బాబును ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడుతారు: మంత్రి రోజా | Minister Roja Slams On Chandrababu Over Kuppam Constituency | Sakshi
Sakshi News home page

బాబును ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడుతారు: మంత్రి రోజా

Published Wed, Dec 27 2023 12:27 PM | Last Updated on Wed, Dec 27 2023 1:06 PM

Minister Roja Slams On Chandrababu Over Kuppam Constituency - Sakshi

తిరుపతి: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఆడ పులులు క్రీడల్లో దూసుకుపోతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె బుధవారం శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీలో ఇంటర్ స్టేట్ యూనివర్సిటి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని తెలిపారు. శ్రీపద్మావతి మహిళ యూనివర్సిటీకు వస్తే తన పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తుందని అన్నారు.

చంద్రబాబు నాయుడుకు 175 సీట్లకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్రం పరిస్థితి దేవుడు ఎరుగు.. కుప్పం నియోజకవర్గం అయినా కాపాడుకోవాలని బాబు పర్యటనకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా, 40 ఏళ్లుగా కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రెవెన్యూ డివిజన్‌లో వేల పెన్షన్లు, ఇళ్లు, సంక్షేమ పథకాలను ఇచ్చింది సీఎం జగన్ అని తెలిపారు.

2024లో చంద్రబాబును కుప్పంలో ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతారని మంత్రి రోజా అన్నారు. ఏపీని అభివృద్ధి చేసి సీఎం జగన్ మోహన్రెడ్డి చూపిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ నుంచి  బయటకు  వెళ్తే సూసైడ్ చేసుకున్నట్లేనని ఆమె తెలిపారు. పదవులే పరమావధిగా ఉన్నవాళ్లకు పార్టీలు మారితే భవిష్యత్ ఉండదని మంత్రి రోజా అన్నారు.

చదవండి: AP: తమ్ముళ్ల ‘ఉనికి’పాట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement