భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్‌... వైఎస్‌ జగన్‌ అభినందనలు | Ys Jagan Congratulates Cricketer Nitish Who Has Been Selected For India T20 | Sakshi
Sakshi News home page

భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్‌... వైఎస్‌ జగన్‌ అభినందనలు

Published Mon, Jun 24 2024 9:15 PM | Last Updated on Tue, Jun 25 2024 8:36 AM

Ys Jagan Congratulates Cricketer Nitish Who Has Been Selected For India T20

సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ⁠ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్‌ కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న నితీశ్‌.. భారత క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్‌లో నితీశ్‌ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్‌ జగన్.. కెరీర్‌లో మరింత ఎదగాలని తెలిపారు.

కాగా, ఇటీవల ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్‌కుమార్‌రెడ్డి ⁠భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్‌లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ⁠జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్‌ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement