సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమవుతోంది. తెలంగాణ సాంస్కృతిక సంపద ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన సచివాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 8 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన భవన సముదాయాన్ని నిర్శించారు.
పార్లమెంట్ తరహాలో రెడ్‌శాండ్ స్టోన్‌తో రెండు ఫౌంటెయిన్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. సర్వమత సమ్మేళనానికి సంకేతంగా మసీద్, మందిర్, చర్చిల నిర్మాణాలు.. వందలాది వాహనాలు నిలిపేందుకు విశాలమైన పార్కింగ్ స్థలంతో అద్భుతంగా సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. అత్యాధునిక వసతులతో హంగులతో దక్కన్-కాకతీయ ఆర్కిటెక్చర్, సంస్కృతి తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుంది. సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్‌రూం బిర్యానీ!
Comments
Please login to add a commentAdd a comment