క్రీడాకారులతో ఎంపీ మోపిదేవి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్
నిజాంపట్నం: ఆడుదాం ఆంధ్రా క్రీడలతో ఆణిముత్యాలను వెలికి తీసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిదేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో వాలీబాల్ విభాగంలో నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని సాధించిన సందర్భంగా గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు. ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువతలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా క్రీడలను పెట్టిందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడా కారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ 47 రోజులపాటు నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరిగాయని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం గుర్తించని విధంగా క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి వారికి అండగా నిలిచిందని చెప్పారు. నిజాంపట్నం సచివాలయం–3 టీం రాష్ట్ర స్థాయి వాలీబాల్‌లో ప్రథమ బహుమతిని సాధించడం మనందరికీ గర్వకారణమని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల, జెడ్పీటీసీ మాజీ ప్రసాదం వాసుదేవ, బోటు ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు విజయం సాధించిన వాలీబాల్ జట్టుకు సత్కారం
Comments
Please login to add a commentAdd a comment