Adudam Andhra
-
ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని విమర్శించారు మాజీమంత్రి ఆర్కో రోజా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు.కాగా, మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం.టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు-నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా?. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షతోనే నిర్మాణాలు చేపట్టాం.ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదమే అవుతుంది. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని అనలేదా? అంటూ ప్రశ్నించారు. -
మట్టిలో మాణిక్యాలకు జగన్ వల్లే వెలుగు
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహం లేక ఎందరో క్రీడాకారులు గ్రామాలకే పరిమితమైపోయారు. ఈ విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసి రాష్ట్ర మంతా భారీఎత్తున నిర్వహించారు. ఎందరో క్రీడాకారులు ముందుకెళ్లడానికి ఇది దారిచూపింది. అలా వెలుగులోకి వచి్చన వారిలో ఆనంద్‌పాల్ అలియాస్ పవన్ ఒకరు. విజయనగరం జిల్లా జామి మండలంలోని మారుమూల గ్రామం అలమండకు చెందిన ఈ కుర్రాడు ధోనీ సారధ్యంలోని ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆధ్వర్యంలో శిక్షణకు ఎంపికయ్యాడు. తొలి శిక్షణ శిబిరంలో పాల్గొని వచ్చిన అనంతరం పవన్ ‘సాక్షి’తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.. – సత్యార్థ్ సెమీ ఫైనల్స్‌లో ఓడినా.. అన్ని చోట్లా మా టీమ్ గెలుపొందింది. చివరకు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాం. ఆ మ్యాచ్‌లు వీక్షించడానికి వచి్చన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీ నన్ను దత్తత తీసుకుంది. ఆడుదాం ఆంధ్రాలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడమే ఒక అద్భుతం అనుకుంటే.. ఏకంగా సీఎస్కే టీమ్ ట్రైనింగ్‌కు ఎంపికవడం.. శిక్షణ అనంతరం నాకెంతో ఇష్టమైన క్రికెటర్ ధోని ఆధ్వర్యంలోని టీమ్‌లో సభ్యుడిగా ఆడే అవకాశం నాకు దక్కవచ్చని తెలిసి పొంగిపోయాను. ఈ అవకాశం సది్వనియోగం చేసుకుని క్రికెటర్‌గా ఎదగడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. చేనులో ఆట నుంచి ‘చెన్నై’ దాకా... నా తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. తల్లి కూడా రెండేళ్ల క్రితం మరణించారు. నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. పొలాలమ్మట, గల్లీల్లో ఆడుతూ ఉండేవాడిని. ‘చదువుకుని ఉద్యోగం చేసుకోక క్రికెట్ అంటూ తిరుగుతున్నావ్ ఏంట్రా’.. అంటూ అమ్మ కోప్పడుతూ ఉండేది. ఫ్రెండ్స్ మాత్రం క్రికెట్ బాగా ఆడతానని పొగుడుతుండేవారు. అడపాదడపా గ్రామాల్లో జరిగే మ్యాచ్‌లలో ఆడి స్వల్ప పారితోషకాలు అందుకోవడం తప్ప ఆటకు ఎలా సానబెట్టుకోవాలో నాకు తెలియలేదు. అదే సమయంలో దేవుడిచి్చన వరంలా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మా గ్రామ సచివాలయం ద్వారా ఆ కార్యక్రమానికి ఎంపికయ్యాను. థాంక్స్ టూ జగన్ సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టారు. జీవితాంతం జగనన్నకు రుణపడి ఉంటాను. థాంక్స్ టూ జగన్ సార్.. ఆయనెప్పుడూ పేదల పక్షానే ఉంటూ.. ఎన్నో మంచి పథకాలు అమలుచేస్తున్నారు. క్రీడల విషయంలోనూ పేదలకు మేలు చేసే గొప్ప కార్యక్రమం నిర్వహించారు. గల్లీల్లో ఆడుకునే నాలాంటి వాడు రాష్ట్రమంతా తెలిసేలా చేశారు. మరోసారి ఆయనే సీఎం కావాలని.. ఆడుదాం ఆంధ్రాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. -
పప్పులో కాలేసిన రామోజీ.. ఆడుదాం ఆంధ్రా
-
వైఎస్ జగన్ పులిబిడ్డ
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాల నడుమ విజయం సాధించారని, ఇటీవలే ఆయన్ను వ్యక్తిగతంగా కలినినప్పుడు ఒక పులిబిడ్డను చూసిన ఫీలింగ్ కలిగిందని జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ వ్యాఖ్యానించారు. ‘ఆయన నవ్వు, చూపిన అభిమానం పలకరింపులోని స్వచ్ఛత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి’’ అని చెప్పారు. అటు చదువు ఇటు ఆటల్లోనూ రాణిస్తూ పిన్న వయసులోనే అద్భుతాలు లిఖిస్తూ ఏ రికార్డు కైనా చిరునామా అన్నట్టుగా మారిన యువ క్రీడా సంచలనం నైనా ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో తన అనుబంధం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విలక్షణ వ్యక్తిత్వంపై పలు విషయాలు పంచుకున్నారు ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విజయవంతంగా అమలు చేసిన ‘ఆడుదాం – ఆంధ్రా’ కార్యక్రమం అద్భుతం. ఒక క్రీడాకారిణిగా ఔత్సాహిక క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. నాకు అన్ని విధాలుగా మా తల్లిదండ్రుల మద్దతు పుష్కలంగా ఉండడం వల్ల నేను పెద్దగా సమస్యలు ఎదుర్కోనప్పటికీ... నా ఈడు వాళ్లు ఆర్థికంగా, శిక్షణ, వసతుల పరంగా ఎన్ని కష్టాలు అనుభవించారో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే చొరవ తీసుకుని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం చేపట్టడం హర్షణీయం. – సాక్షి, అమరావతి ఆంధ్రప్రదేశ్‌తో అల్లుకున్న అనుబంధం... పుట్టింది హైదరాబాద్ అయినా కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌తో నా అనుబంధం అనేక రకాలుగా పెనవేసుకుపోయింది. ఏపీలో అనేక క్రీడా పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాను. మోటివేషనల్ స్పీకర్‌గానూ ఇక్కడి కళాశాలల్లో, ఈవెంట్స్‌లో ప్రసంగించాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాను. అప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధిని గమనించాను. ఆడపిల్లలకు ‘దిశ’తో సంపూర్ణ రక్షణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై ఎన్నో రకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చట్టం తీసుకురావడం మంచి పరిణామం. అపూర్వమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం...అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దిశ యాప్‌ను రూపొందించడం ఇవన్నీ స్వాగతించదగ్గ మార్పులు. నవరత్నాలు.. మెరుపులు అమ్మ ఒడి పథకం వచ్చిన తర్వాత పేదపిల్లలు చదువుకోవడం నేను గమనించాను. కేవలం పిల్లల్ని స్కూల్‌కి వచ్చేలా చేస్తే సరిపోదు. అందుకే నాడు నేడు ద్వారా స్కూల్స్‌ని కూడా అభివద్ధి చేయడం కూడా దానికి అనుబంధమైన అవసరమైన ఆలోచన. ఈ పథకం విజయం గమనించిన తర్వాత మహిళల స్వయం ఉపాధి, చేయూత వంటి పధకాలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌ని కలిసినప్పుడు ఆయన మాతో సంభాషించిన తీరు ఎంత చెప్పినా సరిపోదు. ఆయన్ను కలవడం నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. ము ఖ్యంగా ఆయన నవ్వు..ఓ వెపన్ అని చెప్పాలి. మనం ఏ స్థాయికి చేరుకున్నా, ఎదుటివారిని చూసి అభిమానంగా నవ్వగలిగితే అదే వారికి మనం ఇచ్చే అందమైన బహుమతి. అలాగే కాన్ఫిడెన్స్, ఫైటింగ్ డెడికేషన్, డైనమిజమ్ వంటివన్నీ క్రీడాకారుల్లో కనిపించే లక్షణా లు. అవన్నీ ఆయనలో నాకు కనిపించాయి. క్రీడలు, మహిళల ఉపాధి వంటి విషయాల్లో నా అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధం. -
గల్లీ క్రికెట్ నుంచి దేశీయ క్రికెట్ దిశగా...కేఏ పాల్ ఆడుదాం ఆంధ్ర ఆణిముత్యం
-
IPL- CSK: ఆడుదాం–ఆంధ్రా నుంచి ఐపీఎల్‌కు..
Adudam Andhra- సాక్షి, విజయనగరం(జామి): వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి. క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్‌కు ఐపీఎల్లో ఆడే అవకాశం చేరువైంది. పవన్ ప్రతిభను గుర్తించిన సీఎస్కే (చెన్త్నె సూపర్ కింగ్స్) అతడిని దత్తత తీసుకుంది. అతడికి శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్లో ఆడేవాడు. తల్లిదండ్రుల మరణంతో క్రికెట్ లో బాగా రాణించేవాడు. అయితే, శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేదు. చాలా నిరుపేద కుటుంబం. తండ్రి చిన్న వయసులోనే మృతిచెందాడు. తల్లి కూడా మృతిచెందింది. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా క్రీడపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్‌రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఫీల్డింగ్, బౌలింగ్‌లో ప్రతిభ చూపాడు. పవన్‌లోని క్రీడా నైపుణ్యాన్ని సీఎస్కే గుర్తించి దత్తత తీసుకుంది. అతడి ఆట మరింత మెరుగుపడేలా శిక్షణ ఇవ్వనుంది.కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా యజ్ఞం ఆడుదాం ఆంధ్రా ఈవెంట్‌కు విచ్చేసిన సీఎస్కే టాలెంట్ హంట్‌లో భాగంగా పవన్‌ను ఎంపిక చేసింది. అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కేవీఎం విష్ణు వర్ధినిని కూడా సెలక్ట్ చేసింది. ఆడుదాం–ఆంధ్రాతో నాకు ఈ గుర్తింపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ఆలోచనతో ఆడుదాం–ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. సీఎస్కే నన్ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారు. – కె.పవన్, క్రికెట్ క్రీడాకారుడు, అలమండ గ్రామం చదవండి: Adudam Andhra: విజేతల జాబితా ఇదే.. -
ఆడుదాం ఆంధ్రాలో ప్రతిభకు పట్టం
నిజాంపట్నం: ఆడుదాం ఆంధ్రా క్రీడలతో ఆణిముత్యాలను వెలికి తీసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో వాలీబాల్ విభాగంలో నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని సాధించిన సందర్భంగా గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా క్రీడలను పెట్టిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడా కారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ 47 రోజులపాటు నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరిగాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి అండగా నిలిచిందని చెప్పారు. నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయి వాలీబాల్‌లో ప్రథమ బహుమతిని సాధించడం మనందరికీ గర్వకారణమని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల, జెడ్పీటీసీ మాజీ ప్రసాదం వాసుదేవ, బోటు ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు విజయం సాధించిన వాలీబాల్ జట్టుకు సత్కారం -
స్ఫూర్తి నింపిన ‘ఆడుదాం ఆంధ్ర’
ఏలూరు రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణపై క్రీడాభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోటీలు క్రీడాలోకానికి నూతన ఉత్తేజాన్ని అందించాయని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఈ పోటీల్లో ఏలూరు జిల్లా బ్యాడ్మింటెన్, క్రికెట్ జట్లు రాష్ట్ర చాంపియన్లుగా అవతరించడంపై క్రీడాకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ పోటీలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాయని చెబుతున్నారు. 2023 డిసెంబర్ 26వ తేదీన సచివాలయ స్థాయిలో ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు జరిగిన ఈ పోటీల్లో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎందరో క్రీడాకారులు అద్భుత ప్రతిభ, పాఠవాలు ప్రదర్శించారని, ప్రతిభ కలిగిన ఎందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని అంటున్నారు. వెలుగులోకి మట్టిలో మాణిక్యాలు పోటీల నిర్వహణపై సర్వత్రా ప్రశంస చాంపియన్లుగా అవతరించిన ఏలూరు జిల్లా క్రికెట్, బ్యాడ్మింటన్ జట్లు -
క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేలా.. ‘ఆడుదాం ఆంధ్ర’
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: కబడ్డీ క్రీడాకారులను మరింత తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి (విక్టరీ వెంకటరెడ్డి) అన్నారు. బుధవారం రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలకు సంబంధించి విశాఖపట్నంలో మంగళవారం రాత్రి ముగింపు కార్యక్రమం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారన్నారు. కబడ్డీలో రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులను మరింత తీర్చిదిద్దాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్‌కు బాధ్యత అప్పగించారన్నారు. లాంగ్ టర్మ్ కోచింగ్‌లో భాగంగా ప్రో కబడ్డీ క్యాంప్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమన్, బాలకృష్ణారెడ్డిలను, అలాగే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కోచింగ్ క్యాంపునకు సంధ్య, సతీష్‌లను అప్పగించారన్నారు. దానికి కట్టుబడి వారిని అన్నివిధాలా తీర్చిదిద్దుతామని వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రో కబడ్డీ తరహా ఆంధ్ర కబడ్డీ లీగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్, వైజాగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసే ప్రతిష్టాత్మక మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో భాగంగా.. నిర్వహించిన టాలెంట్ హంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు అవకాశం లభించింది. జిల్లాకు చెందిన కె.రామ్మోహన్, ఇ.హేమావతిలతోపాటు పులివెందుల జేఎన్టీయూలో నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 14 మంది టాలెంట్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కడప స్పోర్ట్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు దాదాపు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో పూర్తి చేసుకోగా.. మంగళవారం విశాఖపట్నంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రతిభ కనబరిచిన వివిధ క్రీడాకారులను పరిశీలిస్తూ వచ్చిన శాప్ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, టాలెంట్ హంట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి వివిధ అసోసియేషన్లు, సంస్థలు దత్తత తీసుకోగా.. వీరికి ప్రభుత్వం సహకారం అందించి ఉత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఖోఖో క్రీడాంశంలో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. అయితే వీరిరువురూ విద్యాభ్యాసం, శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలలో చదువుతుండగా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆయా జిల్లాల నుంచి ప్రాతనిథ్యం వహించి సత్తా చాటారు. ఆల్‌రౌండర్‌గా హేమావతి.. చింతకొమ్మదిన్నె మండలం కొత్తపల్లెకు చెందిన సాధారణ రైతు శివశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె అయిన ఇల్లూరు హేమావతి పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కనిగిరిలో ఫిజికల్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. రన్నర్‌గా, ఛేజింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈమె జట్టు విజయంలో కీలకభూమిక పోషించి బెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. రామ్మోహన్.. ఛేజింగ్‌లో ఫస్ట్ చింతకొమ్మదిన్నె మండలం ఆర్.టి.పల్లె గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మ దంపతులు కుమారుడైన కట్లా రామ్మోహన్ పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇనకొల్లులోని డీసీఆర్ఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని, జె.పంగలూరు గ్రామంలోని ఎస్ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈయన ఛేజింగ్, రన్నింగ్‌లలో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో పలు సీనియర్ నేషనల్స్తోపాటు, ఖోఖో ప్రోలీగ్ పోటీల్లో చైన్నె క్విక్‌గన్, గుజరాత్ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జె.పంగలూరు సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించి బాపట్ల జట్టును స్టేట్ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించి ఖోఖో పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కె.గాయత్రి.. బ్యాటింగ్‌లో మేటి పులివెందుల పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ట్రిపుల్ఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి మహిళల క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరిచి టాలెంట్ హంట్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష న్ ప్రతినిధుల చూపును ఆకర్షించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సచివాలయం జట్టు నుంచి పాల్గొ న్న కడప మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గాయత్రి బ్యాటింగ్‌లో చక్కటి ప్రతిభ కనబరచడంతో టాలెంట్ హంట్‌కు ఎంపికై ంది. కాగా ఈమె స్వస్థలం పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్గా తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఈశ్వరరావు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు, క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ● బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కడప కాగితాలపేట సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్–ఖాజా జోడి రెండో రన్నరప్‌గా నిలిచాయి. ● బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో కడప శంకరాపురం–4 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన కె.వెన్నెల–శ్రీలత జోడి రన్నరప్‌గా నిలిచారు. ● వాలీబాల్ పురుషుల విభాగంలో అన్నమయ్య జిల్లా కూచివారిపల్లె–1 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి. -
ఆడుదాం ఆంధ్రా ఆణిముత్యాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలుగులోకి తీసే ప్రతిష్టాత్మక మెగా క్రీడా టోర్నమెంట్ ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల్లో భాగంగా.. నిర్వహించిన టాలెంట్ హంట్‌లో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులకు అవకాశం లభించింది. జిల్లాకు చెందిన కె.రామ్మోహన్, ఇ.హేమావతిలతోపాటు పులివెందుల జేఎన్టీయూలో నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 14 మంది టాలెంట్ ప్లేయర్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కడప స్పోర్ట్స్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు దాదాపు 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో పూర్తి చేసుకోగా.. మంగళవారం విశాఖపట్నంలో ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఇప్పటి వరకు ప్రతిభ కనబరిచిన వివిధ క్రీడాకారులను పరిశీలిస్తూ వచ్చిన శాప్ అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, టాలెంట్ హంట్‌లో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరికి వివిధ అసోసియేషన్లు, సంస్థలు దత్తత తీసుకోగా.. వీరికి ప్రభుత్వం సహకారం అందించి ఉత్తమ శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఖోఖో క్రీడాంశంలో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికవడం విశేషం. అయితే వీరిరువురూ విద్యాభ్యాసం, శిక్షణ నిమిత్తం ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలలో చదువుతుండగా, ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఆయా జిల్లాల నుంచి ప్రాతనిథ్యం వహించి సత్తా చాటారు. ఆల్‌రౌండర్‌గా హేమావతి.. చింతకొమ్మదిన్నె మండలం కొత్తపల్లెకు చెందిన సాధారణ రైతు శివశంకర్‌రెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతుల కుమార్తె అయిన ఇల్లూరు హేమావతి పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. కనిగిరిలో ఫిజికల్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతోంది. రన్నర్‌గా, ఛేజింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సత్తాచాటింది. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈమె జట్టు విజయంలో కీలకభూమిక పోషించి బెస్ట్ ప్లేయర్‌గా నిలిచింది. రామ్మోహన్.. ఛేజింగ్‌లో ఫస్ట్ చింతకొమ్మదిన్నె మండలం ఆర్.టి.పల్లె గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మ దంపతులు కుమారుడైన కట్లా రామ్మోహన్ పదో తరగతి వరకు బయనపల్లె ఎస్.వి.హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ వద్ద శిక్షణ పొందాడు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఇనకొల్లులోని డీసీఆర్ఎం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని, జె.పంగలూరు గ్రామంలోని ఎస్ఎస్ఆర్ ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈయన ఛేజింగ్, రన్నింగ్‌లలో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. గతంలో పలు సీనియర్ నేషనల్స్తోపాటు, ఖోఖో ప్రోలీగ్ పోటీల్లో చైన్నె క్విక్‌గన్, గుజరాత్ తదితర జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జె.పంగలూరు సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించి బాపట్ల జట్టును స్టేట్ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించి ఖోఖో పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. కె.గాయత్రి.. బ్యాటింగ్‌లో మేటి పులివెందుల పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ట్రిపుల్ఈ నాల్గవ సంవత్సరం చదువుతున్న కె.గాయత్రి మహిళల క్రికెట్లో చక్కటి ప్రతిభ కనబరిచి టాలెంట్ హంట్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేష న్ ప్రతినిధుల చూపును ఆకర్షించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల సచివాలయం జట్టు నుంచి పాల్గొ న్న కడప మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గాయత్రి బ్యాటింగ్‌లో చక్కటి ప్రతిభ కనబరచడంతో టాలెంట్ హంట్‌కు ఎంపికై ంది. కాగా ఈమె స్వస్థలం పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్గా తల్లిదండ్రులు అన్నపూర్ణ, ఈశ్వరరావు విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సత్తాచాటిన జిల్లా క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు, క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచారు. ● బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కడప కాగితాలపేట సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్–ఖాజా జోడి రెండో రన్నరప్‌గా నిలిచాయి. ● బ్యాడ్మింటన్ మహిళల విభాగంలో కడప శంకరాపురం–4 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన కె.వెన్నెల–శ్రీలత జోడి రన్నరప్‌గా నిలిచారు. ● వాలీబాల్ పురుషుల విభాగంలో అన్నమయ్య జిల్లా కూచివారిపల్లె–1 సచివాలయం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాలీబాల్ జట్టు రెండో రన్నరప్‌గా నిలిచాయి. టాలెంట్ హంట్‌లో జిల్లా క్రీడాకారులకు దక్కిన అవకాశం పోటీల్లో సత్తా చాటిన మనోళ్లు -
‘ఆడుదాం ఆంధ్ర’లో ఏలూరు జిల్లా హవా
● క్రికెట్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమస్థానం ● ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా వంశీ ఏలూరు రూరల్: విశాఖపట్టణంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏలూరు జిల్లా జట్లు సత్తా చాటాయి. క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు. మంగళవారం సాయంత్రం విశాఖలోని జీవీఎంసీ ఇండోర్‌స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ఏలూరు జిల్లా పురుషుల జట్టు ఫైనల్లో తిరుపతి జిల్లా జట్టుతో తలపడింది. జిల్లా క్రీడాకారులు ఆదిరెడ్డి గుణశేఖర్, ఆరేరపు వంశీకృష్ణరాజు ప్రత్యర్థి జట్టును 17–20, 21–16, 17–21 స్కోర్ల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేశారు. క్రికెట్ పోటీల్లో సైతం ఏలూరు జిల్లా జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా పురుషుల జట్టు విశాఖపట్టణం జట్టుతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఏలూరు జట్టు 15.4 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విజేత జట్లు షీల్డ్, కప్‌లతో పాటు రెండు జట్లు రూ.6 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వంశీకృష్ణరాజు ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపిక కాగా, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంశీకృష్ణరాజును దత్తత తీసుకుని ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు. -
Adudam Andhra: వేడుక అదుర్స్
సాక్షి, విశాఖపట్నం/విశాఖ స్పోర్ట్స్ : ఉల్లాసంగా.. ఉత్సాహంగా..‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రీడా పోటీలు మంగళళవారం విశాఖ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముగిశాయి. మట్టిలో మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖలో ఐదురోజుల పాటు ఉత్సాహంగా గడిపారు. ఆడుదాం ఆంధ్రా థీమ్ సాంగ్‌కు నృత్యం చేస్తున్న క్రీడాకారులు గత ఏడాది డిసెంబర్ 26న విజయవాడలో సీఎం జగన్మోహన్రెడ్డి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ క్రీడల్లో యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక వేడుకలు ఘనంగా ముగిశాయి. యువతలో స్ఫూర్తినింపిన క్రీడలు విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు యువతలో క్రీడలపై ఆసక్తిని పెంచాయి. చదువే కాదు క్రీడలు సైతం భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయన్న భరోసాను యువతకు కల్పించాయి. వైఎస్సార్ స్టేడియంలో మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యం వ్యాయామాల పట్ల ప్రజలకు అవగాహన పెరగాలన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని చెప్పారు. ఇక్కడి విజేతలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా సంస్థలు ఎంపిక చేసిన విషయం ముఖ్యమంత్రి ప్రకటించడంతో యువతలో ఉత్సాహం ఉరకలెత్తింది. కిటకిటలాడిన స్టేడియం ఆడుదాం ఆంధ్రా ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌కు వేలాది మంది యువత హాజరై మ్యాచ్ తిలకించారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌కు వచ్చినట్లుగా విశాఖ నగర యువతతో పాటు సమీప జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. స్టేడియంలో ఉత్సాహంగా అభిమానులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పటి నుంచి యువత కేరింతలు, ఈలలతో స్టేడియం మార్మోగింది. ముఖ్యమంత్రి దాదాపు అరగంట పాటు ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. హోరెత్తిన మైదానం ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలతో వైఎస్సార్ స్టేడియం హోరెత్తింది. ఒక పక్క చిన్నారుల నృత్యాలు.. మరో వైపు లేజర్ షో, ఫ్లాష్లైట్లతో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలుత స్టేడియంలో దుబాయ్ జట్టు ఫ్లాష్ డ్యాన్స్ చక్ దే ఇండియా అంటూ అలరించగా కూచిపూడి నృత్యకారిణులు ఓం నమఃశివాయ అంటూ చేసిన ప్రదర్శన అలరించింది. క్రీడాకారులు జయహో అంటూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. నృత్యం చేస్తున్న కళాకారులు మూడు కళారూపాలతో ‘ఆడుదాం ఆంధ్రా’ థీమ్ సాంగ్‌కు చేసిన నృత్యం అబ్బురపరిచింది. ఒక్కసారిగా స్టేడియంలో లైట్స్ఆఫ్ అయ్యాయి. అంతే డ్రోన్స్ ప్రత్యక్షమయ్యాయి. అనంతరం వియ్ ఆర్ రాకింగ్ అంటూ ఫ్లాష్ ఫోతో స్టేడియం మిరమిట్లు గొలిపే కాంతులీనింది. స్టేడియం మొత్తం లైట్లతో లయబద్ధంగా నాట్యమాడింది. రెండు నిమిషాలపాటు బాణసంచాతో స్టేడియం దద్దరిల్లింది. స్టేడియంలో క్రికెట్ ఫైనల్ పోరు పటిష్ట బందోబస్తు క్రీడోత్సవాలకు భారీగా క్రీడాకారులు, జనం తరలివచ్చినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. స్థానిక సీఐ వై.రామకృష్ణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కారు షెడ్ కూడలిలో ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి సిబ్బందికి విధులు అప్పగించారు. పీఎంపాలెం–కొమ్మాది–వుడారోడ్డు –చంద్రంపాలెంకు వెళ్లే వాహనాలను క్రమబద్ధీకరించారు. వేడుకల్లో పాల్గొన్న వారు వీరే.. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి విడదల రజనీ, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌కుమార్, తిప్పలనాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కె.భాగ్యలక్ష్మి, కంబాల జోగులు, నెడ్‌క్యాప్ చైర్మన్, విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె రాజు,గాజువాక ఇన్చార్జి ఉరుకూటి చందు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ కనబరిచిన 14 మంది క్రీడాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం జగన్
-
Adudam Andhra: విజేతల జాబితా ఇదే..
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, వుమెన్‌లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడి, వుమెన్‌లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, వుమెన్‌లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్‌ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్‌గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. కబడ్డీలో బాపట్ల ఆధిక్యం.. కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్‌లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్‌కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు. -
అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం
మన ఊరిలో.. మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు. అలాంటి వారిని గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా..’ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పెంచేందుకు ‘ఆడుదాం ఆంధ్రా..’ ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు ఉత్సవాలు మంగళవారం విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యం, వ్యాయామంపై అవగాహన పెంచేలా.. మన ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంత అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలి. ఆడుదాం ఆంధ్రా ద్వారా ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాల్ని గుర్తించి వారి ప్రతిభకు సాన పెట్టి శిక్షణ ఇవ్వడం మరో లక్ష్యం. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన యువత రాణించేలా ప్రోత్సహించవచ్చు. ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా... ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ తదితర ఐదు క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఫైనల్స్ ముగించుకొని మన విశాఖలో, మన ఉత్తరాంధ్రలో, మన కోడి రామ్మూర్తి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలను నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు పోటీలో పాలుపంచుకున్న పిల్లలందరికీ అందిస్తున్నాం. తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ది బెస్ట్.. క్రికెట్లో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెమ్మలను టాలెంటెడ్ ప్లేయర్స్‌గా గుర్తించాం. కబడ్డీలో ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్‌లో ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ప్రతిభను చాటుకున్నారు. ఖోఖోలో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభను గుర్తించాం. బ్యాడ్మింటన్‌లో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభ నిరూపించుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తున్నాం. ఎంపికైన తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ద బెస్ట్. 14 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ దత్తత... ఈ బృహత్తర కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పాల్గొని ప్రతిభ చాటుకున్న 14 మందిని దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి పవన్ (విజయనగరం), చెల్లెమ్మ కేవీఎం విష్ణువరి్ధని (ఎన్టీఆర్ జిల్లా)ని చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇస్తుంది. క్రికెట్ నుంచే శివ (అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా), చెల్లెమ్మ గాయత్రి (కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకొచ్చింది. సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల)ని ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్(తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్‌కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆ సంస్థలు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకొచ్చాయి. ఇక ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’...! ఈరోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుంది. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత, ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకెళతాం. వీటివల్ల ఆటలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఆకట్టుకున్న లేజర్ షో ముగింపు ఉత్సవాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్రదర్శించారు. ఈ పాటకు దాదాపు 5 నిమిషాల పాటు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించిన లేజర్ షో ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ ఇన్చార్జీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. కమాన్.. క్రికెట్ టీమ్! క్రికెట్లో విజేతగా నిలిచిన ఏలూరు జట్టుకు చెందిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌ని వేదికపైకి రావాలని తొలుత నిర్వాహకులు ఆహ్వానించగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని క్రికెట్ టీమ్ మొత్తం వేదికపైకి రావాలంటూ స్వయంగా చేతులు చాచి ఆహ్వానించడంతో జట్టు సభ్యులంతా ఉత్సాహంగా స్టేడియంలో పరుగులు తీస్తూ వచ్చారు. సీఎంతో కరచాలనం కోసం పోటీపడ్డారు. సెక్యూరిటీని వారించి సీఎం వారితో ఎక్కువ సేపు గడిపారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీని సీఎం జగన్ అందజేశారు. మహిళా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఐదు విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల జాబితాను స్వయంగా ప్రకటించి బహుమతులు అందించారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. జగనన్నని కలిశామన్న ఆనందం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. అరగంట పాటు మ్యాచ్ వీక్షణ క్రికెట్ మైదానానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ క్రీడాకారులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఏలూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్స్ని అరగంట పాటు ఆసక్తిగా వీక్షించారు. వికెట్ పడినా.. ఫోర్లు, సిక్స్ కొట్టినా.. ఇరు జట్లనూ చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌లో ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. -
అందుకోసమే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఈ పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా ఎప్పుడూ ఊహించని పద్దతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమన్నారు. విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగించారు. ఈ రెండు ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు. లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే.. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్తాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే.. 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని ఈ రోజు ఫైనల్స్‌తో ముగించుకున్నామని సీఎం జగన్ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు.. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది -
క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించిన సీఎం జగన్..!
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తున్న క్రీడాకారులు
-
విశాఖలో ఆడుదాం ఆంధ్రా పోటీల ముగింపు కార్యక్రమం
-
రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు ఉత్సాహంగా క్రీడలు
-
Adudam Andhra: ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం జగన్
-
Adudam Andhra: మహత్తర క్రీడా యజ్ఞం.. తొలి అడుగు విజయవంతం
గ్రామస్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూనే.. ఆరోగ్య విషయంలో ఆటలు ఎంత కీలకమో వివరిస్తూ.. ఆటలను జీవన శైలిలో భాగంగా మారుస్తూ.. గ్రామ, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మట్టిలో మాణిక్యాలను వెలికితీయడం... ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం.. అంతటికే పరిమితంగాక.. వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన బృహత్తర క్రీడా యజ్ఞం.. ‘‘ఆడుదాం ఆంధ్రా’’. ఈ మహా క్రీడా సంబరంలో భాగంగా గ్రామ,వార్డు సచివాలయ స్థాయిలో మొత్తం 3.30 లక్షలు, మండలస్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గస్థాయిలో 7,346, జిల్లాస్థాయిలో 1,731, రాష్ట్రస్థాయిలో 260 మ్యాచ్‌లు నిర్వహించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. క్రీడాకారులకు దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు అందించడమే గాకుండా.. రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు.. మరెన్నో ఆకర్షణీయమైన బహుమతులను అందించేందుకు ప్రణాళికలు రచించింది. టాలెంట్ హంట్ రాష్ట్రస్థాయికే పరిమితం కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు రాణించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తో పాటు వివిధ క్రీడా విభాగాలకు సంబంధించిన అసోసియేషన్లు, ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వంటి ఫ్రాంచైజీలను టాలెంట్ హంట్‌కు ఆహ్వానించింది. తద్వారా ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, వారికి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే విజయవంతం ఇలా ఆడుదాం ఆంధ్రా ద్వారా.. వ్యాయామ ఆవశ్యకత, ఆరోగ్యపరంగా అది ఎంత కీలకమో గ్రామస్థాయి నుంచి చైతన్యం కల్పిస్తూ. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల ప్రతిభకు సానపట్టి, క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగనన్న ప్రభుత్వం.. మొదటి ప్రయత్నంలోనే విజయవంతమైందని చెప్పవచ్చు. నిదర్శనం ఇదే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు ఈ క్రీడా యజ్ఞంలో భాగం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ పోటీలను 80 లక్షల మంది వీక్షించడం ఆడుదాం ఆంధ్రాకు దక్కిన ఆదరణకు తార్కాణం. మేటి ఆటగాళ్లు తాము సైతం అంటూ రాష్ట్రం నుంచి టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ కోన శ్రీకర్ భరత్, టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని, బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు వంటి మేటి ప్లేయర్లు కూడా ఈ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించడంలో భాగం కావడం విశేషం. ఇక మొత్తంగా 17,59,263 మంది పురుష, 7,81,709 మంది మహిళా ప్లేయర్లు ఈ క్రీడా సంబరంలో పాలుపంచుకున్నారు. కాగా ఆడుదాం ఆంధ్రా మొదటి సీజన్ విజయవంతంగా పూర్తవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మెగా టోర్నీని నిర్వహించాలని నిర్ణయించింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కూడా! 50 రోజుల పండుగ.. విశాఖలో ముగింపు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆటల పండుగ తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలో ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను ఆయన వీక్షిస్తారు. ఆ తర్వాత క్రీడాకారులు, క్రీడల ఆవశ్యకతను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. ఇలా ఈ క్రీడా సంబరంలోని తొలి ఎడిషన్ పూర్తికానుంది. చదవండి: ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే -
మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు: సీఎం జగన్
CM YS Jagan Vishaka Visit Updates 6:52PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగం ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాం. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్‌లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈ విశాఖలో, ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తిగారి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలు నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకున్న మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగాం. పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు. శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయి. ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం జరుగుతుంది. మన పిల్లల్ని ఐడెంటిఫై చేసిమరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయ పరిధి నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ, వ్యాయామానికి సంబంధించిన వ్యాల్యూను, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను మరింతగా ముందుకు తీసుకెళ్తూ ప్రోత్సహించే కార్యక్రమం. వీటివల్ల మరింత ప్రోత్సాహం ఆటలకు జరగాలి. మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కోరుకుంటూ పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. థ్యాంక్యూ. కబడ్డీకి సంబంధించి సతీష్(తిరుపతి జిల్లా), కృష్ణారెడ్డి(బాపట్ల) వీరిని ప్రొ కబడ్డీ టీమ్ దత్తత తీసుకోవడం జరిగింది. సుమన్(తిరుపతి జిల్లా), సంధ్య(విశాఖపట్నం)లను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని, మౌనిక(బాపట్ల)లను వీరిద్దర్నీ దత్తత తీసుకోవడానికి బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్(బాపట్ల) అనే తమ్ముడిని, హేమావతి(ప్రకాశం)అనే చెల్లెమ్మను దత్తత తీసుకోవడానికి ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్‌కు సంబంధించి ఎ. వంశీకృష్ణ(ఏలూరు జిల్లా), ఎం ఆకాంక్ష(బాపట్ల)లను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది 6:50PM, Feb 13, 2024 ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా లైట్ షో ప్రదర్శన తిలకిస్తున్న సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో భాగంగా వివిధ విభాగాల్లో కళాకారుల నృత్య ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు 6:30PM, Feb 13, 2024 ఆరు వికెట్ల తేడాతో విశాఖపై ఏలూరు క్రికెట్ జట్టుపై విజయం ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీల్లో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విశాఖ క్రికెట్ జట్టుపై ఏలూరు జట్టు విజయం సాధించింది 6:15PM, Feb 13, 2024 వేదికపై నుంచి సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను తిలకించారు. సీఎం జగన్ చప్పట్లు కొడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు 6:00PM, Feb 13, 2024 సీఎం జగన్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు చివరి ఐదు ఓవర్ల మ్యాచ్‌ను సీఎం జగన్ వీక్షిస్తున్నారు విశాఖ-ఏలూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నారు 5:23PM, Feb 13, 2024 విశాఖ చేరుకున్న సీఎం జగన్ 4:55 PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖ చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్ 4:18PM, Feb 13, 2024 విశాఖకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 2:50PM, Feb 13, 2024 కాసేపట్లో విశాఖపట్నం బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్ నేటితో ముగియనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ముగింపు వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్ 50 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగిన క్రీడలు విజేతలకు బహుమతులు అందజేయనున్న సీఎం జగన్ క్రీడాకారుల్లో ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి చేరుకుంటారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది. -
ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్‌ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్‌గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్‌గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్‌గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి. ► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్‌గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్‌గా కర్నూలు జిల్లా ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్‌గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్‌గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. ► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్‌బే కాలనీ, రన్నరప్‌గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో.. ► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్‌గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్‌గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్‌గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్‌గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్‌గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్‌గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. సాగర తీరంలో డ్రోన్ షో సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. -
నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫైనల్ దశకు చేరుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఇకపై ఏటా ఆడుదాం.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను ప్రభుత్వం అందించింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవిష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడాకారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారీగా నగదు బహుమతులు విశాఖ వేదికగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు సోమవారం ముగిశాయి. మెన్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. ముగింపు వేడుకలకు హాజరవుతున్న సీఎం జగన్ చివరి ఐదు ఓవర్లను వీక్షించనున్నారు. అనంతరం క్రీడల వారీగా విజేతలకు సీఎం జగన్ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్ రూ.లక్ష, సెకండ్ రన్నరప్ రూ.50 వేలు అందుకోనున్నారు. ప్రతిభకు ప్రోత్సాహం.. ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్ సింగ్స్(సీఎస్కే)తో పాటు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా క్రికెట్లో టాలెంట్ హంట్ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది. -
ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు సిద్ధమైన విశాఖ
-
విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు
-
Adudam Andhra: విశాఖలో ముగింపు వేడుకలు.. పాల్గొననున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహా క్రీడా సంబరం ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు రానున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేయనున్నారు. కాగా సీఎం జగన్.. రేపు(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ పీఎం పాలెం వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వీక్షిస్తారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమం అనంతరం బయలుదేరి రాత్రికి తాడేపల్లి చేరుకుంటారు. చివరి రోజు తలపడనున్న జట్లు ఇవే.. మహిళా క్రికెట్: తొలి సెమీస్‌లో పల్నాడు జట్టుపై ఎన్టీఆర్ జిల్లా జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది. మూడో స్థానం కోసం సోమవారం జరిగే పోటీలో పల్నాడు జట్టు ఆడనుంది. టోర్నీ 19వ మ్యాచ్‌గా రెండో సెమీస్ తూర్పుగోదావరి, తిరుపతి జట్ల మధ్య సోమవారం జరగనుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌లో ఎన్టీఆర్ జిల్లా జట్టుతో ఆడనుంది. ఓడిన జట్టు మూడోస్థానం కోసం పల్నాడు జిల్లా జట్టుతో తలపడుతుంది. పురుష క్రికెట్: ఏలూరు, తూర్పుగోదావరి జట్లు ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. క్వార్టర్ ఫైనల్స్‌లో గుంటూరుతో వైఎస్సార్ కడప, అనంతపురంతో ఎన్టీఆర్ జట్టు తలపడనున్నాయి. ఇందులో విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. మహిళా బ్యాడ్మింటన్: సెమీస్‌లో కర్నూలుతో బాపట్ల జట్టు తలపడనుండగా.. ఇప్పటికే పశ్చిమగోదావరి జట్టు సెమీస్‌కు చేరుకుంది. పురుష బ్యాడ్మింటన్: సెమీస్‌లో తిరుపతితో వైఎస్సార్ కడప జట్టు, ఏలూరుతో పల్నాడు జట్టు తలపడనున్నాయి. గెలిచిన జట్లు ఫైనల్స్ ఆడనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీపడనున్నాయి. మహిళా వాలీబాల్: సెమీస్‌కు అన్నమయ్య జట్టుతోపాటు విశాఖ జట్టు చేరుకున్నాయి. క్వార్టర్‌ఫైనల్స్ చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష వాలీబాల్: క్వార్టర్ ఫైనల్స్‌లో విజయంతో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా వీటితో తలపడేందుకు క్వార్టర్ ఫైనల్స్‌లో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్లు సిద్ధపడనున్నాయి. మహిళా కబడ్డీ: సెమీస్‌లో అనకాపల్లి జట్టుతో ప్రకాశం జట్టు, అనంతపురం జట్టుతో విశాఖ జట్టు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధించనుండగా ఓడిన జట్లు మూడోస్థానానికి పోటీ పడనున్నాయి. పురుష కబడ్డీ: క్వార్టర్ఫైనల్లో విశాఖ జట్టుతో కర్నూలు జట్టు తలపడనుంది. మహిళా ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో అనకాపల్లితో కృష్ణా, ప్రకాశంతో ఏలూరు, కాకినాడతో నెల్లూరు, విజయనగరంతో అనంతపురం జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి. పురుష ఖోఖో: క్వార్టర్‌ఫైనల్స్‌లో కాకినాడతో ప్రకాశం, కర్నూలుతో కృష్ణా, అనంతపురంతో బాపట్ల. శ్రీకాకుళంతో అనకాపల్లి జట్లు తలపడనున్నాయి. విజయం సాధించిన జట్లు సెమీస్‌కు చేరుకోనున్నాయి. -
ఆనంద ‘ఖేలి’
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్రప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్లు టైటిల్ పోరుకు చేరువయ్యాయి. గ్రామ/వార్డు స్థాయి జట్లు ఐదు దశల్లో కొనసాగుతూ చివరిదైన రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. విశాఖ వేదికగా ఈ పోటీలు జరుగుతుండగా 26 జిల్లాల జట్లు తలపడుతున్నాయి. ఒక్క మెన్ క్రికెట్ టైటిల్ పోరు మినహా మిగిలిన వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారం జరగనున్నాయి. మహిళల కేటగిరీలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో ఫైనల్స్ సోమవారమే నిర్వహించనున్నారు. విశాఖలోని ఆరు వేదికల్లో పోటీలు జరుగుతున్నాయి. వైఎస్సార్ బీ గ్రౌండ్‌తో పాటు ఏఎంసీ, స్టీల్ ప్లాంట్ గ్రౌండ్, కేవీకే గ్రౌండ్లలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ఏయూ, బ్యాడ్మింటన్ పోటీలకు జీవీఎంసీ ఇండోర్ ఎన్క్లేవ్లు వేదికలుగా నిలిచాయి. ఖోఖో పురుష, మహిళా విభాగాల్లో ఆదివారం ప్రీక్వార్టర్ ఫైనల్స్ ముగియగా విజయం సాధించిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధించాయి. మిగిలిన అన్ని పోటీలూ సోమవారం పూర్తికానున్నాయి. మహిళా క్రికెట్లో తొలి సెమీస్ ముగియగా రెండో సెమీస్ జరగనుంది. విజయం సాధించిన జట్లు ఫైనల్స్ సోమవారం ఆడనున్నాయి. పురుషుల క్రికెట్ విభాగంలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకోగా మరో రెండు క్వార్టర్‌ఫైనల్స్ జరగాల్సి ఉంది. గెలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధించిన జట్లతో తలపడనున్నాయి. అనంతరం ఫైనల్స్ ఈనెల 13న రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్ స్టేడియంలో జరగనుంది. బ్యాడ్మింటన్ పురుష, మహిళా విభాగాల్లో సెమీస్‌లో విజయం సాధించిన జట్లు సోమవారం ఫైనల్స్ ఆడనున్నాయి. వాలీబాల్ మహిళా, పురుష విభాగాల్లోనూ రెండేసి జట్లు ఇప్పటికే సెమీస్‌కు చేరుకోగా విజయం సాధించినవి ఫైనల్స్‌లో తలపడనున్నాయి. మొత్తమ్మీద పురుష క్రికెట్ మినహా.. మిగతా అన్ని క్రీడాంశాలను సోమవారంతో ముగించాలని నిర్వాహకులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఐదు క్రీడాంశాల్లో విజేతలతోపాటు రన్నరప్, సెకండ్ రన్నరప్ జట్లు ట్రోఫీలతోపాటు భారీ నగదు ప్రోత్సాహకాలను అందుకోనున్నాయి. -
చరిత్రలో తొలిసారిగా క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞం
-
‘ఆడుదాం ఆంధ్ర’ ఆరంభం అదిరింది : సాకేత్ మైనేని
సాక్షి ప్రతినిధి–అమరావతి): పదకొండేళ్ల వయసులో తండ్రిని చూసి రాకెట్ పట్టిన బాలుడు.. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో జత కట్టే స్థాయికి ఎదిగాడు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడల్లో రాణిస్తూ ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు.. అతనే అర్జున అవార్డు గ్రహీత, మన ఆంధ్రప్రదేశ్ క్రీడా యువ కెరటం సాకేత్ మైనేని. ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలపై ముచ్చటించారు. రాష్ట్ర క్రీడా రంగ అభివృద్ధికి ఇది ఆరంభమని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించడానికి ప్రభుత్వం వేసిన ఈ తొలి అడుగు అభినందనీయమని ప్రశంసించారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. కృష్ణమ్మ ఒడి నుంచి క్రీడా రంగంలోకి.. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జన్మించినప్పటికీ పెరిగిందంతా విశాఖపట్నంలోనే. చిన్నప్పటి నుంచీ క్రీడలపై ఆసక్తి ఉండేది. ఖోఖో, కర్రా–బిళ్లా్ల, గోలీలు అంటూ ప్రతి ఆటా ఆడేసేవాడిని. మా నాన్న టెన్నిస్ ఆడుతుంటే చూసి నాకూ ఆడాలనిపించింది. అలా 11 ఏళ్లకే ఆ గేమ్‌ను సీరియస్‌గా తీసుకున్నా. 12 ఏళ్లకు విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచా. 13 ఏళ్ల వయసులో నాకు టెన్నిస్ శిక్షణ ఇప్పించడం కోసం అమ్మానాన్నలు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. 17 ఏళ్ల వయసులో టెన్నిస్ స్కాలర్‌షిప్‌పై అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్లాను. అక్కడ కోచింగ్ సర్టిఫికేషన్ పొందాను. ఖర్చుల కోసం అక్కడి స్థానిక క్లబ్లో శిక్షణ ఇచ్చాను. అకడమిక్స్‌లో కూడా అగ్రస్థానంలో నిలిచాను. అత్యుత్తమ డబుల్స్ ర్యాంకింగ్ 74వ స్థానంలో ఉన్నాను. 2014లో చైనాలో జరిగిన 17వ ఏషియన్ గేమ్స్‌లో సానియాతో జత కట్టి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం, సనమ్ సింగ్‌తో జోడికట్టి డబుల్స్‌లో రజత పతకం గెలవడం నిజంగా అద్భుతమైన అనుభూతి. దక్షిణాసియా క్రీడల్లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 2016, 2019లో రజత పతకాలు సాధించా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో నేను, సానియా మీర్జా మాత్రమే పతకాలు సాధించాం. సరదాగా ప్రారంభించిన ఈ క్రీడ చివరికి నా కెరీర్‌గా మారింది. ప్రస్తుతం డేవిస్ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం 2017లో అర్జున అవార్డుతో గౌరవిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, స్థలం మంజూరు చేయాలని నిర్ణయించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాలి.. ఇండియాకే ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తెచ్చివ్వాలనేది నా లక్ష్యం. ఈ అద్భుత ప్రయత్నం కొనసాగాలి ఏదైనా క్రీడలో తమ పిల్లవాడు రాణించేలా చేయాలంటే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరి్థకంగానూ సమస్యలు వస్తాయి. అలాగే పిల్లవాడి చదువుపైనా ఆ క్రీడ ప్రభావం చూపుతుంది. సౌకర్యాలు లేకపోవడం ఆటంకంగా మారుతుంది. పాఠశాలకు వెళ్లి వచ్చేసరికే పిల్లాడు అలసిపోతుంటాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను టోర్నమెంట్లకు తీసుకెళ్లడానికి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయినా అన్నిటిలో గెలుస్తాడని గ్యారెంటీ ఉండదు. ఇలాంటి అనేక ప్రతికూలతలను అధిగమించి నేను ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి నా తల్లిదండ్రులు ప్రసాద్, సరోజ, భార్య శ్రీలక్ష్మి, స్నేహితులతో పాటు ఎంతో మంది అందించిన ప్రోత్సాహం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా క్రీడల్లో అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. వీటితో పాటు క్రీడలు చాలా చిన్న వయస్సు నుంచే సంస్కృతిలో భాగం కావాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా గుర్తించింది. ప్రతి గ్రామంలో యువత పోటీపడి క్రీడలను ఆస్వాదించడానికి ప్రోత్సహించేలా ‘ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించింది. ఇందుకు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఇది ఓ ప్రారంభం.. దీనికి కొనసాగింపుగా శిక్షణా సౌకర్యాలను మెరుగు పరచడం ద్వారా భవిష్యత్తులో మన రాష్ట్రం నుంచి అనేక మంది ఛాంపియన్లను తయారు చేయగలుగుతాం. ఖరీదైన క్రీడ.. అయినా నేను సిద్ధం టెన్నిస్.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడే కాదు ఖరీదైన క్రీడల్లో ఒకటి. అలాగే ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ తన శిక్షణకు, ప్రపంచ వ్యాప్తంగా టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఖర్చులకు నిధులు తానే సమకూర్చుకోవాలి. అందుకే పాఠశాల దశ నుంచే ఆటగాళ్లకు నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలు మాత్రమే మనదేశంలో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడంలో విజయం సాధించాయి. ఆంధ్రాలో ఆటగాళ్లను తయారు చేయడానికి మనకు మంచి టెన్నిస్ కోర్టులు, కోచ్‌లు లేరు. మాకు ప్రతిభగల ఆటగాళ్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. కానీ ఆటగాళ్లు చాలా చిన్న వయస్సులో శిక్షణ కోసం హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు, ఆ తర్వాత విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆంధ్రాలో ఎక్కువ మంది యువత టెన్నిస్‌లో పాల్గొనేలా చేయడానికి, మనకు రాష్ట్రంలోనే మంచి టెన్నిస్ అకాడమీ, కోచ్ ఉండాలి. దీనిపై ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా ఉన్నారు. కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో టెన్నిస్ అకాడమికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నా వయసు ఇప్పుడు 36 ఏళ్లు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో టోర్నమెంట్లలో పాల్గొన్న అనుభవంతో పాటు, అంతర్జాతీయ కోచ్‌గా కూడా నాకు గుర్తింపు ఉంది. మన రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు నా నైపుణ్యాన్ని సంతోషంగా అందించడం కోసం నేను సిద్ధంగా ఉన్నా. -
మట్టిలో మాణిక్యాలకు మెరుగు
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్ : రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను గుర్తించి, ప్రోత్సహించడానికి ఇదివరకెన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నూతన ఒరవడికి నాంది పలికింది. ‘ఆడుదాం ఆంధ్రా’తో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, మెరుగు పెడుతోంది. చరిత్రలో తొలిసారిగా అట్టడుగు స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీసే మహాయజ్ఞానికి నాంది పలికింది. యువత ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకునేందుకు, క్రీడల ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచే పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ పిలుపునిచ్చింది. దానికి తగ్గట్టు పకడ్బందీగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికా బద్ధంగా పోటీల నిర్వహణకు దాదాపు 14 శాఖల సిబ్బంది సహకారంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గత డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమైన ఈ పోటీలు ఈనెల 13వ తేదీతో ముగియనున్నాయి. క్రీడా మాణిక్యాలను ఒడిసిపట్టి, ప్రపంచ వేదికలపై నిలబెట్టేలా తలపెట్టిన ఈ క్రీడా సంబరంలో యావత్తు యువత ఉత్సాహంతో ఉరకలేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడాకారులతో పాటు ప్రేక్షకులుగా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు 1.23 కోట్ల రిజిస్ట్రేషన్లతో అతిపెద్ద క్రీడా మహోత్సవంలో భాగస్వాములవ్వడం ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగం సామర్థ్యానికి అద్దం పడుతోంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో మెన్, వుమెన్ విభాగాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా దాటి.. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో నాలుగో దశ పోటీలు విశాఖ వేదికగా ఆనందోత్సాహాల మధ్య సాగుతున్నాయి. ముగింపు రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విజేతగా నిలిచిన జట్లు ట్రోఫీతో పాటు భారీ నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోనున్నాయి. ఇదో భారీ టాలెంట్ హంట్.. 15004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో గతేడాది డిసెంబర్ 26న అట్టహాసంగా ప్రారంభంమైన ‘ఆడుదాం ఆంధ్ర’ సువిశాల విశాఖ సాగర తీరంలో తుది పోరుకు (ఫైనల్స్‌కు) ఎగిసిపడుతోంది. దాదాపు నెలన్నర కాలంలో 4.60 లక్షల జట్లను పోటీలకు ఎంపిక చేయగా.. 2.93 లక్షల మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఫైనల్స్ పోటీలు.. 13వ తేదీతో ముగియనున్నాయి. 26 జిల్లాలకు చెందిన పల్లెల్లో నుంచి వచ్చిన యువ క్రీడా కెరటాలు అంతర్జాతీయ మైదానాల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. 12వ తేదీ నాటికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్) ఫైనల్స్ పూర్తి చేసి, 13వ తేదీన క్రికెట్ ఫైనల్స్ నిర్వహించి క్రీడా పోటీలను ఘనంగా ముగించేందుకు శాప్ కసరత్తు చేస్తోంది. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అతిపెద్ద భారీ టాలెంట్ హంట్ చేపట్టడం ఇదే ప్రథమం. దీనికి తోడు గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి సమర్థవంతంగా పోటీలను ముందుకు తీసుకెళ్లడంపై క్రీడావర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో పేరుకు మాత్రమే క్రీడాపోటీలు ఉండేవని.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించే లక్ష్యం కనుమరుగవుతున్న తరుణంలో ‘ఆడుదాం ఆంధ్రా’ తిరిగి క్రీడా రంగానికి జవసత్వాలు తీసుకొచ్చిందని సీనియర్ క్రీడాకారులు ప్రశంసిస్తున్నారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ప్రతిభగల క్రీడాకారులను గుర్తిస్తున్నాయి. పోటీలు ముగిసిన అనంతరం వారికి వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో అవకాశం కల్పించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 37.35 లక్షల మంది క్రీడాకారుల సత్తా ‘ఆడుదాం ఆంధ్ర’ తొలి ఏడాది ఐదు దశల్లో ప్రతిభగల క్రీడాకారులకు అవకాశం కల్పించింది. 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను భాగస్వాములను చేసి క్రీడల్లో వయసు అంతరాలను తొలగించింది. దాదాపు 37.35 లక్షల మంది వివిధ క్రీడాంశాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 23.58 లక్షల మంది పురుషులు కాగా, 13.77 లక్షల మంది మహిళలున్నారు. వీరు సంప్రదాయ క్రీడా పోటీల్లో (నాన్ కాంపిటీటివ్ విభాగంలో యోగ, మారథాన్, టెన్నికాయిట్)తో పాటు కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్‌లో సత్తాచాటారు. 1.49 లక్షల మంది గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాల పోటీలను తొలి నాలుగు దశల్లో సమర్థవంతంగా నిర్వహించారు. పోటీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు సమాచారం ఇస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో విజేతలకు అత్యంత పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బహుమతులను జమ చేసింది. ఇప్పటికే 95 శాతం పంపిణీ పూర్తి చేసింది. రూ.119.19 కోట్ల బడ్జెట్లో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తోంది. సుమారు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. క్రీడాకారులకు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేసింది. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీషర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇచ్చింది. క్రీడాకారులకు భోజన, రవాణ, వసతి సౌకర్యాల కోసం ఏకంగా రూ.21 కోట్లకుపైగా ఖర్చు చేసింది. -
ఆడుదాం ఆంధ్రాలో చెన్నై సూపర్ కింగ్స్..!
-
అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖ వేదికగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక, యువజన స ర్విసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున ఇతర అధికార, రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, శాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాప్ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవటం ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారుల కేరింతలు మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. యువతలో క్రీడానైపుణ్యాలను పెంపొందించడానికే ఆడుదాం ఆంధ్రా పోటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనేది అందరి ఆట.. యువతకు భవిష్యత్తుకు బంగారు బాట అని కొనియాడారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసే వేట అన్నారు. 15,400 సచివాలయాల పరిధిలోని ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈనెల 13న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజేతలకు వైఎస్సార్ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్ అందిస్తారన్నారు. విజేతలకు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్ ఈ క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ, ప్రొ కబడ్డీ, బ్లాక్ హాక్స్, శ్రీకాంత్, సింధు బ్యాడ్మింటన్, ఖోఖో అసోసియేషన్ల తరఫున ప్రత్యేక శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డీసీసీబీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేసీ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, జాతీయ క్రికెటర్ శ్రీకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: బైరెడ్డి ‘ఆడుదాం–ఆంధ్ర’ వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని.. కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాటంతట అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల కోసం రూ.130 కోట్లు ఖర్చుపెట్టి గ్రామస్థాయి నుంచే పత్రిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం.. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ‘ఆడుదాం ఆంధ్రా’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర చెప్పారు. ఇక ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో విజేతలకు రూ.12 కోట్లతో బహుమతులు అందజేశామని, రాష్ట్రస్థాయి విజేతలకు రూ.87 లక్షలతో బహుమతులు అందజేయనున్నామన్నారు. ఆ బకాయిలు, ఆస్తులను రాబట్టండి.. షర్మిలకు మంత్రి రోజా సూచన అనంతరం.. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావల్సిన రూ.ఆరువేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏపీకి రావల్సిన రూ.లక్షా 80వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల రాబట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి అక్కడ నేతలను ఆమె నిండా ముంచారని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో ఎందుకు పోరాటం చేస్తున్నారో షర్మిల చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు అమిత్ షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకి దిగజారిపోతున్నాడని రోజా ధ్వజమెత్తారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ కిట్లపై స్పందిస్తూ.. వాటిపై సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటో వేస్తే తప్పేంటని.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో వేయాలా అంటూ ప్రశ్నించారు. -
అదుడం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విజువల్స్
-
నేటి నుంచి విశాఖలో ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీలు
-
Adudam Andhra: ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్
విశాఖ స్పోర్ట్స్: మహా క్రీడా సంబరానికి విశాఖ సర్వం సిద్ధమైంది. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. నాలుగు దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా.. జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. విశాఖ వేదికగా ఫైనల్ మ్యాచ్‌లను మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. ఇక 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. 40 బస్సులు సిద్ధం జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి. ప్రతీ జిల్లా నుంచి 134 మంది చొప్పున మెన్, వుమెన్ పోటీలకు హాజరవుతున్నారు. రైళ్లలో కొందరు, బస్సుల్లో మరికొందరు విశాఖలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకున్నారు. రైళ్లలో వచ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బస వద్దకు చేర్చారు. ఐదు రోజుల పాటు క్రీడాకారులను బస ప్రాంతం నుంచి మైదానాల వద్దకు తరలించేందుకు 40 బస్సులను సిద్ధం చేశారు. జేసీపీ పర్యవేక్షణలో భద్రత మెన్ జట్లకు దబ్బంద, వుమెన్ జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లో వసతి సౌకర్యం కల్పించారు. మహిళలకు ఏర్పాటు చేసిన బస వద్ద జాయింట్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో భద్రత ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం ప్రారంభ వేడుక జరగనుండగా.. మధ్యాహ్నం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం వసతి కల్పించిన చోటే అందిస్తారు. మధ్యాహ్న భోజనం క్రీడా ప్రాంగణాల వద్ద అందజేయనున్నారు. పోటీలు జరిగే సమయంలో క్రీడాకారులకు స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. వసతి ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు ఇవే.. జిల్లా స్థాయిలో మెన్ విభాగం క్రికెట్ పోటీల్లో నక్కవానిపాలెం, బ్యాడ్మింటన్‌లో సుసర్ల కాలనీ–1 జట్టు, వాలీబాల్‌లో ప్రశాంతినగర్, కబడ్డీలో ఓల్డ్ అయ్యన్నపాలెం, ఖోఖోలో సాకేత్‌పురం–1 జట్లు విజేతలుగా నిలిచాయి. మహిళా విభాగం క్రికెట్లో వాంబే కాలనీ–6, బ్యాట్మింటన్‌లో పెదవాల్తేర్–2, వాలీబాల్‌లో రజకవీధి–1, కబడ్డీలో లాసన్స్‌బే కాలనీ, ఖోఖోలో లంకెలపాలెం జట్లు విజేతలుగా నిలిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాయి. మైదానాలు ఇవే.. రాష్ట్ర స్థాయిలో పోటీ పడేందుకు 1,482 మందిపురుషులు,1,482 మంది మహిళలు విశాఖ తరలివచ్చారు. పోటీలకు నగరంలోని మైదానాలను సిద్ధం చేశారు. ►వుమెన్ క్రికెట్ వైఎస్సార్ బీ గ్రౌండ్ ►మెన్ క్రికెట్ రైల్వే స్టేడియం, ఏఎంసీ మైదానం ►కొమ్మాది కె.వి.కె స్టేడియం ►కబడ్డీ, ఖోఖో ఏయూ గోల్డెన్ జూబ్లీ మైదానం ►వాలీబాల్ ఏయూ సిల్వర్ జూబ్లీ మైదానం ►బ్యాడ్మింటన్ జీవీఎంసీ ఇండోర్ స్టేడియం రాష్ట స్థాయి విజేతలకు బహుమతులు ఇలా.. క్రీడ- ప్రథమ - ద్వితీయ -తృతీయ ►క్రికెట్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►వాలీబాల్- రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►కబడ్డీ - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2లక్షలు ►ఖోఖో - రూ.5లక్షలు -రూ.3లక్షలు -రూ.2 లక్షలు ►బ్యాడ్మింటన్- రూ.2లక్షలు -రూ.లక్ష -రూ.50వేలు -
కట్టుకథ అడ్డంగా దొరికిన డ్రామోజీ
-
నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ అమీతుమీ!
విశాఖ స్పోర్ట్స్: యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ తుది పోటీలకు విశాఖ సిద్ధమైంది. 14,997 గ్రామాల నుంచి మెన్, వుమెన్ జట్లు ఐదు క్రీడల్లో నిర్వహిస్తున్న పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. 50 రోజుల పాటు సాగనున్న ఈ పోటీల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. 37.5 లక్షల మంది మెన్, వుమెన్ క్రీడాకారులు గ్రామ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. శుక్రవారం నుంచి చివరిదైన ఐదో దశ రాష్ట్ర స్థాయి పోటీల్లో 26 జిల్లాల్లో విజేతలుగా నిలిచిన జట్లు విశాఖలో అమీతుమీ తేల్చుకుంటాయి. 12.21 లక్షల నగదు ప్రోత్సాహాకాల్ని సత్తా చాటిన జట్లు సొంతం చేసుకుంటాయి. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో విజేతలు నగదు ప్రోత్సాహాకాల్ని అందుకోగా, తుది పోరులో రాష్ట్ర టైటిల్‌తో పాటు ప్రోత్సాహాకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అందుకోనున్నారు. వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మెన్ క్రికెట్ టైటిల్ పోరును ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ వేడుక రైల్వే స్టేడియంలో జరగనుంది. రాష్ట్ర క్రీడా పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పోటీలను ప్రారంభించనుండగా, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ప్రారంభ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ధ్యాన్‌చంద్ గురువారం స్టేడియంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించి పలు సూచనలు చేశారు. విజేతలకు రూ.5 లక్షల నగదు ప్రోత్సాహకాలు వైఎస్సార్ స్టేడియంలో 50 రోజుల క్రీడా పండగ ముగింపు కార్యక్రమాన్ని 13న భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ టోర్నీ ద్వారా సత్తాచాటిన ఆటగాళ్లకు మరిన్ని మెలకువలు నేర్పేందుకు చెన్నయ్ సూపర్ కింగ్స్ పరిశీలకులతో పాటు ఆయా క్రీడల్లో నిష్ణాతుల్ని ఈ మ్యాచ్‌లు చూసేందుకు ఆహ్వానించామన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీలో విజేతగా నిలిచిన జట్లు ఐదు లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందుకోనున్నాయి. రన్నరప్ జట్లు మూడు లక్షలు, సెకండ్ రన్నరప్ జట్లు రెండు లక్షలు అందుకోనున్నారు. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన జట్లు రెండు లక్షలు అందుకోనుండగా.. రన్నరప్ లక్ష, సెకండ్ రన్నరప్ జోడి యాభై వేలు అందుకోనుంది. ఏయే ఆటలు ఎక్కడంటే.. రాష్ట్ర స్థాయిలో పోటీపడేందుకు అన్ని జిల్లాల నుంచి 1,482 మంది పురుషులు, 1,482 మంది స్త్రీలు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో జట్లుగా ఆడేందుకు అర్హత సాధించాయి. వారికి స్థానికంగా ఉన్న టిడ్కో గృహాల్లో ఏర్పాట్లు పూర్తయాయి. భద్రతను దృష్టిలో పెట్టుకుని వుమెన్ క్రికెట్ పోటీలను వైఎస్సార్ బి గ్రౌండ్‌లోనే నిర్వహించనుండగా, మెన్ క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం గ్రౌండ్, ఏఎంసీ గ్రౌండ్, కొమ్మాది కేవీకే స్టేడియం గ్రౌండ్లలో నిర్వహించనున్నారు. కబడ్డీ, ఖోఖో కోసం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్, వాలీబాల్ కోసం ఏయూ సిల్వర్ జూబ్లీ గ్రౌండ్లను సిద్ధం చేశారు. బ్యాడ్మింటన్ కోసం జీవీఎంసీ ఇండోర్ స్టేడియంలో ఐదు కోర్టులను వినియోగించనున్నారు. -
విశాఖలో ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు పోటీలు
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్‌లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు. ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
రేపటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి పోటీలు
విశాఖ స్పోర్ట్స్: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ టోర్నమెంట్ తుదిదశ పోటీలకు విశాఖ సిద్ధమైంది. వార్డు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశల్లో, ఐదు క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తుండగా జిల్లా స్థాయి విజేత జట్లు తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా విశాఖలోని ప్రధాన కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో పాల్గొనే మహిళా, పురుష ఆటగాళ్ల 26 జిల్లాల జట్లు విశాఖకు చేరుకుంటున్నారు. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడే వారికి కేటాయించిన వసతి తదితర వివరాలను చెబుతున్నారు. ప్రతి జిల్లా నుంచి 134 మంది ఆటగాళ్లు పోటీలకు హాజరవుతుండగా, పురుష జట్లకు దబంగలోని టిడ్కో గృహాల్లో, మహిళల జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లోనూ వసతి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటగాళ్లు పోటీల వేదికకు చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనాల్ని వసతి వద్దే సమకూర్చనుండగా మధ్యాహ్నం భోజనం, మధ్యలో స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను పోటీల వేదిక వద్దే అందజేయనున్నారు. 9న రైల్వే స్టేడియంలో ప్రారంభ వేడుకకు రాష్ట్ర మంత్రులు, క్రీడాప్రాధికార సంస్థ ప్రతినిధులు, ఉన్నతాధికారుల రాకతో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక్కడే అతిథులు చేతుల మీదుగా క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. బ్రాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో హోర్డింగులు, జెండాలు, బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళల క్రికెట్ పోటీలు కొమ్మాది గ్రౌండ్స్‌లో జరగనుండగా, పురుషుల క్రికెట్ పోటీలకు వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల తదితర గ్రౌండ్లను సిద్ధం చేశారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. బ్యాడ్మింటన్ పోటీలను రైల్వేస్టేడియంలోని ఎన్‌క్లేవ్‌లో నిర్వహిస్తారు. ఈనెల 13న విజేతలుగా నిలిచిన జట్లు ట్రోఫీ, సరి్టఫికెట్లతో పాటు భారీగా నగదు ప్రోత్సాహకాల్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వైఎస్ఆర్ స్టేడియంలో అందుకోనున్నారు. -
కాలు బెణికింది అంతే
చిత్తూరు కలెక్టరేట్: గత టీడీపీ ప్రభుత్వం క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. క్రీడాకారులు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో నిస్తేజంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడలకు పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీ ఎత్తున క్రీడలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఆయా క్రీడల్లో గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తోంది. అయితే వీటిపైనా రామోజీరావు తన వక్రబుద్ధిని చాటుకున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో ఒక కబడ్డీ క్రీడాకారిణి గాయపడితే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ‘ఈనాడు’లో అసత్య కథనాన్ని అచ్చేశారు. ‘సాయం కావాలా.. వెళ్లి సీఎంను అడగండి’ అనే శీర్షికతో విషం జిమ్మారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలు ఇవి.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఆర్పురం గ్రామానికి చెందిన మునెమ్మకు కబడ్డీ అంటే ఎంతో ఇష్టం. టీడీపీ పాలనలో క్రీడలకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆమె కబడ్డీ పట్ల ఉన్న ఆసక్తిని చంపేసుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా పోటీలు నిర్వహించడంతో ఎంతో సంతోషపడింది. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. గత నెల 25న నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో ఆమె ఎడమ కాలు బెణికింది. ఆ సమయంలో అక్కడున్న వైద్యాధికారులు, అధికారులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే కాలు బెణికిందంతే అని చెప్పి తన భర్తతో కలిసి పుత్తూరుకు వెళ్లి మునెమ్మ కట్టు కట్టించుకున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎడమకాలు బెణికిన మునెమ్మ వైద్య చికిత్సల నిమిత్తం మంగళవారం అధికారులు రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్డీవో చిన్నయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ, కార్వేటినగరం తహసీల్దార్ పుష్పవతి, ఎంపీడీవో శ్రీధర్‌లు మునెమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తనకు ఎలాంటి సమస్యలేదని, ఆటల్లో గాయాలు సహజమేనని మునెమ్మఅధికారులకు తెలిపారు. ఆడే సమయంలో ఎడమ కాలు బెణికిందని చెప్పారు. ఆ సమయంలో నొప్పి ఏమీ లేకపోవడంతో తామే పుత్తూరుకు వెళ్లి కట్టు కట్టించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి సమస్య వచ్చినా జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని మునెమ్మకు అధికారులు హామీ ఇచ్చారు. -
9 నుంచి ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ తుదిఘట్టానికి చేరుకుంది. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఐదుదశల పోటీల్లో దిగ్విజయంగా నాలుగింటిన దాటుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా విజయగీతిక మోగించనుంది. దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజి్రస్టేషన్లతో ఆడుదాం ఆంధ్రా రికార్డు సృష్టించింది. గ్రామ/వార్డు సచివాలయం, మండల స్థాయిలో ప్రతిభకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. 8 క్రీడా మైదానాల ఎంపిక ఆడుదాం ఆంధ్రా మెగా టోర్నీ ఫైనల్స్ కోసం విశాఖలో ఎనిమిది క్రీడా మైదానాలను తాత్కాలికంగా గుర్తించారు. క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం, ఆంధ్ర మెడికల్ కాలేజీ, జీవీఎంసీ ఇందిరాప్రియదర్శిని, డాక్టర్ వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోని గ్రౌండ్–బి, బ్యాడ్మింటన్ పోటీలను జీవీఎంసీ ఇండోర్ స్టేడియం, వాలీబాల్ పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ అవుట్డోర్, కబడ్డీని ఏయూ జిమ్నాస్టిక్స్ ఇండోర్ హాల్స్, ఖోఖోను ఏయూ జిమ్నాజియం అవుట్‌డోర్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈవో స్థాయి అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించింది. పారదర్శకంగా నగదు బహుమతుల ప్రదానం 15 ఏళ్లకు పైబడిన పురుషులు, మహిళలను క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి కాంపిటీటివ్ క్రీడలతోపాటు నాన్–కాంపిటీటివ్‌లో సంప్రదాయ మారథాన్, టెన్నీకాయిట్, యోగాలోను పోటీలు నిర్వహించారు. ఇప్పటివరకు 38,08,741 మంది క్రీడాకారులు (23,81,621 మంది పురుషులు, 14,27,120 మంది మహిళలు) నమోదు చేసుకున్నారు. ఇందులో గ్రామ/వార్డు స్థాయిలో మొత్తం 24,46,538 మంది క్రీడాకారులు (13,92,764 మంది పురుషులు, 10,53,774 మంది మహిళలు) పాల్గొన్నారు. వారిలో మండల స్థాయికి 17,10,456 మంది క్రీడాకారులు (8,55,228 మంది పురుషులు, 8,55,228 మంది మహిళలు) పోటీపడ్డారు. వారిలో 85,842 మంది క్రీడాకారులు (42,921 మంది పురుషులు, 42,921 మంది మహిళలు) నియోజకవర్గస్థాయిలో సత్తాచాటారు. నియోజకవర్గస్థాయిలో తొలి మూడుస్థానాల్లో నిలిచిన జట్లకు (51,164 మంది క్రీడాకారులు పాల్గొంటే 28,513 మంది విజేతలు) నగదు బహుమతులు పొందారు. జిల్లాస్థాయి పోటీల అనంతరం ఫైనల్స్‌కు 1,482 మంది పురుషులు, 1,482 మంది మహిళలు.. మొత్తం 2,964 మంది అర్హత సాధించారు. ఆయా క్రీడల్లో తొలి మూడుస్థానాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పారదర్శకంగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బహుమతులను జమచేసేందుకు శాప్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
10న విశాఖకు ముఖ్యమంత్రి జగన్
మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఆడుదాం–ఆంధ్రా రాష్ట్ర స్థాయి క్రీడలు ఫిబ్రవరి ఆరు నుంచి పదో తేదీ వరకు విశాఖ వేదికగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 6న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం–ఆంధ్రా పోటీలు ప్రారంభమవుతాయని, పదో తేదీన వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాల నుంచి క్రీడాకారులు విశాఖ వస్తారని, ఒక్కో జిల్లా నుంచి 130 నుంచి 150 మంది వరకు క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. త్వరలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జీవీఎంసీ, వీఎంఆర్డీఏ సంయుక్త నిర్వహణలో త్వరలో రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతాయని కలెక్టర్ వివరించారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యా యని చెప్పారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో వైజాగ్ స్కై గ్లాస్ బ్రిడ్జి, సైక్లింగ్ వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, వీటికి టెండర్లు కూడా పిలిచా మన్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా వీటికి శంకుస్ధాపనలు జరుగుతాయన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 14 వేల మంది సిబ్బంది హాజరవుతారని కలెక్టర్ వివరించారు. -
‘టాలెంట్ హంట్’కు సిద్ధం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడాపోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయి. గ్రామ/వార్డు సచివాలయం, మండలస్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు జట్లు ఉరకలేస్తున్నాయి. బుధవారం నుంచి 175 నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తిస్థాయి ప్రొఫెషనల్ రీతిలో పోటీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లు చేసింది. క్రిక్క్లబ్ యాప్, ‘ఆడుదాం ఆంధ్రా’ వెబ్సైట్ ద్వారా యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష వీక్షణం, ప్రత్యక్ష స్కోరును తిలకించేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు కామెంట్రీలను నిర్వహించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలిసితీసే ఉద్దేశంతో ప్రభుత్వం 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులకు 5 క్రీడాంశాల్లో మెగా టోరీ్నకి శ్రీకారం చుట్టింది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ (డబుల్స్)లో నియోజకవర్గ స్థాయి నుంచి నగదు బహుమతులను ప్రకటించింది. పోటీలను పక్కా ప్రొఫెషనల్ విధానంలో ఆయా క్రీడా ఫెడరేషన్ల నిబంధనల ప్రకారం నిర్వహించనుంది. టీ10 విధానంలో పూర్తిస్థాయి మ్యాచ్ బాల్‌తో క్రికెట్ పోటీలు, వాలీబాల్‌లో (25–25–15), బ్యాడ్మింటన్‌లో (21–21–21) బెస్ట్ ఆఫ్ త్రీ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఖోఖోలో 2 ఇన్నింగ్స్‌కు 9 నిమిషాలు, కబడ్డీ పురుషుల సెషన్‌కు 20 నిమిషాలు, మహిళలకు 15 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించింది. భోజన, వసతి సౌకర్యాలతో.. మండలస్థాయి పోటీల్లో విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసింది. వీరిని నియోజకవర్గ స్థాయి పోటీలకు పంపేందుకు అవసరమైన చోట రవాణా, భోజన, వసతులను పర్యవేక్షిస్తోంది. ఈ నెలాఖరులోగా షెడ్యూల్ ప్రకారం పోటీలను పూర్తిచేసే లక్ష్యంతో సిబ్బందిని సమాయత్తం చేస్తోంది. 27 నుంచి పూర్తిస్థాయిలో క్రికెట్ పోటీలు ఊపందుకునేలా కార్యాచరణ రూపొందించింది. మండలాలు, మునిసిపాలిటీలు కలిపి 753 యూనిట్ల నుంచి 75,000 మందికిపైగా క్రీడాకారులు నియోజకవర్గ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిభ వేట ప్రారంభం.. నియోజకవర్గ స్థాయి నుంచే ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లకు చెందిన ప్రతినిధులు నియోజకవర్గాల్లోని పోటీలను పరిశీలించి ‘టాలెంట్ హంట్’ చేపట్టనున్నారు. ప్రో కబడ్డీ సంస్థ, ప్రైమ్ వాలీబాల్, ఏపీ ఖోఖో క్రీడా సంఘం, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు, అంతర్జాతీయ క్రీడాకారుల బృందాలు యువతలోని ప్రతిభను గుర్తించి నివేదిక రూపొందించనున్నాయి. అసలు ఆట ఇప్పుడే మొదలైంది ఆంధ్రాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా ఆడుదాం ఆంధ్రా నిర్వహిస్తున్నాం. ఇది ఏటా కొనసాగిస్తాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా వెతికిపట్టుకుని ప్రపంచ వేదికలపై నిలబెట్టడమే సీఎం జగన్ లక్ష్యం. ఇకపై అన్నీ కీలక ఘట్టాలే. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. క్రీడాకారులు ప్రతి దశలోనూ అద్భుత ప్రతిభ కనబర్చాలి. – ఆర్కే రోజా, క్రీడా శాఖ మంత్రి ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందజేశాం నియోజకవర్గ స్థాయి పోటీలకు సర్వం సిద్ధమైంది. ఎప్పటికప్పుడు జేసీలు, శాప్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది తగిన ఆదేశాలిచ్చాం. మండలస్థాయి విజేతలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లు అందించాం. పూర్తిగా ప్రొఫెషనల్స్ తరహాలో టోర్నీ జరగనుంది. – ధ్యాన్‌చంద్ర, శాప్ ఎండీ -
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
దేశానికే ఆదర్శంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్ర’ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆధునిక సమాజంలో సెల్ ఫోన్... అరచేతుల్లో ప్రపంచాన్ని చూపిస్తూ మనిషిని కట్టిపడేస్తోంది. దీంతో ఏ కొద్ది తీరిక ఉన్నా జనం మొబైళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. కనీసమైన వ్యాయామాన్ని చేయడంలేదు. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. తద్వారా గ్రామీణ స్థాయిలోనే అనేకమందిలో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను బయట పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 15 సంవత్సరాల పిల్లల నుంచి ఆ పైన ఉన్న అన్ని వయసుల వారికీ క్రీడాపోటీలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం. అన్ని గ్రామాల్లో ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ బిజీ జీవితానికి స్వస్తి చెప్పి ప్రస్తుతం ఆటల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏ విధమైన శారీరక శ్రమ, సరైన వ్యాయామం లేకుండా బీపీ, షుగర్ లాంటి దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్న కోట్లాదిమందికి మరోసారి చిన్నప్పటి క్రీడానందాన్నీ, ఉత్సాహాన్నీ ఈ క్రీడలు కలిగిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం గ్రామీణ క్రీడల్లో ప్రజలు మునిగి తేలుతూ ఉన్నారు. మునుముందు రోజుల్లో మరింతమంది క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ నుండి మరీ ముఖ్యంగా గ్రామీణ యువతీ యువకులను ప్రోత్సహించడానికి ఈ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి. సుమారు 35 లక్షల మంది యువతీ యువ కులు ఈ క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటున్నారు. వారందరి ఆటలనూ సుమారు 90 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించి సంతో షిస్తున్నారు. ఈ విధంగా క్రీడలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఈ క్రీడా ఉత్సవాలు కొనసాగడానికి ప్రజలు తమ వంతు అండదండలు అందించడం అవసరం. – నాగెండ్ల సుమతీ రత్నం, దాచేపల్లి -
పిల్లలు ఆడుతుంటే.. రామోజీ, రాధాకృష్ణకు వచ్చిన నొప్పి ఏంటో?
ఏపీలో ఈనాడు మీడియా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై పడి తెగ ఏడుస్తోంది. అది ఎంతవరకు వెళ్లిందంటే యువత, ఇతర వర్గాలవారికి ఆటల పోటీలు పెట్టినా సహించలేనంతవరకు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో యువతకు ఆటల పోటీలు పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్ ఒక సరికొత్త ఆలోచన చేశారు. నిజానికి ఇది సరికొత్త ట్రెండ్ అని చెప్పాలి. గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి యత్నించలేదు. తప్పుడు వార్తలతో వదంతులు దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహించాలని తలపెడితే దానిని ఎలా చెడగొట్టాలా అన్న ధ్యేయంతో ఎల్లో మీడియా ప్రత్యేకించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి మరీ నీచంగా ప్రచారం చేశాయి. మొదట ఆట స్థలాలు ఏవి అని కథనాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆట స్థలాలు బురదతో నిండి ఉన్నాయని తప్పుడు ఫోటోలు వేసి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. ఆ తర్వాత ప్రజలు ఈ ఆటలలో పాల్గొనడం లేదని, వలంటీర్లు ఈ ఆటలను బహిష్కరించారని వదంతులు సృష్టించారు. ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు అసలు ఏపీలో పిల్లలు అడుకుంటే రామోజీరావుకు, రాధాకృష్ణకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? మొత్తం రాష్ట్రం అంతా ఒక్కసారే యువతలో క్రీడల పట్ల ఆసక్తి ఏర్పడుతుందని, తద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు మంచి పేరు వస్తుందన్న ఏడుపు తప్ప ఇంకో కారణం లేదు. ఆటల విషయంలో తెలుగు రాష్ట్రాలుబాగా వెనుకబడి ఉన్నాయన్నది ఒక అభిప్రాయం. దానిని దృష్టిలో ఉంచుకుని జగన్ మొత్తం అందరిని ఆటలవైపు మళ్లించడానికి ఒక యత్నం చేశారు. అంతే.. తెలుగుదేశం మీడియాకు ఏదో సందేహం వచ్చేసింది. యువత అంతా జగన్‌కు జై కొడుతుందేమో అన్న భయం పట్టుకుంది. అందుకే యవత, ప్రజలు ఎవరూ ఆటలలో పాల్గొనడం లేదని, లక్షలలో నమోదు చేసుకున్నా రావడం లేదంటూ ఈనాడు మీడియా తనదైన శైలిలో తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేసింది. గత ప్రభుత్వం హ్యాపీ సండే అంటూ ఒకటి, రెండు నగరాలలో స్టేడియం వద్దో, రోడ్లపైనో స్టేజీ కట్టి చెవులు పగిలేలా డ్రమ్స్ పెట్టి డాన్స్‌లు వేయిస్తే అదేమో గొప్ప విషయంగా ఇదే మీడియా అప్పట్లో ప్రచారం చేసింది. ఎల్లో మీడియాకే చెల్లింది ఆటలకు సంబంధించి ప్రభుత్వం ఇంకేమి చర్యలు తీసుకోవాలి! ఎలా అభివృద్ది చేయాలన్నదానిపై వార్తలు రాస్తే తప్పు లేదు. అలా కాకుండా ఇలాంటి చెత్త వార్తలను రాయడం. అది కూడా మొదటి పేజీలో అచ్చేసి తన రాక్షస మనస్తత్వం బయటపెట్టుకోవడం ఈ ఎల్లో మీడియాకే చెల్లింది. ప్రతిదానిలోను రాజకీయం చూడడం,ప్రభుత్వంపై పడి నిత్యం రోధించడం ఇదే కార్యక్రమంగా ఈనాడు పెట్టుకుంది. ఒకప్పుడు స్కూళ్ల, కాలేజీలలో క్రీడా పోటీలు జరిగేవి. జోనల్ పెద్దతిలో కూడా పోటీలు ఉండేవి. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా అవి ఉన్నా, గత ప్రభుత్వాలు అంత శ్రద్ద చూపకపోవడంతో స్థానికంగా వ్యాయామ ఉపాధ్యాయుల ఆసక్తిపైనే ఇవి నడుస్తున్నాయి. ఏడుపు మొహంతో వార్తలు రాయాలా? విద్యా సంస్థలలో కూడా ప్రైవేటు రంగం విస్తృతంగా వ్యాప్తి చెందాక, అసలు ఆట స్థలాలు లేకుండానే అవి ఏర్పాటవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఎంతసేపు తమ పిల్లలు ఎంసెట్, ఐఐటి, మెడిసిన్ వంటివాటిలో ఎలా సీటు సంపాదించాలన్నదానిపైనే దృష్టి పెట్టడం అలవాటైపోయింది. విద్యార్థులే కాకుండా, ఆయా గ్రామాలలో, పట్టణాలలో యువత, లేదా మధ్య వయసువారు ఆటలకు దూరం అవుతున్నారు. ఇప్పుడు అన్ని వర్గాలకు ఆటలలో పాల్గొనే అవకాశం కల్పిస్తే దానికి కూడా ఈనాడు ఏడుపు మొహంతో వార్తలు రాయాలా? అదేదో తప్పు పని చేస్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం తనకు ఉన్న గ్రామ,వార్డు సచివాలయాలను, వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా వాడుకోవాలని తలపెట్టింది. అయినా ఆటలు ఆగలేదు నిజానికి గతంలో ఇంత సూక్ష్మ స్థాయిలో ప్రజలను క్రీడలలలో ఇన్వాల్వ్ చేసే అవకాశం లేదు. కొత్త వ్యవస్థలతో అది సులువు అయింది. దానిని ఎలా చెడగొట్టాలా అన్న లక్ష్యంతో ఉన్న ఈనాడు, జ్యోతి వంటి మీడియా వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు, ఆడుదాం ఆంద్ర కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించింది. అయినా ఆటలు ఆగలేదు. ఆటలలో గెలిచినవారికి బహుమతులుగా ఆటలకు సంబంధించిన కిట్లను, నగదు తదితరాలు అందచస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఈ క్రీడా సంబరాన్ని ఆరంభించారు. వారిది నీచమైన ఆలోచన దీనిని బాగా వినియోగించుకుని ప్రజలు తమ మానసిక ఉల్లాసానికి అవసరమైన క్రీడలలో పాల్గొనాలి. ప్రభుత్వం ఆడిస్తోంది కాబట్టి ఎవరూ రాకూడదన్నది రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి నీచమైన ఆలోచన. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక ఇలాంటి ఆలోచన చేసి ఉంటే, అబ్బో మా బాబు ప్లాన్ అదిరింది. ప్రజలంతా అన్ని పనులు మానుకుని ఆటలలో పాల్గొంటున్నారని ప్రచారం చేసేవారు. చంద్రబాబుకు రాని ఆలోచనలు జగన్‌కు వస్తుండడం, ప్రజలకు మేలు చేసేవి, ఉపయోగపడేవాటిని జగన్ ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు సాగుతుండడంతో వారికి పాలుపోవడం లేదు. ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా? ఆయా కార్పొరేట్ స్కూళ్లు,కాలేజీలు ఎక్కడైనా ఆటలను ప్రోత్సహించడానికి వీలుగా మైదానాలను మెయిన్ టెయిన్ చేస్తున్నాయా అన్నదానిపై ఈ మీడియా ఎన్నడైనా వార్తలు ఇస్తుందా అంటే అలా చేయదు. ఎందుకంటే వారితో మాచ్ ఫిక్సింగ్ కనుక. వారితో వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి కనుక. వాటి గురించి రాయకపోతే రాయకపోయారు. ఇప్పుడు మాత్రం విషం చిమ్మతుంటారు. ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో ఆట స్థలాలను చంద్రబాబు హయాంలో ఎన్నడైనా అబివృద్ది చేశారా? నిజంగా అలా చేసి ఉంటే,ఇప్పుడు స్థలాలు లేవు అని ఎల్లో మీడియా ఎందుకు కథనాలు రాస్తోంది. ఏడవాల్సిన అవసరం ఏముంది? వాటిని ఎవరైనా ఎత్తుకుపోయారా! చంద్రబాబు అధికారంలో ఉంటే అంతా పచ్చగా ఉన్నట్లు, జగన్ ఉంటే అక్కడ ఏమీ లేనట్లు రాయడం వీరికి అలవాటుగా మారింది. ఇంత దుర్మార్గంగా మీడియా మారడం ఇప్పుడే చూస్తున్నాం. జగన్ ప్రభుత్వం ప్రజలలో క్రీడా స్పూర్తి పెంచడం కోసం ప్రయత్నిస్తుంటే రామోజీ, రాధాకృష్ణ వంటివారు ఏడవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో చోట మొదలు పెడితే కదా.. బాగా ఆడే యువతను కనిపెట్టగలిగేది. వారిని ప్రోత్సహించేది. అసలేమీ చేయకుండా ఉంటే అప్పుడు ఏమి రాస్తుంటారు. క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇంకేదేదో చెత్తంతా రాస్తారు. జగన్ ప్రభుత్వం ఆటలకు ప్రాధాన్యత ఇచ్చిందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకూడదన్న దురుద్దేశంతో విషం చిమ్ముతూ ప్రజలను తప్పుదారి పట్టించాలని ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. ఈ ఆటల పోటీల ద్వారా ఆణిముత్యాలను గుర్తించాలన్న జగన్ సంకల్పం మెచ్చుకోదగిందే. ఈ ఎల్లో మీడియా ఎంత ఏడ్చినా జగన్ పట్టించుకోకుండా తను ఎంచుకున్న దారిలో వెళ్ళి ప్రజల ఆదరణ పొందుతున్నారు. అదే ఆయన బలం. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
రసవత్తరం..రెట్టించిన ఉత్సాహం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలు రాష్ట్రవ్యాప్తంగా రసవత్తరంగా జరుగుతున్నాయి. యువకులు రెట్టించిన ఉత్సాహంలో పోటీల్లో పాల్గొంటున్నారు. దీంతో రాష్ట్రానికి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్లు ఉత్సాహంగా ఉంది. యువత బ్యాటు, బంతి పట్టుకుని మైదానాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం క్రీడల పట్ట ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో క్రీడా రంగం పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్న వారంతా మ్యాచ్‌లు తిలకించేందుకు మైదానాలకు క్యూ కడుతున్నారు. ఐదో రోజు శనివారం 6,386 గ్రామ వార్డు సచివాలయాల్లో షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహించాల్సి ఉండగా 6373 సచివాలయాల్లో పోటీలు జరిగాయి. 3,23,781 మంది ప్రేక్షకులు ఆటల పోటీలను తిలకించారు. మొత్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలకుగానూ 14,690 చోట్ల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. అనంతపురం విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం శ్రీ సత్యసాయి జిల్లాల్లో అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ’ఆడుదాం ఆంధ్ర’ కు సెలవు అయినప్పటికీ కొన్నిచోట్ల రీ షెడ్యూల్ మ్యాచ్‌లు పూర్తి చేయనున్నారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. తిరుపతి జిల్లాలో క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. కబడ్డి, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పెనుమూరు మండలాల్లో బ్యాడ్మింటన్ పోటీలు ముగిసాయి. నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో క్రీడలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ క్రీడలను మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని 283 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో క్రీడాపోటీలు జరిగాయి. జిల్లాలో 791 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 10,151 మంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనగా, 33,639 మంది ప్రేక్షకులు పోటీలను వీక్షించారు. 719 మంది ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించారు. తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో పోటీలు చురుగ్గా జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా రాజా కళాశాల మైదానంలో జరుగుతున్న క్రీడలను శాప్ ఎండి ధ్యాన్‌చంద్ పరిశీలించారు. కడపలో మైదానాల వైపు క్యూ.. మెగా క్రీడా టోర్నమెంట్లో భాగంగా కడపలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, ఖోఖో క్రీడాంశాల్లో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయ పోటీల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నిర్వహించిన పోటీలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ ఎస్.జిలానీబాషా ప్రారంభించారు. వివిధ మండలాల్లో పోటీలను ఎంపీడీఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు పర్యవేక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్సాహపూరిత వాతావరణంలో క్రీడలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని 535 సచివాలయాల పరిధిలో శనివారం 864 మ్యాచ్‌లు నిర్వహించగా 10 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలను తిలకించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు క్రీడలను తిలకించినట్టు జిల్లా చీఫ్ కోచ్ డి.దుర్గారావు చెప్పారు. -
ఆనందం.. ఆకాశాన్నంటింది
సాక్షి నెట్వర్క్/అమరావతి: గ్రామాల్లో ‘ఆడుదాంఆంధ్రా’ క్రీడా సంబరం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. క్రీడా మైదానాల్లోకి యువత భారీ సంఖ్యలో దూసుకొస్తున్నారు. నాల్గవ రోజు శుక్రవారానికి 14,396 గ్రామ/వార్డు సచివాలయాల్లో పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 96.61 శాతం సచివాలయాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతపురం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో 100 శాతం సచివాలయాల్లో పోటీలు మొదలయ్యాయి. ఒక్క రోజే 21,488 మ్యాచ్‌లకు షెడ్యూల్ చేస్తే 18,871 మ్యాచ్‌లను పూర్తి చేశారు. ఏలూరు, బాపట్ల, అనంతపురం, కృష్ణా, వైఎస్సార్, తూర్పుగోదావరి, అనకాపల్లి, చిత్తూరు, విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 92 శాతానికిపైగా మ్యాచ్ షెడ్యూల్ పూర్తయింది. మొత్తం .16లక్షల మంది వీక్షకులు హాజరవగా.. మొత్తంగా నాలుగు రోజుల్లో 28.60 లక్షల మంది ఆడుదాం ఆంధ్ర క్రీడలను వీక్షించారు. పల్నాడుకే వన్నె తెచ్చిన క్రీడలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యువత ఆటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షించారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను మంత్రి అంబటి రాంబాబు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహ పరిచారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో 257 సచివాలయాల పరిధిలో 467 మైదానాల్లో పోటీలు జరిగాయి. ఇక్కడ 666 మ్యాచ్‌లకు గాను 664 మ్యాచ్‌లు నిర్వహించారు. 8,816 మంది క్రీడాకారులు పాల్గొనగా, 32,850 మంది ప్రేక్షకులు వీక్షించారు. క్రీడల నిర్వహణ పై కలెక్టర్ షణ్మోహన్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు. తిరుపతి జిల్లాలో 392 సచివాలయాల పరిధిలోని మైదానాల్లో క్రీడలు నిర్వహించారు. 1261 మ్యాచ్‌లకు గాను 1260 మ్యాచ్‌లను నిర్వహించారు. కడపలో కదం తొక్కారు కడప జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు సంబరాన్ని తలపిస్తున్నాయి. పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కడపలో నిర్వహించిన పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎంపీడీఓలు, ఫిజికల్ డైరెక్టర్లు టోర్నమెంట్‌ను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లాలో 500 సచివాలయాల పరిధిలో 690 మ్యాచ్‌లు నిర్వహించారు. స్థానిక ఇండోర్ స్టేడియంతో పాటు పాఠశాల్లో 70 మ్యాచ్‌లు జరిగాయి. విజయవాడలోని కానూరి వీఆర్ సిద్ధార్థ కళాశాలలో జరుగుతున్న పోటీల్లో క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. విజయవంతంగా ఆడుదాం ఆంధ్రా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఆటల పోటీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావటానికి ఈ ఆటల పోటీలు దోహదపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది క్రీడాకారులు వారి పేర్లు నమోదు చేసుకొని క్రీడల్లో పాల్గొంటున్నారు. సచివాలయం స్థాయి నుంచి ఆటల పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా చక్కని అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ప్రద్యుమ్న, రాష్ట్ర క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ -
ఉరకలేస్తున్న క్రీడోత్సాహం
సాక్షి నెట్వర్క్/అమరావతి: రాష్ట్రంలో క్రీడా సంబరం ఉరకలేస్తోంది. ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ యువత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజైన గురువారం 8,319 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. 26 వేల మ్యాచ్‌లకు గాను 82 శాతం షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యధికంగా ఏలూరు (96.80 శాతం), బాపట్ల (92.13 శాతం), అనంతపురం (90 శాతం) మేర ప్రణాళిక ప్రకారం పోటీలు జరిగాయి. గుంటూరు, ఏలూరు, బాపట్లలో 99.15కుపైగా, అన్నమయ్య, తూర్పుగోదావరి, విజయనగరం, ఎన్టీఆర్, అనకాపల్లిలో 96 శాతానికిపైగా సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 8,948 క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు, వీక్షకులకు అవసరమైన వసతులను కల్పించారు. క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు ప్రత్యేకంగా కామెంట్రీ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. సుమారు 6.69 లక్షల మంది పోటీలను వీక్షించారు. విక్రమార్కులై చెలరేగారు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో క్రీడాకారులు నువ్వా–నేనా అన్నట్టుగా పోటీల్లో తలపడ్డారు. నగరిలోని బుగ్గ అగ్రహారంలో వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను తిలకించేందుకు వీక్షకులు పోటెత్తారు. పోటీల పర్యవేక్షణకు చిత్తూరు కలెక్టరేట్లోని పూలే భవనంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రారంభించారు. చిత్తూరు మైదానాల్లో నిర్వహిస్తున్న పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బాలాజీ పరిశీలించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, పుంగనూరు, జీడీ నెల్లూరు, కుప్పం నియోజకవర్గాల్లో పోటీలు ఘనంగా నిర్వహించారు. కడప నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి మూడో రోజు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా 645 సచివాలయాల పరిధిలోను, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో పోటీలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని 672 సచివాలయాల పరిధిలో ఐదు క్రీడాంశాల్లో పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు కొనసాగుతున్నాయి. సివంగులై తలపడుతున్న యువతులు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. యువతులు సివంగులను తలపిస్తూ పోటీల్లో హోరాహోరీగా తలపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 535 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో నిర్వహించిన ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో దాదాపు 13 వేల మంది క్రీడాకారులు పాల్గొనగా, 3 రోజుల్లో 81,860 మ్యాచ్‌లను తిలకించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా 625 సచివాలయాల స్థాయిలో 956 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా, 730 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తంగా మూడు రోజుల్లో 3,280 మ్యాచ్‌లు జరిగాయి. సుమారు 33 వేల మంది కారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికలు, యువతులతోపాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆడుదాం ఆంధ్రా పోటీలు విజయవంతంగా సాగుతున్నాయి. విజయం కోసం హోరాహోరీ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. యువత పెద్దసంఖ్యలో పోటీల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలోని శరభయ్యగుప్తా హిందూ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం, ప్రగతి పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ పోటీలను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న పరిశీలించారు. క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దాచేపల్లి మండలంలోని గామాలపాడులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పోటీలను ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సందడి తెచ్చాయి. గురువారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 260 సచివాలయాల్లో 707 మ్యాచ్‌లలో క్రీడాకారులు తలపడ్డారు. కృష్ణా జిల్లాలో 508 సచివాలయాల్లో 977 మ్యాచ్‌లలో క్రీడాకారులు పోటీ పడ్డారు. మండల స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా జెర్సీ (టీ.షర్ట్, టోపీ)లను జిల్లా క్రీడల అభివృద్ధి కార్యాలయాలకు సరఫరా చేసింది. ఎన్టీఆర్ జిల్లాలోని 605 సచివాలయాలకు 68,970 జెర్సీలు, కృష్ణా జిల్లాలో 508 సచివాలయాలకు 57,912 జెర్సీలు వచ్చాయి. -
Adudam Andhra 2023 Photos: అంతటా క్రీడా సంబరం.. ఆడుదాం ఆంధ్రాకు అద్భుత స్పందన (ఫొటోలు)
-
కూత కుదిరింది.. ఆట అదిరింది
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో క్రీడా రంగానికి మహర్దశ వచ్చింది. గ్రామీణ, పట్టణ యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు.. మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ఐదు క్రీడాంశాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తోంది. యువత ఆరోగ్యాన్ని పెంపొందించే.. క్రీడా స్ఫూర్తి నింపే లక్ష్యంతో వాలీబాల్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజైన బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా క్రీడాకారులు నువ్వా.. నేనా అన్నట్టుగా తలపడ్డారు. ఆయా క్రీడాంశాల్లో వేలాది జట్లు దుమ్ములేపాయి. యువతులు సైతం పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. షెడ్యూల్ ప్రకారం 26 జిల్లాల్లోని 8,549 గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీలు నిర్వహించారు. దాదాపు 18 జిల్లాల్లో 50 శాతం నుంచి 73.85 శాతం సచివాలయాల్లో పోటీలు ఊపందుకున్నాయి. 9,774 పోటీలను నిర్దేశిస్తే 8,594 పోటీలను దిగ్విజయంగా పూర్తి చేశారు. కొన్నిచోట్ల సమయాభావంతో పోటీలు మరుసటి రోజు షెడ్యూల్లోకి మార్చారు. అత్యధికంగా విశాఖపట్నంలో 95.37 శాతం, పశ్చిమ గోదావరిలో 94.95 శాతం, తూర్పు గోదావరిలో 92.93 శాతం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 90 శాతానికిపైగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరిపించారు. క్రీడాకారులు చెలరేగి ఆడుతుంటే.. రెట్టించిన ఉత్సాహంతో ప్రేక్షకులు క్రీడాకారులను ప్రోత్సహించడం విశేషం. తొలిరోజు కంటే అత్యధికంగా 7.02 లక్షల మంది వీక్షకుల సంఖ్య నమోదయ్యింది. ఇందులో 4.80 లక్షల మంది పురుషులు, 2.20 లక్షల మంది మహిళలు పోటీలను నేరుగా తిలకించారు. మొత్తంగా 31,169 మ్యాచ్‌లలో 70 శాతం మ్యాచ్‌లు అనుకున్న సమయానికి పూర్తి చేశారు. ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా రెండో రోజూ ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్రా టోర్నీలు కొనసాగాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ యువకులతో కబడ్డీ ఆడి అలరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బుధవారం వివిధ టోర్నమెంట్లు హోరాహోరీగా సాగాయి. సచివాలయ స్థాయిలో ఐదు క్రీడాంశాల్లో జరుగుతున్న పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండు జిల్లాల్లోని 976 సచివాలయాల పరిధిలోని 485 మైదానాల్లో ఆటల పోటీలు సాగాయి. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలోని సింహాచలం సచివాలయాల పరిధిలో క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖో పోటీలు జరగ్గా.. చినవాల్తేరు జిమ్నాజియం గ్రౌండ్లో షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. గాజువాక నియోజకవర్గ పరిధిలోని భెల్ (హెచ్‌పీవీపీ) క్రీడా మైదానంలో 8 జట్ల మధ్య సచివాలయ స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురంలో క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో యువ జట్లు ఉత్సాహంగా తమ ప్రతిభ చాటాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 515 సచివాలయాల్లో ఆడుదాం ఆంధ్రా రెండో రోజు పోటీలు ఉత్సాహంగా జరిగాయి. మామిడికుదురు మండలం మొగిలికుదురులో పోటీలను పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లాలోని 511 సచివాలయాల పరిధిలో క్రీడాకారులు ఉల్లాసంగా పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని 400 మైదానాల్లో జరిగిన పోటీల్లో క్రీడాకారులు చురుగ్గా పాల్గొన్నారు. రాయలసీమలో రసవత్తరంగా.. రాయలసీమలో ఆడుదాం ఆంధ్రా పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. చిత్తూరులో పోటీలను కలెక్టర్ షణ్మోహన్, జేసీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పీవీకేఎన్ మైదానంలో పోటీలను జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం 507 సచివాలయాల పరిధిలో 492 క్రీడా మైదానాల్లో పోటీలు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం రెండు రోజుల్లో 2,602 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండగా.. 2,365 మ్యాచ్‌లు జరిగాయి. తిరుపతి జిల్లా పరిధిలో రెండో రోజు 1,552 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. 1,151 మ్యాచ్‌లు జరిగాయి. పోటీలను తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి పర్యవేక్షించారు. కర్నూలు జిల్లా పరిధిలోని 672 సచివాలయాల్లో పోటీలు కొనసాగుతున్నాయి. కోడుమూరు మండలం పెంచికలపాడులో ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ రిబ్బన్ కట్ చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఒక్క కర్నూలు నగరంలోనే 30 క్రీడా మైదానాల్లో క్రికెట్, కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో పోటీలను డీఎస్డీవో కె.జగన్నాథరెడ్డి ప్రారంభించారు. సత్తా చాటుతున్న సెంట్రల్ ఆంధ్రా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదాం ఆంధ్రా క్రీడాపోటీలు కోలాహలంగా సాగుగుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని మార్టేరు, పెనుమంట్ర మండలాల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు బుధవారం పోటీలను ప్రారంభించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఏలూరు జిల్లాలో 1,250 మ్యాచ్‌లు, పశ్చిమగోదావరి జిల్లాలోని 537 సచివాలయ పరిధిలో 880 మ్యాచ్‌లు నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయవాడ కృష్ణలంకలోని ఏపీ ఎస్ఆర్ఎంసీ హైస్కూల్ మైదానంలో రెండో రోజు పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఫిబ్రవరి 10 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 1.20 లక్షల మంది భాగస్వాములవుతున్నారని కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలకు విశేష స్పందన లభిస్తోంది. పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో పోటీలు నిర్వహించారు. గురజాలలోని జయంతి పాఠశాలలో క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కనిగిరి జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. తర్లుపాడు మండలంలో పోటీలను ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్, క్రికెట్ ఆడారు. ఈనాడు కథనం పచ్చి అబద్ధం పీసీ పల్లి: ప్రకాశం జిల్లా పీసీ పల్లి పంచాయతీలో ఆడుదాం ఆంధ్రా పోటీలకు స్థానిక మహిళలు లేక రుణాలు తీసుకునేందుకు బ్యాంక్‌కు వచ్చిన అయ్యవారిపల్లికి చెందిన పొదుపు మహిళలతో టెన్నికాయిట్ ఆడించారంటూ ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని వెంకటేశ్వర డ్వాక్రా గ్రూప్ మహిళలు తీవ్రంగా ఖండించారు. ఈనాడులో ప్రచురించిన కథనమంతా అబద్ధమని మహిళలు తెలిపారు. పీసీపల్లి మండలం మురుగమ్మి పంచాయతీకి చెందిన వెంకటేశ్వర డ్వాక్రా గ్రూపునకు తామంతా రుణాల కోసం కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ చిలకమ్మ కలిసి మంగళవారం పీసీ పల్లిలోని బ్యాంక్‌కు వెళ్లామన్నారు. బ్యాంక్‌లో రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో సమీపంలోని పాఠశాలకు వెళ్లి ‘ఆడుదాం ఆంధ్రా’ తిలకించామన్నారు. అక్కడ పోటీల్లో పీసీ పల్లికి చెందిన తమ స్నేహితులు ఆటలాడుతుండటంతో విరామ సమయంలో వారితో ముచ్చటిస్తూ వారి చేతిలో ఉన్న ఆట వస్తువులను తీసుకుని సరదాగా వారితో కలసి ఆడామని చెప్పారు. అనంతరం బ్యాంకుకు వెళుతుంటే ఈనాడు విలేకరి వచ్చి మీది ఏ గ్రామం, ఏ పనిమీద వచ్చారని అడిగి ఫొటోలు తీసుకువెళ్లినట్టు చెప్పారు. గ్రూప్ లీడర్ సులోచన మాట్లాడుతూ.. రుణాల కోసం పీసీ పల్లి బ్యాంక్‌కు వెళ్లామని.. రుణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనడంతో స్కూల్లో జరిగే ఆటల పోటీలకు చూడటానికి వెళ్లామని చెప్పారు. తాము పోటీల్లో పాల్గొనలేదని.. కావాలనే పార్టీల మీద అక్కసుతో తమ ఫొటోలు తీసి తప్పుడు కథనం ప్రచురించారని తెలిపారు. -
వలంటీర్ల ఆగ్రహ జ్వాలల్లో పచ్చపత్రికల దహనం
నందవరం/హుకుంపేట/పెదకూరపాడు/కోళ్లపా లెం/కపిలేశ్వరపురం: ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా సేవాభావంతో నిరంతరం పనిచేస్తున్న వలంటీర్లు.. తమపై వస్తున్న తప్పుడు కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము సమ్మె చేస్తామన్నామని, ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనడంలేదని ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ప్రతుల్ని పలుచోట్ల దహనం చేశారు. పలు ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో నిరసన తెలిపారు. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5 చానళ్లు అసత్య ప్రసారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమకు సమ్మె, నిరసనలు చేసే ఆలోచనలే లేవని ముక్తకంఠంతో నినదించారు. అసత్యవార్తలతో దెబ్బతీయలేరు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఇంటింటికి చేరవేస్తున్న తమపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కర్నూలు జిల్లాలో వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుండటంతో ఈ విధమైన అక్కసు వెళ్లగక్కుతున్నాయని చెప్పారు. తమకు ఎలాంటి సమ్మె, నిరసనలు చేసే ఉద్దేశం లేదని, అసత్యవార్తలతో వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. నందవరం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రామోజీ, రాధాకృష్ణ డౌన్‌డౌన్ అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను దహనం చేశారు. నాగలదిన్నెలో గ్రామ సచివాలయం–1, 2 పరిధిలోను, సోమలగూడూరులోను వలంటీర్లు పచ్చపత్రికలను తగులబెట్టారు. ఇదంతా పచ్చమీడియా కుట్ర జీతాలు పెంచాలని వలంటీర్లు సమ్మె చేస్తున్నట్లు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని, ఇదంతా పచ్చమీడియా కుట్ర అని వలంటీర్ల అసోసియేషన్ అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు, హుకుంపేట మండల శాఖ అధ్యక్షుడు మీసాల రవితేజ చెప్పారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన పత్రికలకు వ్యతిరేకంగా బుధవారం హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వలంటీర్ల అసొసియేషన్ సభ్యులు, పలువురు వలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న మేలును చూసి తట్టుకోలేకనే పచ్చమీడియా అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గుర్తింపు పొందిందన్నారు. గౌరవంతోపాటు ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురిస్తే తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. వలంటీర్ల అసోసియేషన్ సభ్యులు ముసిరి భవానీశంకర్, గబ్బడ శ్రీను, అప్పలరాజు, శాంతికుమారి, భాగ్యశ్రీ పాల్గొన్నారు. వినూత్న నిరసన సమాజసేవే పరమావధిగా.. స్వచ్ఛందంగా సేవలందిస్తున్న తమపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాస్తోందని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు పచాయతీ పరిధిలోని కోళ్లపాలేనికి చెందిన వలంటీర్లు నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. ఈనాడు మీడియా, టీవీ 5 ఎలక్ట్రానిక్ మీడియా తమను రెచ్చగొట్టే విధంగా తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సమ్మెలోకి వెళ్లడం లేదని, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొంటున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు ఇచ్చిన హామీ మేరకు విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు జెరూష, నాగవేణి, స్వప్న, రాణి, అలివేణి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు నీలా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలెవరూ నమ్మవద్దు వలంటీర్ వ్యవస్థ రూపశిల్పి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నట్టు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని వలంటీర్లు కోరారు. జీతాలను పెంచాలంటూ వలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారని, రహదారులపై ఆందోళనలతో రగిలిపోతున్నారని సోషల్ మీడియాలోను, కొన్ని పత్రికల్లోను తప్పుడు వార్తలు వస్తున్నాయని చెప్పారు. తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లను దహనం చేశారు. వలంటీర్ల ఐక్యతను దెబ్బతీయలేరు వలంటర్లను రెచ్చగొట్టి చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే పచ్చమీడియా తప్పుడు వార్తలను ప్రచురిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ వ్యవస్థలతో ప్రజలకు ప్రభుత్వసేవలు చేరువయ్యాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న మా సేవలను జీర్ణించుకోలేకనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఆ రెండు పత్రికలకు తగిన బుద్ధి చెబుతారు. వలంటీర్ల ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరు. మేమంతా సీఎం జగనన్నకు అండగా ఉంటాం. – భీమన్న, గ్రామ వలంటీరు, నందవరం మండలం, కర్నూలు జిల్లా విపక్షాల కుట్రలు విఫలం కొందరినైనా రెచ్చగొటి సమ్మెలోకి దించాలన్న విపక్షాల కుట్రలు విఫలమయ్యాయి. నిన్నటిదాక వలంటీర్లను సంఘవిద్రోహ శక్తులతో పోలుస్తూ ప్రతిపక్షాలు, పచ్చమీడియా విషప్రచారం చేశాయి. ఇప్పుడు వలంటీర్లపై లేనిపోని ప్రేమను కురిపించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వలంటీర్ల సోషల్ మీడియాలోకి పచ్చబ్యాచ్ దూరి అసత్య పోస్టులు పెడుతున్నారు. వలంటీర్లు అందరూ ఆడుదాం ఆంధ్రాలో పాల్గొంటున్నారు. అవాస్తవాలు చెప్పే వారిని శిక్షించాలి. – వెలితోటి చిన్నబాబు, పల్నాడు జిల్లా వలంటీర్ల యూనియన్ నాయకుడు -
బాబును ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారు: మంత్రి రోజా
తిరుపతి: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆడ పులులు క్రీడల్లో దూసుకుపోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె బుధవారం శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీకు వస్తే తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడుకు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రం పరిస్థితి దేవుడు ఎరుగు.. కుప్పం నియోజకవర్గం అయినా కాపాడుకోవాలని బాబు పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా, 40 ఏళ్లుగా కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రెవెన్యూ డివిజన్లో వేల పెన్షన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలను ఇచ్చింది సీఎం జగన్ అని తెలిపారు. 2024లో చంద్రబాబును కుప్పంలో ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారని మంత్రి రోజా అన్నారు. ఏపీని అభివృద్ధి చేసి సీఎం జగన్ మోహన్‌రెడ్డి చూపిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్తే సూసైడ్ చేసుకున్నట్లేనని ఆమె తెలిపారు. పదవులే పరమావధిగా ఉన్నవాళ్లకు పార్టీలు మారితే భవిష్యత్ ఉండదని మంత్రి రోజా అన్నారు. చదవండి: AP: తమ్ముళ్ల ‘ఉనికి’పాట్లు -
Adudam Andhra : ఆట సూపర్ హిట్ (ఫొటోలు)
-
ఆడుదాం ఆంధ్రా..వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
-
ఆరోగ్యంగా ఉండాలంటే జీవితంలో క్రీడలు చాలా అవసరం: సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద మెగా టోర్నీ ’ఆడుదాం ఆంధ్ర’ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
రామోజీ ఇవేం ‘బురద’ రాతలు
మద్దిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై రామోజీరావు బురద జల్లేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో కడియాల యానాదయ్య ఉన్నత పాఠశాల గ్రౌండ్ బురదమయమైందని, ఇక్కడ పోటీలు నిర్వహించడానికి కుదరదని ఈనాడు అసత్య కథనం వండివార్చింది. వాస్తవానికి ఈ పాఠశాల ఆటస్థలం బాగు చేయించేందుకు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు పెద్దిరెడ్డి కోటిరెడ్డి ఇటీవల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌లు ఎంపీ నిధుల నుంచి చెరో రూ. 5 లక్షలు మంజూరు చేశారు. గ్రౌండ్‌ను పూర్తిగా లెవెల్ చేసేందుకు పంచాయతీ అనుమతుల కోసం అర్జీ ఇచ్చారు. సగానికి పైగా గ్రౌండ్‌ను మెరక చేశారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా కొంతమేర పనులు జరగలేదు. మైదానంలో ఓ పక్క మాత్రమే బురద ప్రాంతం ఉండగా.. దానిని ఈనాడు బూతద్ధంలో చూపడానికి ప్రయత్నించింది. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఇదే మైదానంలో కబడ్డీ, ఖోఖో, షటిల్, వాలీబాల్ నిర్వహిస్తున్నారు. అయితే క్రికెట్‌ను సమీపంలోని కారుమూడి వారిపాలెం(గుండ్లాపల్లి) హైస్కూలులో ఆడడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే మైదానంలో ఆరు సచివాలయం పరిధిలోని టీంలు ఆడుతాయి. మిగిలిన 12 సచివాలయాల పరిధిలోని క్రికెట్ టీంలు ఆడేందుకు ఇనమనమెళ్లూరు, తెల్లబాడు హైస్కూళ్లలో క్రీడా మైదానాలను కేటాయించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. పచ్చ పత్రిక వక్రీకరించి రాయడం చూసి స్థానికులు ఛీకొడుతున్నారు. అబద్ధాల రాతలు మంచిది కాదని, నిజాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు పేర్కొంటున్నారు. -
సంబరంలా.. ఆడుదాం ఆంధ్రా పోటీలు
సాక్షి, నెట్వర్క్: మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలు తొలిరోజు అంబరాన్ని అంటే సంబరంతో మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరులోని నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలకు గాను 6,174 చోట్ల షెడ్యూల్ ప్రకారం పోటీలను నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఈ పోటీలను ప్రారంభించారు. తొలి రోజు ఐదు క్రీడాంశాల్లో కలిపి మొత్తం 33,722 పోటీలు జరిగాయి. సాంప్రదాయ క్రీడాంశాలైన యోగా, మారథాన్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 26 జిల్లాల్లోనూ 5 లక్షలకుపైగా ప్రేక్షకులు నేరుగా ఆడుదాం ఆంధ్రా పోటీలను వీక్షించినట్టు సమాచారం. దాదాపు 50 శాతం జిల్లాల్లో 100 శాతం, మిగిలిన జిల్లా్లల్లో 99 శాతం వరకు జట్ల కూర్పు పూర్తయింది. జనవరి 9లోగా గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేసేలా రోజూ ప్రణాళిక ప్రకారం అధికార యంత్రాంగం పని చేస్తోంది. తుది నివేదిక ప్రకారం ఆడుదాం ఆంధ్రాకు 37.23 లక్షల మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. ఇందులో 23.48 లక్షల మంది పురుషులు, 13.75 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. వలంటీర్ల ద్వారా మాన్యువల్ స్కోరింగ్‌తో పాటు పారదర్శకత కోసం క్రిక్ క్లబ్ యాప్ ద్వారా ఆన్లైన్ స్కోర్లు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మంది శిక్షణ పొందిన వలంటీర్లకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడల స్కోరింగ్‌కు ప్రత్యేక లాగిన్లు అందించారు. సచివాలయ స్థాయి పోటీల్లో విజేతలకు అందించేందుకు వీలుగా టీషర్టులు, టోపీలను వేగంగా సరఫరా చేస్తున్నారు. 17.10 లక్షల జతలకు గాను 8 లక్షలకు పైగా ఇప్పటికే జిల్లాలకు చేరాయి. కోస్తా.. వెల్లివిరిసిన ఆనందం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో హోం మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా పోటీలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలో పోటీలను కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ భరత్‌రామ్ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 511 సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో ఆటల పోటీలకు 90 వేల మంది పురుషులు, 40 వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,16,171 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేయించుకున్నారు. రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు హాజరై పోటీలకు శ్రీకారం చుట్టారు. భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏలూరు, భీమవరంలో కలెక్టర్లు వె.ప్రసన్న వెంకటేష్, పి.ప్రశాంతిలు ఆటల పోటీలను ప్రారంభించారు. ఏలూరు జిల్లాలో 1.43 లక్షల మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 1.71 లక్షల మంది క్రీడల్లో పాల్గొనటానికి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏలూరు జిల్లాలో 5 ప్రధాన క్రీడలకు సంబంధించి 14,354 టీమ్‌లను సిద్ధం చేసి 7,198 మ్యాచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ తదితరులు పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 605 సచివాలయాల పరిధిలో దాదాపు 1.17 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో 11 వేలకు పైగా జట్లు ఆడనున్నాయి. కృష్ణా జిల్లాలో వివిధ క్రీడల్లో 1.12 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పురుషుల్లో 7 వేల జట్లు, మహిళల్లో 4వేల జట్లు ఉన్నాయి. పోటీల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ పతాకంతో 2 కిలోమీటర్ల మేర విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 3,280 అడుగుల పొడవున రూపొందించిన జాతీయ జెండాతో క్రీడాకారులు గాంధీనగర్ నుంచి చీమకుర్తిలోని ప్రభుత్వ హైస్కూలు క్రీడా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. దర్శిలో జాతీయ పతాకంతో రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహభరిత వాతావరణంలో పోటీలు జరిగాయి. ఉత్తరాంధ్రలో ఉరిమిన ఉత్సాహం.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో 11,500 జట్లు నమోదు చేసుకోగా.. 670 క్రీడా మైదానాలు సిద్ధం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 976 సచివాలయాల పరిధిలో 485 మైదానాల్లో ఐదు క్రీడాంశాల్లో ఆటల పోటీలు జరిగాయి. మొత్తం 2.07 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విజయనగరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి.. ఆటల పోటీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులైన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పతక విజేత మత్స్య సంతోషి, జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, స్కేటింగ్ క్రీడాకారుడు సాయితేజలను ఘనంగా సత్కరించారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెంలో జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, ఎంపీ సత్యవతి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లావ్యాప్తంగా 14,098 టీములు, అందులో 1.31 లక్షల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. రాయలసీమ.. ఆటాడుకుందాం రా.. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలో 1,89,929 మంది, నంద్యాల జిల్లాలో 1.25 లక్షల మంది క్రీడాకారులు పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో 645, అన్నమయ్య జిల్లాలో 501 సచివాలయాల పరిధిలో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పోటీలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 515 క్రీడామైదానాల్లో పోటీలు జరిగాయి. తిరుపతి జిల్లాలో పలు సచివాలయాల పరిధిలో క్రీడాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. అనంతపురం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు, తాడిపత్రి, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ పోటీలు జరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడ్డారు. -
AP: మెగా టోర్నీ మొదలైంది
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘ఆడుదాం ఆంధ్రా ’ ఆటల పోటీల ద్వారా గ్రామీణ ఆణిముత్యాలను వెలికి తీసి సానపట్టి వజ్రాలుగా మార్చి దేశానికి అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ ’ఆడుదాం ఆంధ్రా’ను మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేశారు. ఇవాళ మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలు రాయిగా నిలుస్తాయని, 47 రోజుల పాటు ఫిబ్రవరి 10వతేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో వీటిని నిర్వహిస్తామని చెప్పారు. అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా ఇది చరిత్రలో నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండు ప్రధాన లక్ష్యాలు.. ‘ఆడుదాం.. ఆంధ్రా’ కార్యక్రమం వెనుక ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలున్నాయి. ఒకటి.. గ్రామ స్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడం. రెండోది.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఇవి రెండూ సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యాయామం, క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది? ప్రతి ఒక్కరికీ అవి ఎంత అవసరం? అనే విషయాలను తెలియజేసేందుకు ఇది ఒక అవగాహన కార్యక్రమంలా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. టైప్ 2 డయాబెటీస్‌ని నిరోధించడంలో క్రీడలు చురుకైన పాత్ర పోషిస్తాయి. జబ్బుల బారిన పడకుండా.. మన ప్రభుత్వం ప్రజారోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలో ప్రివెంటివ్ కేర్‌పై దేశం మొత్తం గర్వపడేలా మన అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా మనిషికి వ్యాయామం ఎంత అవసరం అనే విషయాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బీపీ ఎక్కువైతే గుండెకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయి. షుగర్ ఎక్కువైతే కిడ్నీ, నరాల జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని కంట్రోల్లో ఉంచాలన్నా, రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా గ్రామ స్థాయి నుంచి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమని ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. అందుకే ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మెంటార్లుగా పీవీ సింధు, శ్రీకాంత్ ఈ క్రీడోత్సవాలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయి. వివిధ స్థాయిల్లో ఆణిముత్యాలను గుర్తించేందుకు ప్రొఫెషనల్ లీగ్ టీమ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయి. ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను ఆణిముత్యాలుగా మలిచే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు టీమ్‌లు ముందుకొచ్చాయి. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకు వచ్చాయి. వీరంతా నియోజకవర్గ స్థాయి నుంచి మన ఆటలను తిలకిస్తారు. ఆణిముత్యాలను వెతికి వారికి మెరుగులు దిద్ది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈ టీమ్స్ తోడుగా ఉంటాయి. బ్యాడ్మింటన్‌కు సంబంధించి కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా వారిలో ఒకరికి విశాఖపట్నంలో, మరొకరికి తిరుపతిలో స్థలం ఇచ్చాం. బ్యాడ్మింటన్ అకాడమీలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి సహకరిస్తుంది. శ్రీకాంత్, సింధు మెంటార్లుగా వ్యవహరిస్తూ ప్రతిభ ప్రదర్శించే మన పిల్లలకు తోడుగా నిలుస్తారు. ఇక వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ టాలెంట్ హంట్‌లో పాలు పంచుకుంటారు. ఇక ఏటా ఆటలు.. ఆడుదాం ఆంధ్ర టోర్నీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. గ్రామస్థాయి నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు జరుగుతాయి. ఏటా ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఆరోగ్యపరమైన అవగాహన కల్పిస్తూ టాలెంట్ హంట్ కొనసాగిస్తాం. తద్వారా మరిన్ని ఆణిముత్యాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వారికి నియోజకవర్గ స్థాయిలో ఆడేందుకు ప్రొఫెషనల్ కిట్లు పంపిణీ జరుగుతుంది. ఏటా కిట్లు ఇస్తూ మన పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాబోయే రోజుల్లో స్కూల్ స్థాయి నుంచి.. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి ప్రారంభిస్తే దాదాపు 34.19 లక్షల మంది క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారు. మొత్తం 1.22 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువ క్రీడాకారులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నా. 15,000 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9,000 ప్లే గ్రౌండ్లు గుర్తించి సిద్ధం చేశాం. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నింటినీ గుర్తించి అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది. మీ అన్నగా అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మన ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలని కోరుకుంటున్నా. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, మద్దాళి గిరి, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, కిలారు రోశయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
అనకాపల్లిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
-
ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK.. ఇంకా
సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి పట్టం కట్టేందుకు వీలుగా ప్రవేశపెట్టిన అతిపెద్ద క్రీడోత్సవాన్ని గుంటూరులో ఆరంభించారు. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ ఇందుకు వేదికైంది. దేశచరిత్రలోనే మైలురాయి పోటీల ప్రారంభం సందర్భంగా సీఎం వైస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ఈ క్రీడా సంబురాలు దేశ చరిత్రలోనే మైలురాయి. ఈ రోజు నుంచి... 47 రోజులపాటు ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను నిర్వహించనున్నాం. ఆడుదాం ఆంధ్రా గొప్ప పండుగ. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాయామం వల్ల బీపీ, డయాబెటిక్.. అదుపులో ఉంటాయి. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసరం. అందుకే..గ్రామస్థాయి నుంచి అడుగులేస్తున్నాం. గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతికి .. దేశానికి అందిస్తాం. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో.. తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో.. పోటీలు జరుగుతాయి. 9 వేల ప్లే గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి. 47 రోజుల్లో.. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. ఈ క్రీడా సంబురాలు ప్రతి ఏడాది జరుగుతాయి. రూ.12 కోట్లకు పైగా నగదు బహుమతులు అందజేస్తాం’’ అని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా.. ►తొలి దశలో.. జనవరి 9వ తేదీ వరకు.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు.. ►జనవరి 10 నుంచి 23 వరకు.. మండల స్థాయిలో పోటీలు.. ►జనవరి 24 నుంచి 30 వరకు.. నియోజకవర్గ స్థాయిలో పోటీలు.. ►ఫిబ్రవరి 6వ తేదీ నుంచి.. 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అదే విధంగా ఉదయం 5 గంటల నుంచి.. సాయంత్రం 7 గంటల వరకు.. పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఆడుదాం ఆంధ్ర- మరిన్ని విశేషాలు ►రిఫరీలుగా.. 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ►పోటీ పడనున్న.. 34.19 లక్షల క్రీడాకారులు ►వీరిలో.. 10 లక్షల మందికిపైగా మహిళలు.. రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను.. ప్రోత్సాహించాలనే లక్ష్యంతో.. రూ.119.19 కోట్లతో సీఎం జగన్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పోటీలను నిర్వహిస్తోంది. దాదాపు రూ.42 కోట్లతో..క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో.. కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన.. 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లు ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ►ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో.. మండలస్థాయిలో 17.10 లక్షల .. టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లు. ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు..ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం ►క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్.. ఆంధ్రా క్రికెట్ ఆసోషియేషన్ ►బ్యాడ్మింటన్‌లో సింధు.. శ్రీకాంత్ బృందాలు ►వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్.. ►కబడ్డీలో- ప్రొకబడ్డీ ఆర్గనైజర్లు.. ►ఖోఖోలో- రాష్ట్ర క్రీడా సంఘాల ప్రతినిధులు.. టాలెంట్ హంట్ చేయనున్నారు. ►ఆన్లైన్, ఆఫ్ లైన్లో.. ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం.. వివిధ స్థాయిల్లో అంతర్జాతీయ శిక్షణ ఇప్పించి.. ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో.. అవకాశం కల్పించే దృక్పథంతో.. పోటీలను సీఎం జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
CM Jagan Played Cricket Photos: ఆడుదాం ఆంధ్రా పోటీల్లో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్ (ఫొటోలు)
-
CM Jagan To Launch Aadudam Andhra Event: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలు ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
ప్లేయర్స్‌కి స్పోర్ట్స్ కిట్లు అందజేసిన సీఎం జగన్
-
ఆడుదాం ఆంధ్రా ప్రమాణం చేయించిన సీఎం జగన్
-
ఆడుదాం ఆంధ్రా క్రీడా జ్యోతి వెలిగించిన సీఎం జగన్
-
ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో సీఎం జగన్
-
క్రీడా సామగ్రి పరిశీలించిన సీఎం జగన్
-
ఆడుదాం ఆంధ్రా గ్రౌండ్లోకి సీఎం జగన్
-
CM Jagan: సరదా సరదాగా క్రికెట్ ఆడితే..
సాక్షి, గుంటూరు: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నిత్యం వాటి సమీక్షలతో క్షణం తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సరదాగా సందడి చేస్తే ఎలా ఉంటుంది?. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ప్రారంభం కోసం ఇవాళ గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణానికి వెళ్లిన ఆయన.. అక్కడ క్రికెట్ ఆడారు. కార్యక్రమం ప్రారంభించిన అనంతరం మైదానంలోకి అడుగుపెట్టారాయన. అక్కడ తొలుత మంత్రి ఆర్కే రోజాకు దగ్గరుండి ఎలా ఆడాలో చెప్పిన సీఎం జగన్.. ఆ తర్వాత ఆయనే స్వయంగా బ్యాట్ చేతబట్టి బంతుల్ని ఎదుర్కొన్నారు. స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేయడం గమనార్హం. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా గడిపే సీఎం జగన్‌ను.. అలా చూసేసరికి తోటి మంత్రులు, అధికార యంత్రాగం సంబురంగా చప్పట్లు కొడుతూ కనిపించారు. ఆ సమయంలో మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. ఆపై కబడ్డీ, కోకో.. ఇలా పలు రంగాల క్రీడాకారుల్ని భుజం తట్టి ముందుకు వెళ్లారాయన. కాసేపు బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టుల్లోనూ సండి చేశారు. 👉: ఆడుదాం ఆంధ్రా పోటీల్లో బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్ (ఫొటోలు) -
రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
-
గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ బ్యాటింగ్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్, మంత్రి రోజా కీపింగ్ చేశారు. ►బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్.. బ్యాట్స్‌మెన్ స్టైల్స్‌లో సీఎం జగన్ బ్యాటింగ్ ►క్రికెట్లో బ్యాటింగ్ చేసిన ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజా ►క్రీడలకు సంబంధించి కిట్లను అందజేసిన సీఎం జగన్, ►అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఎం జగన్ ►క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్, బ్యాడ్మింటన్ కిట్లను అందజేసిన ముఖ్యమంత్రి జగన్ ►క్రికెట్ కిట్ బ్యాట్స్, బాల్స్, గ్లౌజ్‌లు, వికెట్స్ ఉన్నాయి. ►వాలీబాల్స్, నెట్ అందజేత ►బ్యాడ్మింటన్ కోసం బ్యాట్స్, నెట్, కాక్స్ అందజేత. ►రాష్ట్రవ్యాప్తంగా 5.09లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీ. ►1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు ►ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారుల నమోదు. ►అత్యధికంగా క్రికెట్లో 13 లక్షల మంది పేర్ల నమోదు. యోగా, మారథాన్, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది పేర్లు నమోదు. ►గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక. ►క్రీడలకు స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్ అన్నారు. ►ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్, క్రీడాకారులతో ప్రమాణం చేయించారు. ►ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్ 👉: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలు ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు) ►సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుంది. ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఒకటి.. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ వ్యాయామం, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్‌గా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరం అని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్‌గా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయమం చేయడం వల్ల బ్లడ్ ప్రజర్‌లాంటివి కంట్రోల్లో ఉంచగలుగుతాం. టైప్2 డయాబెటిస్ లాంటివి నిరోధించడంలో క్రియాశీలకంగా స్పోర్ట్స్ పని చేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్‌మీద దేశం మొత్తం గర్వపడేలా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడుతున్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం ఎంతో అవసరం అన్నది కూడా గ్రామస్థాయిలోకి మెసేజ్ తీసుకొనిపోయే గొప్ప కార్యక్రమం ఇది. బీపీ ఎక్కువయిందంటే గుండెపోటుకు చెందిన అనేక రకాల రోగాలు వస్తాయి. షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రోగాలు వస్తాయి. ఇటువంటివన్నీ కంట్రోల్లో ఉండాలి అంటే, రాకుండా జాగ్రత్తలు పడాలంటే కచ్చితంగా గ్రామ స్థాయిలో వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది. గ్రామ స్థాయి నుంచే ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తున్నాం. రెండో ముఖ్యమైన ఆబ్జెక్టివ్.. స్పోర్ట్స్ ఆడించే కార్యక్రమం సచివాలయం నుంచి మొదలు పెడితే.. ! మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా మన పిల్లలను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయికి టీమ్‌లు వస్తాయో, మన టీమ్‌లను చూసేందుకు, ఆణిముత్యాలను వెతికేందుకు ఏకంగా ప్రొఫెషనల్ లీగ్‌లో ఉన్న టీములన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయి. ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సాయంగా ఉండేందుకు వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి టీములు ముందుకొచ్చాయి. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు వాళ్లు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెసనల్ లెవల్లో వీళ్లంతా పార్టిసిపేట్ చేస్తారు. బ్యాడ్మింటన్‌కు సంబంధించి నాతోపాటు ఇక్కడే శ్రీకాంత్ ఉన్నాడు. సింధు కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. వీళ్లకు మన రాష్ట్రంలో ఒకరికి విశాఖలో ల్యాండ్, ఇంకొకరికి తిరుపతిలో ఇచ్చాం. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్లు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. వీళ్లు కూడా మెంటార్లుగా మన ట్యాలెంట్‌ను గుర్తించడంలో, సానపట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరం. వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లంతా కలిసి పని చేస్తారు. ఈ కార్యక్రమం ఇక మీదట నుంచి ప్రతి సంవత్సరం కూడాజరుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నా. ప్రతి సంవత్సరం ఇదే మాసాల్లో ఇదే మాదిరిగా గ్రామస్థాయి నుంచి మొదలై, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. గ్రామాల్లో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఆరోగ్యపరమైన అవేర్నెస్, మరో రకంగా ట్యాలెంట్ హంట్ కార్యక్రమం కూడా గ్రామస్థాయిలో చర్చనీయాంశమవుతుంది. మరిన్ని ఆణిముత్యాలు మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం జరుగుతుంది. సచివాలయం స్థాయి, మండల స్థాయి నుంచి కిట్లు ఇవ్వడం జరుగుతోంది. నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కిట్లు ఇస్తూ మన పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేందుకు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌చేయింకొని మన పిల్లలకు తోడుగా ఉండేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 15 వేల సచివాలయాల పరిధిలో, ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను గుర్తించడం జరిగింది. రాబోయే సంవత్సరాల్లో అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ప్రతి స్కూల్లోనూ ఎంకరేజ్ చేసేలా అడుగులు పడతాయి. స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటూ పోతాం. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలి. ►15.004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగతాయి. 9వేల ప్లే గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేశాం. 47 రోజులు, ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. క్రీడా సంబురాలు ఇకపై ప్రతీ ఏడాది జరుగుతాయి. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు. ►సీఎం జగన్ బ్యాడ్మింటిన్ ప్లేయర్ కిందాంబి శ్రీకాంత్ కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. ►సీహెచ్ రమాదేవికి క్రీడల టార్చ్‌ను అందజేసిన సీఎం జగన్ ►ఆడుదాం ఆంధ్రలో స్పోర్ట్స్ కిట్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ►నల్లపాడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ►సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ వేణు గోపాల్, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ►గుంటూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►మరికాసేపట్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం ►దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడోత్సాహం ఉప్పొంగనుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీలు మొదలవుతాయ ►ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. ప్రతి రోజు క్రీడోదయమే.. ►డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. ►ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు. 1.22 కోట్ల రిజిస్ట్రేషన్లు ►ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో దేహ దారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటిచెప్పడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది. ►ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో పది లక్షల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. కాంపిటీటివ్ విభాగంలోని ఐదు ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్ కాంపిటీటివ్ విభాగంలోని మారథాన్, యోగ, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది (కాంపిటీటివ్ విభాగంలో ఉన్నవారితో కలిపి) ఆసక్తి చూపించారు. 5.09 లక్షల కిట్ల పంపిణీ ►గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.119.19 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. దాదాపు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ప్రొఫెషనల్ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లను ఇస్తున్నారు. ప్రొఫెషనల్స్ గుర్తింపు.. ►నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్ హంట్ చేయనున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిలో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్ లాంటి ప్రతిష్టాత్మకం ఈవెంట్లో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను నిర్వహిస్తోంది. -
ఆడుదాం ఆంధ్ర, ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం ..ఇంకా ఇతర అప్డేట్స్
-
గుంటూరులో ఆడుదాం ఆంధ్ర పోటీలను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్