రామోజీ ఇవేం ‘బురద’ రాతలు | FactCheck: Eenadu False News On Adudam Andhra Competition, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: రామోజీ ఇవేం ‘బురద’ రాతలు

Published Wed, Dec 27 2023 5:20 AM | Last Updated on Wed, Dec 27 2023 10:07 AM

Eenadu false news on adudam andhra competition - Sakshi

మద్దిపాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై రామో­జీరావు బురద జల్లేందుకు విశ్వప్రయత్నం చేస్తు­న్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో కడియాల యానాదయ్య ఉన్నత పాఠశాల గ్రౌండ్‌ బురద­మయమైందని, ఇక్కడ పోటీలు నిర్వహించడానికి కుదరదని ఈనాడు అసత్య కథనం వండివార్చింది. వాస్తవానికి ఈ పాఠశాల ఆటస్థలం బాగు చేయించేందుకు పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యా­యుడు పెద్దిరెడ్డి కోటిరెడ్డి ఇటీవల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీని­వాసరెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌లు ఎంపీ నిధుల నుంచి చెరో రూ. 5 లక్షలు మంజూరు చేశారు.

గ్రౌండ్‌ను పూర్తిగా లెవెల్‌ చేసేందుకు పంచాయతీ అనుమతుల కోసం అర్జీ ఇచ్చారు. సగానికి పైగా గ్రౌండ్‌ను మెరక చేశారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా కొంతమేర పనులు జరగలేదు. మైదానంలో ఓ పక్క మాత్రమే బురద ప్రాంతం ఉండగా.. దానిని ఈనాడు బూత­ద్ధంలో చూపడానికి ప్రయత్నించింది. ఆడుదాం ఆంధ్రా­లో భాగంగా ఇదే మైదానంలో కబడ్డీ, ఖోఖో, ష­టిల్, వాలీబాల్‌ నిర్వహిస్తున్నారు. అయి­తే క్రికె­ట్‌ను సమీపంలోని కారుమూడి వారిపాలెం(గుండ్లాపల్లి) హైస్కూలులో ఆడడానికి అధికా­రులు ఏర్పాట్లు చేశారు.

ఇదే మైదానంలో ఆరు సచి­వాలయం పరిధిలోని టీంలు ఆడుతాయి. మిగిలిన 12 సచివాలయాల పరిధిలోని క్రికెట్‌ టీంలు ఆడేందుకు ఇనమనమెళ్లూరు, తెల్లబాడు హైస్కూళ్లలో క్రీడా మైదానాలను కేటా­యించారు. వాస్తవాలు ఇలా ఉంటే.. పచ్చ పత్రిక వక్రీకరించి రాయడం చూసి స్థానికులు ఛీకొడు­తున్నారు. అబ­ద్ధాల రాత­లు మంచిది కాదని, నిజాలు తెలుసు­కుని రాస్తే బాగుంటుందని పలువురు వ్యాయామ ఉపాధ్యా­యులు, అధికారులు పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement