
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
సాక్షి, గుంటూరు: ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. EOS-08 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ని విజయవంతంగా ప్రయోగించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం ప్రపంచ వేదికపై నిలిపిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం(ఆగస్టు16) స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3)ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు.
ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–08)తో పాటు ఎస్‌ఆర్–0 డెమోశాట్ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్ ఆర్బిట్‌లో రాకెట్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి.