ కరుమరి, రోహిణి బొక్క, రవి తొక్కల, గోవింద్‌లు పాల్గొన్నారు. -
అమెజాన్ క్యాంపస్‌కు కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్: 2019 కల్లా హైదరాబాద్‌లో అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తవుతుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలో ఆయన అమెజాన్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. పది ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థ భవనాన్ని నిర్మించనున్నారు. అమెజాన్ ఆఫీసుల్లో అమెరికా తర్వాత ఈ క్యాంపసే అతి పెద్దది కానుందని కేటీఆర్ చెప్పారు. -
టీటీడీ వేద పాఠశాల ప్రారంభించిన 'ప్రణబ్'
-
శంకుస్థాపన మన్మోహన్, ప్రారంభం ప్రధాని
-
ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ
-
ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ
కాబూల్ : రష్యాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకున్నారు. కాబూల్‌లో నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఈ భవన నిర్మాణానికి భారత్ రూ.710 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. 86 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. మొగల్ సంప్రదాయానికి అనుగుణంగా ఈ భవనాన్ని నిర్మించారు. కాబుల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ భారత్ చేరుకుంటారు. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోదీ నేరుగా మాజీ ప్రధాని వాజ్ పేయ్ నివాసానికి చేరుకుంటారు. వాజ్ పేయ్ కి మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. -
’ఆలోచనతో వచ్చి ఆవిష్కరణతో వెళ్లండి’
-
మనరాష్త్రాన్ని మనమే బాగుచేసుకోవాలి : సీఎం
-
లోక్ అదాలత్‌ను ప్రారంభించిన భారత ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు శనివారం హైకోర్టులో మెగా లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఇది జాతీయ స్థాయిలో రెండో లోక్ అదాలత్. గత ఏడాది పది లక్షల కేసులు పరిష్కారించామని, ఈసారి మరింత ఎక్కువ లక్ష్యాన్ని పెట్టుకున్నామని జస్టిస్ దత్తు చెప్పారు. ఇదో చారిత్రక దినమని, న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది వంటిదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్యోతిసేన్ గుప్తా అన్నారు. -
న్యాయవ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది:సీజేఐ
-
హైదరాబాద్‌లో ప్రపంచ కప్ నమూనా ప్రదర్శన
హైదరాబాద్: నగరంలో అప్పుడే క్రికెట్ ప్రపంచ కప్ ఫీవర్ వచ్చేసింది. త్వరలో జరిగే వన్డే ప్రపంచ కప్ నమూనాను ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచ కప్ నమానాను ప్రదర్శించారు. పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రపంచ కప్ ను ధోనీ సారథ్యంలోని భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2015 ప్రపంచ కప్‌నకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోంది. భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. -
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా అసెంబ్లీలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభాపక్ష నాయకుని స్థానంలో కేసీఆర్ ఆసీనులయ్యారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అమరవీరులకు నివాళి: శాసనసభ ప్రారంభానికి ముందుగానే తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న స్మారక స్థూపం నుండి శాసనసభకు కాలినడకన వచ్చారు. శాసనసభా వ్యూహరచనా కమిటీ ఏర్పాటు.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వ్యూహ రచనా కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బుధవారం ఉదయమే సమావేశమైంది. శాసనసభా సమావేశాలున్నంత కాలం ఈ కమిటీ ఉదయం 8.30కే సమావేశమై, ఆ రోజు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తుంది. ఈ కమిటీకి చైర్మన్‌గా మంత్రి హరీశ్‌రావు, సభ్యులుగా మంత్రులు టి.పద్మారావు, పోచారం, కేటీఆర్, శాసనసభ్యులు కె.లక్ష్మారెడ్డి, దాస్యం వినయ్ బాస్కర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు వ్యవహరిస్తారు. -
సప్తగిరి ఛానెల్‌ను ప్రారంభించిన బాబు,వెంకయ్య
-
నేడు సియాచిన్‌కు సందర్శించనున్న మోడీ
-
‘గేమింగ్’లో భవితకు పునాది
గేమ్ పార్క్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సాక్షి నెట్వర్క్: ప్రపంచంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న గేమింగ్ యానిమేషన్‌కు ఇప్పుడు తాము వేస్తున్నది ఒక పునాది అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. గేమింగ్ యానిమేషన్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్(గేమ్) పార్కుకు బుధవారం రాయదుర్గంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఎకరాల్లో రూ. 350 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో 15 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 250 రకాల సేవలందిస్తున్న మీసేవను దేశంలోనే తొలి వినూత్న కార్యక్రమంగా కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఆస్కార్ అవార్డు పొందిన ‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రానికి యాని మేషన్ వర్క్ 80 శాతం హైదరాబాద్‌లోనే జరిగిందంటే అందులో మన రాజధాని పులేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వేతనాలు, పెన్షన్లకే ఖజానా నుంచి రూ. 50 వేల కోట్లు ఖర్చవుతోందని, ఇటీవలి ఐఆర్‌తో రూ. 59 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బందికరమే అయినా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ గేమ్ పార్కులో ఎంటర్టైన్మెంట్ అకాడమీ లేదా వర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేసే హార్డ్‌వేర్ క్లస్టర్లో 65 కంపెనీలు తమ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నాయని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ప్రసాద్, ఐటీ కార్యదర్శి సంజయ్ జాజూ, ఏపీఐఐసీ ఎండీ జయేష్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గేమ్ పార్కుకు కేటాయించిన భూమి తమదేనని, ప్రత్యామ్నాయం చూపకుండా ఆ భూమిని ఐటీ శాఖకు ఎలా బదలాయిస్తారంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఏపీఐఐసీ తమను మోసం చేసిందంటూ మైహోమ్ చైర్మన్ రామేశ్వరరావు ఆరోపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ఎవరికీ నష్టం కల్గించబోమని, సమస్య ఏదైనా ఉంటే తమ వద్దకు రమ్మని సూచించారు. టీ భూములతో సీఎం సొమ్ము చేసుకుంటున్నారు తెలంగాణ భూములను కారు చౌకగా అమ్ముకొని సీఎం కిరణ్ సొమ్ము చేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, రాజయ్య, భిక్షపతి యాదవ్, నల్లాల ఓదేలు ఆరోపించారు. గేమ్ పార్కును ప్రారంభించడానికి వచ్చిన సీఎంను అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభాస్థలి వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్‌రావుతోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకుల్ని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి, నార్సింగ్ పీఎస్‌కు తరలించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. నార్సింగ్ పీఎస్ వద్ద హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో విలువైన ప్రభుత్వ భూములను గేమింగ్ పార్కుకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని సీఎంతో పాటు మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.