ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభం కానున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
టోర్నమెంట్ తేదీలివే..
డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజులపాటు గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి.
రిజిస్ట్రేషన్లు
క్రీడాకారులు : 34.19 లక్షలు
ప్రేక్షకులు : 88.66 లక్షలు
మొత్తం : 122.85 లక్షలు
కార్యక్రమ లక్ష్యాలు
క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం.
ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం.
క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం.
ప్రైజ్ మనీ
నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ప్రదానం చేస్తారు. మొత్తం రూ. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర ఉత్తేజకరమైన బహుమతులు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment