
క్రికెట్‌లో విజేతగా నిలిచిన ఏలూరు జిల్లా జట్టు
● క్రికెట్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమస్థానం ● ఉత్తమ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా వంశీ
ఏలూరు రూరల్: విశాఖపట్టణంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏలూరు జిల్లా జట్లు సత్తా చాటాయి. క్రికెట్, బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రథమస్థానంలో నిలిచి జిల్లా ఖ్యాతిని నిలబెట్టారు. మంగళవారం సాయంత్రం విశాఖలోని జీవీఎంసీ ఇండోర్‌స్టేడియంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో ఏలూరు జిల్లా పురుషుల జట్టు ఫైనల్‌లో తిరుపతి జిల్లా జట్టుతో తలపడింది.
జిల్లా క్రీడాకారులు ఆదిరెడ్డి గుణశేఖర్, ఆరేరపు వంశీకృష్ణరాజు ప్రత్యర్థి జట్టును 17–20, 21–16, 17–21 స్కోర్ల తేడాతో ఓడించి జయకేతనం ఎగురవేశారు. క్రికెట్ పోటీల్లో సైతం ఏలూరు జిల్లా జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా పురుషుల జట్టు విశాఖపట్టణం జట్టుతో తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఏలూరు జట్టు 15.4 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విజేత జట్లు షీల్డ్, కప్‌లతో పాటు రెండు జట్లు రూ.6 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు వంశీకృష్ణరాజు ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపిక కాగా, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంశీకృష్ణరాజును దత్తత తీసుకుని ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న వంశీకృష్ణరాజు

ప్రథమస్థానం సాధించిన బ్యాడ్మింటన్ జట్టు
Comments
Please login to add a commentAdd a comment