
సాక్షి,విజయవాడ: ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని శాసన మండలిలో కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించింది. అయితే ప్రస్తుత శాసన మండలి సమావేశాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ నిర్వహణలో అక్రమాలు జరిగాయా? అని టీడీపీ ఎమ్మెల్సీలు రామారావు, రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సమాధానంలో అవినితీ జరిగిందని చెప్పలేదు. క్రీడా మంత్రి రాం ప్రసాద్ జవాబులోనూ అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేదు. దీంతో మండలి సాక్షిగా టీడీపీ అబద్ధపు ప్రచారం గుట్టురట్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment