
క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, తాడేపల్లి: క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి(Nitish Kumar Reddy)కి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మెల్‌బోర్న్(Melbourne)లో చిన్నవయసులోనే సెంచరీ సాధించిన నితీష్‌కు అభినందనలు. 21 సంవత్సరాల వయసులోనే ఈఘనత సాధించటం విశేషం. ప్రపంచ స్థాయి ఆస్ట్రేలియన్ జట్టు మీద నితీష్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. నితీష్ సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గర్వపడేలా చేశారు. నితీష్ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తి దాయకం. నితీష్ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత క్రికెటర్, ఆంధ్రా ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరొ వైపు, వాషింగ్టన్ సుందర్ తో కలిసి రికార్డు నెలకొల్పడం విశేషం.
ఇదీ చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. నితీశ్ రెడ్డి- వాషీ ప్రపంచ రికార్డు