రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి సీఎస్‌కే ముందుకు వచ్చింది: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Adudam Andhra Key Points | Sakshi
Sakshi News home page

CM YS Jagan: ‘‘ఆడుదాం ఆంధ్ర’’.. క్రీడా సంబరాలపై సీఎం జగన్‌ సమీక్ష.. వివరాలు

Published Thu, Jun 22 2023 4:06 PM | Last Updated on Thu, Jun 22 2023 4:39 PM

CM YS Jagan Review Meeting On Adudam Andhra Key Points - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘ఆడుదాం ఆంధ్ర’’ పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పోటీల నిర్వహణపై  వివరాలను సీఎం జగన్‌కు అందించారు. ఈ క్రమంలో ఈ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఈ క్రీడా సంబరాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు.

ప్రముఖ క్రీడాకారులను భాగం చేయండి..
‘‘చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలి. పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలి. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. రాష్ట్రంలో క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం దిశగా అడగులు వేయాలి. ఇది సాకారం అయ్యాక ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న వైయస్సార్‌ స్టేడియంను.. క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేదిశగా ముందడుగులు వేయాలి. ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలి’’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

సీఎస్‌కే ముందుకు వచ్చింది
ఇక రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందన్న ముఖ్యమంత్రి జగన్‌.. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్‌ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జి వాణీమోహన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement