గుంటూరు, సాక్షి: పారిస్ పారాలింపిక్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో వైస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ నిజంగా గొప్పది. అంతేకాదు.. స్ఫూర్తిదాయకం కూడా. పతక విజేతలతో పాటు పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొన్న అందరికీ అభినందనలు. మీకు హ్యాట్సాఫ్.. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది’’ అని జగన్ ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు.
The dedication and talent of Paralympians are truly remarkable and inspirational. Congratulations and hats off to all the participants and medal winners! The nation is proud of you.#Paralympics2024
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2024
పారిస్ వేదికగా ఆగస్టు 28న మొదలైన పారాలింపిక్స్ సెప్టెంబర్ 8వ తేదీతో ముగిశాయి. మొత్తం 84 మంది అథ్లెట్లు.. అంచనాలను మించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో 18వ స్థానంలో నిలిచింది. ఫలితంగా.. భారత్ రికార్డు స్థాయిలో తొలిసారి పారాలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment