గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్‌ | CM YS Jagan Started Aadudam Andhra Program At Guntur | Sakshi
Sakshi News home page

Aadudam Andhra: ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం అప్‌డేట్స్‌

Published Tue, Dec 26 2023 10:44 AM | Last Updated on Tue, Dec 26 2023 1:46 PM

CM YS Jagan Started Aadudam Andhra Program At Guntur - Sakshi

Updates..

సీఎం జగన్‌ బ్యాటింగ్‌, బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి బౌలింగ్‌, మంత్రి రోజా కీపింగ్‌ చేశారు. 

బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడిన సీఎం జగన్‌.. బ్యాట్స్‌మెన్‌ స్టైల్స్‌లో సీఎం జగన్‌ బ్యాటింగ్‌

క్రికెట్‌లో బ్యాటింగ్‌ చేసిన ముఖ్యమంత్రి జగన్‌, మంత్రి రోజా

క్రీడలకు సంబంధించి కిట్లను అందజేసిన సీఎం జగన్‌,

అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఎం జగన్‌

క్రికెట్‌ కిట్స్‌, వాలీబాల్‌ కిట్‌, బ్యాడ్మింటన్‌ కిట్‌లను అందజేసిన ముఖ్యమంత్రి జగన్‌

క్రికెట్‌ కిట్‌ బ్యాట్స్‌, బాల్స్‌, గ్లౌజ్‌లు, వికెట్స్‌ ఉన్నాయి. 

వాలీబాల్స్‌, నెట్‌ అందజేత

బ్యాడ్మింటన్‌ కోసం బ్యాట్స్‌, నెట్‌, కాక్స్‌ అందజేత. 

రాష్ట్రవ్యాప్తంగా 5.09లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ. 

1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకులు రిజిస్ట్రేషన్లు 

ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారుల నమోదు. 

అ‍త్యధికంగా క్రికెట్‌లో 13 లక్షల మంది పేర్ల నమోదు. యోగా, మారథాన్‌, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది పేర్లు నమోదు. 

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక. 

క్రీడలకు స్పోర్ట్స్‌మెన్‌ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్‌ అన్నారు. 

ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023లో క్రీడలకు సంబంధించి సీఎం జగన్‌, క్రీడాకారులతో ప్రమాణం చేయించారు.

ఆడుదాం ఆంధ్రా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్‌ 

👉: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలు ప్రారంభించిన సీఎం జగన్‌ (ఫొటోలు)

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 

  • ఈరోజు నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలబడిపోతుందని చెప్పడానికి గర్వపడుతున్నా.
  • ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది.
  • ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా హిస్టరీలో నిలబడిపోతుంది.
  • ఈ కార్యక్రమం ద్వారా రెండు ప్రధానమైన ఉద్దేశాలు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అచీవ్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.
  • ఒకటి.. ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊర్లోనూ వ్యాయామం, 
  • స్పోర్ట్స్‌ వల్ల ప్రతి మనిషి ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందన్న విషయం ఒక అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌గా ఉపయోగపడుతుంది.
  • ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరం అని తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్‌గా ఉపయోగపడుతుంది.
  • క్రమం తప్పకుండా కచ్చితంగా వ్యాయమం చేయడం వల్ల బ్లడ్‌ ప్రజర్‌లాంటివి కంట్రోల్‌లో ఉంచగలుగుతాం.
  • టైప్‌2 డయాబెటిస్‌ లాంటివి నిరోధించడంలో క్రియాశీలకంగా స్పోర్ట్స్‌ పని చేస్తుంది.
  • వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది.
  • విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీ హెల్త్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్‌ కేర్‌మీద దేశం మొత్తం గర్వపడేలా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడుతున్నాయి.
  • ఇందులో భాగంగానే వ్యాయామం ఎంతో అవసరం అన్నది కూడా గ్రామస్థాయిలోకి మెసేజ్‌ తీసుకొనిపోయే గొప్ప కార్యక్రమం ఇది.
  • బీపీ ఎక్కువయిందంటే గుండెపోటుకు చెందిన అనేక రకాల రోగాలు వస్తాయి.
  • షుగర్‌ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి. న్యూరాలజీకి సంబంధించిన రోగాలు వస్తాయి.
  • ఇటువంటివన్నీ కంట్రోల్‌లో ఉండాలి అంటే, రాకుండా జాగ్రత్తలు పడాలంటే కచ్చితంగా గ్రామ స్థాయిలో వ్యాయామం, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.
  • గ్రామ స్థాయి నుంచే ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తున్నాం.
  • రెండో ముఖ్యమైన ఆబ్జెక్టివ్‌.. స్పోర్ట్స్‌ ఆడించే కార్యక్రమం సచివాలయం నుంచి మొదలు పెడితే.. !
  • మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీలన్నీ నిర్వహించడం జరుగుతుంది.
  • ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ఆణిముత్యాలను వెతకడం
  • ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి లేకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానబెట్టి వజ్రంగా మలచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా మన పిల్లలను పరిచయం చేయడం.
  • ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత నియోజకవర్గ స్థాయికి టీమ్‌లు వస్తాయో, మన టీమ్‌లను చూసేందుకు, ఆణిముత్యాలను వెతికేందుకు ఏకంగా ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీములన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాయి.
  • ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సాయంగా ఉండేందుకు వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి టీములు ముందుకొచ్చాయి.
  • క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకొచ్చింది.
  • ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు వాళ్లు కూడా ముందుకొచ్చారు.
  • నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెసనల్‌ లెవల్‌లో వీళ్లంతా పార్టిసిపేట్‌ చేస్తారు.
  • బ్యాడ్మింటన్‌కు సంబంధించి నాతోపాటు ఇక్కడే శ్రీకాంత్‌ ఉన్నాడు. సింధు కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది.
  • వీళ్లకు మన రాష్ట్రంలో ఒకరికి విశాఖలో ల్యాండ్‌, ఇంకొకరికి తిరుపతిలో ఇచ్చాం.
  • బ్యాడ్మింటన్‌ అకాడమీస్‌ కూడా అక్కడ వీళ్లు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది.
  • వీళ్లు కూడా మెంటార్లుగా మన ట్యాలెంట్‌ను గుర్తించడంలో, సానపట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరం.
  • వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్‌, కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు రావడం జరిగింది.
  • రాష్ట్ర ప్రభుత్వంతో వీళ్లంతా కలిసి పని చేస్తారు.
  • ఈ కార్యక్రమం ఇక మీదట నుంచి ప్రతి సంవత్సరం కూడాజరుగుతుందని ఈ సందర్భంగా చెబుతున్నా.
  • ప్రతి సంవత్సరం ఇదే మాసాల్లో ఇదే మాదిరిగా గ్రామస్థాయి నుంచి మొదలై, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి.
  • గ్రామాల్లో అవేర్‌నెస్‌ క్రియేట్‌ అవుతుంది. ఆరోగ్యపరమైన అవేర్‌నెస్‌, మరో రకంగా ట్యాలెంట్‌ హంట్‌ కార్యక్రమం కూడా గ్రామస్థాయిలో చర్చనీయాంశమవుతుంది.
  • మరిన్ని ఆణిముత్యాలు మన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం జరుగుతుంది.
  • సచివాలయం స్థాయి, మండల స్థాయి నుంచి కిట్లు ఇవ్వడం జరుగుతోంది.
  • నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్‌ కిట్లు ఇవ్వడం జరుగుతుంది.
  • ప్రతి సంవత్సరం కిట్లు ఇస్తూ మన పిల్లల్ని ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుంది.
  • ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
  • 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేసేందుకు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
  • 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌చేయింకొని మన పిల్లలకు తోడుగా ఉండేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.
  • 15 వేల సచివాలయాల పరిధిలో, ఇప్పటికే 9 వేల ప్లే గ్రౌండ్లు గుర్తించడం జరిగింది.
  • ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ మైదానాలు, యూనివర్సిటీ గ్రౌండ్లు, మున్సిపల్‌ స్టేడియంలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను గుర్తించడం జరిగింది.
  • రాబోయే సంవత్సరాల్లో అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ప్రతి స్కూల్లోనూ ఎంకరేజ్‌ చేసేలా అడుగులు పడతాయి.
  • స్కూళ్ల దాకా కిట్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటూ పోతాం.
  • మీ అందరికీ ఆల్‌ ద వెరీ బెస్ట్‌ విషెస్‌ మీ అన్నగా తెలియజేస్తూ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి చల్లని దీవెలు రాష్ట్రానికి, మనందరి ప్రభుత్వానికి, నా తమ్ముళ్లందరికీ ఉండాలి. 

15.004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు జరుగతాయి. 9వేల ప్లే గ్రౌండ్స్‌ను ఏర్పాటు చేశాం. 47 రోజులు, ఐదు దశల్లో పోటీల నిర్వహణ ఉంటుంది. క్రీడా సంబురాలు ఇకపై ప్రతీ ఏడాది జరుగుతాయి. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు.

సీఎం జగన్‌ బ్యాడ్మింటిన్‌​ ప్లేయర్‌ కిందాంబి శ్రీకాంత్‌ కలిసి క్రీడా జ్యోతిని వెలిగించారు. 

సీహెచ్‌ రమాదేవికి క్రీడల టార్చ్‌ను అందజేసిన సీఎం జగన్‌

ఆడుదాం ఆంధ్రలో స్పోర్ట్స్‌ కిట్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌

నల్లపాడు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సీఎం జగన్‌కు స్వాగతం పలికిన మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ వేణు గోపాల్, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్

గుంటూరు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్

మరికాసేపట్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం

దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడో­త్సాహం ఉప్పొంగనుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీ­లు మొదలవుతాయ

ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్‌ అంబాసి­డర్‌గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. 

ప్రతి రోజు క్రీడోదయమే..
డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.

ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్‌ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్‌ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు.

1.22 కోట్ల రిజిస్ట్రేషన్లు
ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో దేహ దారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటిచెప్పడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది.

ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో పది లక్షల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం విశేషం. కాంపిటీటివ్‌ విభాగంలోని ఐదు ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్‌లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్‌ కాంపిటీటివ్‌ విభాగంలోని మారథాన్, యోగ, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది (కాంపిటీటివ్‌ విభాగంలో ఉన్నవారితో కలిపి) ఆసక్తి చూపించారు.   

5.09 లక్షల కిట్ల పంపిణీ
గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.119.19 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. దాదాపు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ప్రొఫెషనల్‌ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లను 
ఇస్తున్నారు.

ప్రొఫెషనల్స్‌ గుర్తింపు..
నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్‌ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్‌ హంట్‌ చేయనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిలో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్‌ లాంటి ప్రతిష్టాత్మకం ఈవెంట్‌లో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement