సాక్షి, తిరుమల: కూటమి సర్కార్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అలాగే, రాష్ట్రంలో నేరస్థులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, మాజీ మంత్రి రోజా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుంది. కాలేజీ బాత్‌రూమ్‌ల్లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్థులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదు?.
నేను ఏ పార్టీ మారడం లేదు. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. 2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారు. పార్టీ మారడం వల్ల వైఎస్ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం ఉండదు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరు. ప్రజలు అలాంటి వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment