విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల ముగింపు కార్యక్రమం ఈ నెల 13న వైజాగ్‌లో జరగనుంది. ఈ ముంగిపు పోటీల కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీలను సీఎం జగన్ వీక్షించన్నారు.
ఇక.. విజేత జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్ జట్టు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షలు చొప్పున బహుమతి అందజేస్తారు. రాష్ట్రంలో 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా పోటీలు జరిగాయి. విశాఖలో రాష్ట్ర స్థాయిలో జరిగే ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీల్లో 5 కేటగిరీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
మరోవైపు.. రేపటి(శుక్రవారం) నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ అథారిటీ అధ్వర్యంలో క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పిస్తారు. ప్రజల కోసం నగరంలో అయిదు చోట్ల పోటీలు జరుగుతాయి. 5 చోట్ల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కమిషనర్ పకీరప్ప తెలిపారు. క్రీడాకారుల భద్రతకు దాదాపు 2 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment