sports fest
-
ఆడుదాం ఆంధ్రా… ఇది అందరి ఆట!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభం కానున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను మంగళవారం గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. టోర్నమెంట్ తేదీలివే.. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజులపాటు గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్లు క్రీడాకారులు : 34.19 లక్షలు ప్రేక్షకులు : 88.66 లక్షలు మొత్తం : 122.85 లక్షలు కార్యక్రమ లక్ష్యాలు క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా తీర్చిదిద్దడం. క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం. ప్రైజ్ మనీ నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ప్రదానం చేస్తారు. మొత్తం రూ. 12 కోట్లకు పైగా నగదు బహుమతులు, ఇతర ఉత్తేజకరమైన బహుమతులు అందిస్తారు. -
హోరాహోరీగా క్రీడా పోటీలు
షటిల్లో ప్రొద్దుటూరుపై తిరుపతి విజయం ముత్తుకూరు: ముత్తుకూరు మత్స్యకళాశాలలో తలపెట్టిన ఐదురోజుల 'ఆక్వా ఫ్రోలిక్ 2016' క్రీడల పోటీలు మూడో రోజు శనివారం హోరాహోరీగా సాగాయి. ఇందులో భాగంగా షటిల్ బాలికల డబుల్స్‌లో ప్రొద్దుటూరు వెటర్నరీ జట్టుపై తిరుపతి వెటర్నరీ జట్టు విజయం సాధించింది. బాలికల సింగిల్స్‌లో తిరుపతి విద్యార్థిని వేదసంహిత గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో గన్నవరం, డబుల్స్‌లో తిరుపతి వెటర్నరీ విద్యార్థులు విజయం సాధించారు. టెన్నికాయిట్‌లో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థినులు, బాలుర టేబుల్ టెన్నిస్‌లో తిరుపతి డెయిరీ టెక్నాలజీ, బాలికల విభాగంలో తిరుపతి వెటర్నరీ విద్యార్థినులు విజయం సాధించారు. అలాగే బాలుర జావెలిన్ త్రో పోటీలో మునిచంద్ర–తిరుపతి, వినోద్–తిరుపతి విద్యార్థులు మొదటి రెండు స్థానాలు కైవశం చేసుకున్నారు. బాలికల విభాగంలో ముత్తుకూరు మత్స్యకళాశాల విద్యార్థిని డీ ఆశ గెలుపొందారు. మూడు వేల మీటర్ల పరుగుపందెంలో గన్నవరం విద్యార్థి సాయితేజ, లాంగ్‌జంప్‌లో ఉదయ్ శివనాగ శంకర్లు ప్రథమ స్థానాలు సాధించారు. బాలికల షాట్‌ఫుట్ విభాగంలో గన్నవరం విద్యార్థిని యాస్మిన్ విజేతగా నిలిచింది. ఇదే విధంగా వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు కూడా జరిగాయి. అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్, క్రీడల హెడ్ జయచంద్ర, స్టూడెంట్స్ ఎఫైర్స్ ఇన్చార్జ్ ప్రభంజన్కుమార్రెడ్డి ఈ పోటీలను పర్యవేక్షించారు.