t 20 criket match
-
భారత టీ-20 జట్టులోకి ఏపీ కుర్రాడు నితీశ్... వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: భారత టీ–20 జట్టులోకి ఆంధ్ర నుంచి ఎంపికయిన మొదటి ఆటగాడు నితీశ్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న నితీశ్.. భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. జింబాబ్వే టూర్లో నితీశ్ మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించిన వైఎస్ జగన్.. కెరీర్లో మరింత ఎదగాలని తెలిపారు.కాగా, ఇటీవల ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న విశాఖకు చెందిన నితీశ్‌కుమార్‌రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్లో స్థానం సంపాదించి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్ భారత టీ–20 జట్టుకు ఎంపికయ్యారు. -
టీ20 మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన కరేబియన్ ఆటగాడు
-
ఆటాడుకుందాం.. రా!
సాక్షి,సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలను అవలంభిస్తున్న నగర పోలీసు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. యువతతో సత్సంబంధాలు నెలకొనే విధంగా వారిని భాగస్వాములను చేస్తూ క్రికెట్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిని ‘హైదరాబాద్ పోలీసు లీగ్ (హెచ్పీఎల్) 20–20’ మ్యాచెస్గా పిలువనున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం ప్రకటించారు. నగర వ్యాప్తంగా జరిగే ఈ పోటీల్లో 80 వేల మంది యువతను పాల్గొనేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఇందులో పాల్గొనే ప్రతి టీమ్‌కు ప్రత్యేక రంగుతో కూడిన, తమ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా డ్రస్ ఉంటుందని ఆయన వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక సెక్టార్లు ఉంటాయి. ఒక్కో సెక్టార్‌కు ఒక ఎస్సై నేతృత్వం వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెక్టార్ల వారీగా టీమ్‌లు తయారు చేసి ఈ పోటీలు నిర్వహించాలని సీపీ నిర్ణయించారు. ఇక్కడ గెలిచిన జట్లు ఠాణా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటాయి. ఆపై సబ్–డివిజన్, జోనల్ స్థాయిల్లోనూ మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌ను మాత్రం ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి మ్యాచ్ సౌత్ జోన్‌కు సంబంధించి ఈ నెల 21న బార్కస్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఆసక్తిగల యువకులు, క్రీడాకారులు తమ సెక్టార్ ఎస్సై, లేదా స్థానిక ఠాణా ఇన్స్పెక్టర్ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణతో కలిసి నిర్వహిస్తున్న ఈ మ్యాచ్‌లలో పాల్గొనాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నగరానికి చెందిన ప్రముఖ ఆటగాళ్లకు కొత్వాల్ పిలుపునిచ్చారు. అందరూ భాగస్వాములైతే యువతకు ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. మహిళా క్రీడాకారిణుల కోసం ప్రత్యేకంగా టీమ్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం దీని ప్రభావం క్రీడాకారులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మ్యాచ్‌ను తెల్లవారుజామునే ప్రారంభించి ఉదయం 10.30 గంటల్లోగా పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హెచ్పీఎల్ సిరీస్ ముగిసిన తర్వాత ఎక్కువ రన్లు చేసిన, వికెట్లు తీసిన, బెస్ట్ పార్ట్నర్షిప్.. ఇలా మొత్తం 10 కేటగిరీలో వ్యక్తిగత అవార్డులు సైతం ఇవ్వనున్నారు. ఈ మ్యాచ్‌లో నగర యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీపీ కోరారు. -
మైదానంలో మరో ప్రమాదం!
లండన్ : ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నాట్ వెస్ట్ టి 20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా అరుండేల్ మైదానంలో ససెక్స్, సర్రే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది జరిగింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో ఎదురెదురుగా ఢీకొన్ని ఆటగాళ్లు తీవ్రంగా గాయపడి మైదానంలో కుప్పకూలిపోయారు. అరెండెల్ వేదికగా సర్రే, సస్సెక్స్ జట్ల మధ్య జరుగిన డొమెస్టిక్ టీ 20 మ్యాచ్‌లో.. సర్రే ఆటగాళ్లు మోసెస్ హెన్రిక్స్, రోరీ బర్న్స్ తీవ్రంగా గాయపడటంతో ఆంబులెన్స్ ద్వారా వారిని ఆసుపత్రికి తరలించినట్లు, అనంతరం మ్యాచ్‌ను నిలిపివేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆటగాళ్లకు ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పారు. గడిచిన కొద్ది నెలలుగా మైదానంలో క్రికెట్ ఆటగాళ్ల మరణవార్తలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన నేపథ్యంలో తాజా ప్రమాదంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆస్ట్రేలియన్ అయిన మోసెస్ హెన్రిక్స్ ఐపీఎల్- 8లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.